Ruler
-
తనను వ్యతిరేకించే వారి మాట కూడా వినేవాడే పాలకుడు: గడ్కరీ
ముంబై: ప్రజాస్వామ్యం, పాలకుల వ్యవహార తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వ్యతిరేకించే వారి మాటను పాలకుడు వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్షగా పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను స్వీకరించి, దానిపై ఆత్మపరిశీలన చేసుకుంటాడని చెప్పారు. రచయితలు, మేధావులు, కవులు నిర్భయంగా తమ భావాలను వ్యక్తీకరించాలని తెలిపారు.పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్ష ఏంటంటే.. ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని అందించినా దాన్ని పాలకుడు సహించవలసి ఉంటుందన్నారు. ఆ ఆలోచనలను పరిగణలోకి తీసుకొని నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.దేశంలో విమర్శకుల అభిప్రాయ బేధాల్లో సమస్య లేదు కానీ.. అభిప్రాయాలను వెల్లడించడంలోనే సమస్య ఉంది. మనం రైటిస్టులు, లెఫ్టిస్టులం కాదు. మనం అవకాశవాదులం. రచయితలు, మేధావులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరుతున్నాం. ఒకరి లోపాలను గుర్తించేందుకు ఎప్పుడూ విమర్శకులు చుట్టుముట్టాల్సిన అవసరం ఉంది. అంటరానితనం, సామాజిక న్యూనత భావం, ఆధిపత్యం కొనసాగినంత కాలం దేశం అభివృద్ధి చెందదని అన్నారు. -
'ఇప్పటికైనా తినడం ఆపేయండి'.. వైరలవుతున్న బాలయ్య హీరోయిన్ పోస్ట్!
విజయదశమి చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ముంబయి భామ వేదిక. ఆ తర్వాత తెలుగులో బాణం, దగ్గరగా దూరంగా, కాంచన-3, రూలర్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ చేసింది. కన్నడలో నటించిన శివలింగ మూవీ ఆమె కెరీర్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. 2019లో ది బాడీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రజాకార్, జంగిల్ సినిమాల్లో నటిస్తోన్న ముద్దుగుమ్మ ఎప్పుటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటోంది. అయితే మూగజీవాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించేలా పోస్టులు పెడుతోంది వేదిక. మాంసాహారం కోసం మూగజీవాలను ఎంతలా హింస పెడుతున్నారంటూ పోరాటం చేస్తోంది. జంతు హింసకు వ్యతిరేకంగా వేదిక పోరాటం చేస్తోంది. ఇటీవల జీ-20 సమ్మిట్ కోసం వీధి కుక్కులను అత్యంగా క్రూరంగా హింసించారంటూ పోస్ట్ పెట్టిన వేదిక.. తాజాగా మరో వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. వేదిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' కోళ్లు, ఆవులు, మేకలు, పందులు మాంసం వెనక ఉన్న భయంకరమైన ఫ్యాక్టరీ ఫారమ్‌ల వెనుక ఉన్న నిజం ఇదే. ప్రపంచవ్యాప్తంగా (భారతదేశంలో కూడా) మాంసం, డైరీ ఫ్యాక్టరీ ఫారాల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవికత ఇదే. మీరు ఇప్పటికైనా ఈ జంతువులను కాపాడేందుకు భాగం కావాలనుకుంటున్నారా?? జంతువులను చంపేందుకు నిధులు ఇవ్వడం ఆపివేయండి. వెగాన్గా(వెజిటేరియన్) మారిపోండి. ఇప్పుడే జంతువులను తినడం మానేయండి. ప్లీజ్ రెస్పెక్ట్ యానిమల్స్' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆమెకు జంతు ప్రేమికులు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ మరికొందరేమో మీరు వేజిటెరియన్గా మారితే.. అందరూ అలాగే ఉండాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా జంతువుల హింస పట్ల ఆమె చేస్తున్న ప్రయత్నం కొద్ది మందిలోనైనా మార్పు వస్తుందేమో వేచి చూద్దాం. View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) -
'పుతిన్ అధ్యక్షుడు కాదు పాలకుడే'
Russian Parliament Gets Proposal: రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్‌ను 'అధ్యక్షుడి'గా కాకుండా "పాలకుడు"గానే పిలవాలని రష్యా పార్లమెంటుకు ఒక ప్రతిపాదని వచ్చింది. పాశ్చాత్య భాషల నుంచి పుట్టుకొచ్చిన పదాలకు దూరంగా ఉండేందుకు పుతిన్‌ను అధ్యక్షుడిగా కాకుండా పాలకుడిగానే పిలవాలని పుతిన్ పార్టీ ఈ ప్రతిపాదన తీసుకు వచ్చింది. పుతిన్‌ని మాస్కోకి విధేయుడిగా భావించే డెమెక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అనే పదాన్ని ఆంగ్లంలో పాలకుడు అని అర్థం వచ్చే ప్రవిటెల్తో భర్తీ చేయాలనుకున్నట్లు పేర్కొంది. అధ్యక్షుడు అనే పదం ఎల్లప్పుడూ తమను ఇబ్బంది గురి చేస్తోందని పుతిన్ పార్టీ పేర్కొంది. 18వ శతాబ్దపు చివరిలో యునైటెడ్ స్టేట్స్లో ఈ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారని, ఆ తర్వాత ఈ పదం ప్రపంచమంతా వ్యాపించిందని పార్టీ సభ్యులు ఆరోపణలు చేశారు. తమ దేశ చారిత్రక ప్రమాణాల ప్రకారం ఇది కొత్త పదం అని, దీనికి రష్యాలో ఎలాంటి మూలాలు లేవని చెబుతున్నారు. రాష్ట్ర అధిపతి లేదా పాలకుడు అనే పదాలు రెండూ రష్యాకి చెందినవని డెమెక్రటిక్ పార్టీ వెల్లడించింది. మాస్కో అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాత్రం ఈ విషయలతో వ్లాదిమిర్ పుతిన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై పుతిన్‌కి ఎలాంటి అభిప్రాయం లేదన్నారు. ప్రస్తుతం ఇవన్నీ చర్చల దశలోనే ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా 2014లో ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో విదేశీ భాషల నుంచి అరువు తెచ్చుకున్న పదాలను భర్తీ చేయడానికి ఒక నిఘంటువుని రూపొందించింది. ఈ నిఘంటువు అరువుగా తెచ్చుకున పదాలు.. రష్యన్ భాషలో ఉన్న వైవిధ్యాలను తెలియజేస్తోంది. పరాయి పదాల ఆధిపత్యం మన సంస్కృతికి, భాషకు ప్రమాదకరం అని, దీనికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని పార్లమెంట్ అధికారి అన్నారు. (చదవండి: ఉక్రెయిన్ పౌరులందరికీ రష్యా పౌరసత్వం.... వేగవంతం చేయాలన్న పుతిన్!) -
UAE President: యూఏఈ అధ్యక్షుడి కన్నుమూత!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇక లేరు. 73 ఏళ్ల షేక్ ఖలీఫా.. శుక్రవారం కన్నుమూసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. షేక్ ఖలీఫా 2014, నవంబర్ 3 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ నుంచి వారసత్వంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. Sheikh Khalifa bin Zayed passes away: 40 days of mourning announced https://t.co/iDFqhzAO4J pic.twitter.com/jsXjR0MQjP — UAE News (@UAENews) May 13, 2022 1948లో పుట్టిన షేక్ ఖలీపా.. యూఏఈకి రెండో అధ్యక్షుడు. ఆ దేశ రాజధాని అబుదాబికి పదహారవ పాలకుడు. ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అయితే చాలాకాలంగా ఆయన అనారోగ్యంతో ఉండడంతో అదే కారణమని తెలుస్తోంది. షేక్ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. యూఏఈ అధ్యక్షుడి మృతికి సంతాపంగా 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. మూడు రోజులపాటు పబ్లిక్, ప్రైవేట్ రంగాలు పూర్తిగా బంద్ పాటించనున్నాయి. గతంలో స్ట్రోక్‌బారిన పడిన ఆయన.. 2014 నుండి బయట కనిపించడం చాలా అరుదుగా జరిగింది. అయినప్పటికీ ఆయన తీర్పులు, కీలక చట్టాలు చేయడం కొనసాగించారు.ఆయన సోదరుడు, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఈ మధ్యకాలంలో పరిపాలనలో చురుకుగా ఉంటూ వస్తున్నారు. షేక్ ఖలీఫా మృతికి భారత ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. I am deeply saddened to know about the passing away of HH Sheikh Khalifa bin Zayed. He was a great statesman and visonary leader under whom India-UAE relations prospered. The heartfelt condolences of the people of India are with the people of UAE. May his soul rest in peace. — Narendra Modi (@narendramodi) May 13, 2022 -
ఊరిని కొని దానమిచ్చిన పాలకుడు
సాక్షి, హైదరాబాద్: అదో ఊరు.. వాగు ఒడ్డున ఉంది. స్థానిక పాలకుడు దానికి సరిపడా పైకం ఇచ్చి కొనుగోలు చేసి దాన్ని అగ్రహారంగా దానమిచ్చాడు. ఇలా ఊరిని కొని దానమివ్వటం కొంత విచిత్రంగా అనిపించే వ్యవహారమే అయినా.. తాజాగా వెలుగు చూసిన ఓ శాసనం ఇదే విషయాన్ని చెబుతోంది. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి సమీపంలో ఉన్న దొమ్మాట గ్రామం కథ ఇది. అది 14వ శతాబ్దం. స్థానిక పాలకుడు పైడిమర్రి నాగా నాయనిగారనే స్థానిక పాలకుడు ఈ గ్రామాన్ని తగు పైకం చెల్లించి కొనుగోలు చేశాడు. తర్వాత దాన్ని అగ్రహారంగా బ్రాహ్మణ కుటుంబాలకు దానం చేశాడు. అప్పటి నుంచి దొమ్మాట అగ్రహారంగా ఆ ఊరు కొనసాగింది. ఆ తర్వాత ఓసారి గ్రామానికి సమీపంలోనే ఉన్న కృష్ణమ్మ చెరువు, గురుజకుంట వాగు పొంగి గ్రామం మునిగిపోయింది. దీంతో వ్యవసాయ పొలాల ఆధారంగా కొందరు వాగుకు ఆవల, కొందరు వాగుకు ఈవల ఇళ్లు కట్టుకోవటంతో క్రమంగా రెండు ఊళ్లుగా అవి ఎదిగాయి. కొందరు ఆ దొమ్మాట ఊళ్లోని గుళ్ల శిల్పాలు, వీరగళ్లులు, శాసనాన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఆ శాసనం పొలాల మధ్య పడి ఉండగా తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ దాన్ని గుర్తించారు. ఇది దొమ్మాట గ్రామ శాసనమేనని, అందులో.. ‘పాహిడిమరి నాగాన్నాయనిగారు ధారణశేశి ఇచ్చిన అగ్రహారం దొమ్మాటకుంను ఆ బుని..దేయాన్న జొమా..న.. అన్న పంక్తులు (కొన్ని అక్షరాలు మలిగిపోయాయి) ఉన్నాయని శాసనాన్ని గుర్తించిన చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. శాసనంపైన సూర్యచంద్రుల గుర్తులున్నాయి. కానీ అది ఏ చక్రవర్తి/రాజు హయాంలో చోటుచేసుకుందో శాసనంలో ప్రస్తావించలేదు. -
బోయపాటి చిత్రంలో బాలయ్య లుక్.. అదుర్స్!
‘రూలర్’చిత్రంలో ఐరన్ మ్యాన్ లుక్‌లో కనిపించి అదరగొట్టారు నందమూరి బాలకృష్ణ. తన చిత్రాల్లోన్ని పాత్రలకు పూర్తి న్యాయం చేయడానికి భాష, వేషం, ఆహార్యం పూర్తిగా మార్చేసుకోవడంలో ఆయన ఏ మాత్రం వెనకాడరు. తాజాగా మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్‌లలో కనిపించనున్నట్లు సమాచారం. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని బాలయ్య పాత్రను డిఫరెంట్‌గా డిజైన్ చేశారట బోయపాటి. దీనిలో భాగంగా ఈ చిత్రంలో ‘ఆఘోర’ క్యారెక్టర్లో బాలయ్య కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్. ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ వారణాసిలో ప్రారంభమైంది. కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వారణాసి నుంచి తిరిగొచ్చారు. అయితే ఈ మధ్య ఓ కార్యక్రమంలో బాలయ్య డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చారు. చిన్నపాటి జుట్టు, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోయపాటి సినిమాల్లో ఆయన లుక్ ఇదేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అప్పట్లో గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఈ నందమూరి నటసింహం. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు. అంజలి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: 2008లో ఓ వ్యక్తిని ప్రేమించా: అనుష్క అమలా పరిణయం -
బాలయ్య న్యూలుక్ అదిరింది!!
నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ మధ్యనే వచ్చిన ‘రూలర్’ చిత్రంలో స్టైలీష్ లుక్‌లో ఆకట్టుకున్న బాలయ్య తాజాగా గుండుతో దర్శనమిచ్చాడు. ఖద్దర్ బట్టలతో, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో భాగంగానే బాలయ్య గుండు చేయించుకున్నారని టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్యను డిఫరెంట్ షేడ్స్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నారట బోయపాటి శ్రీను. అంతేకాకుండా మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇందులో భాగంగానే పూర్తి మాస్ యాంగిల్లో కనిపించే విధంగా బాలయ్య గుండుతో కనిపించనున్నారని సమాచారం. అయితే బాలయ్యకు సంబంధించి ఈ న్యూలుక్ సినిమా కోసమా లేక సాధారణంగా దిగిన ఫోటోనా తెలియాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా తాను ఏ పాత్ర చేసినా అందులో లీనమవడంతో పాటు ఆ పాత్ర కోసం ఏం చేయడానికైనా బాలకృష్ణ సిద్దంగా ఉంటాడు. ‘రూలర్’ సినిమా కోసం బరువు తగ్గి ఐరన్ మ్యాన్ లుక్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో పాటు అంతకుముందు వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో బాలయ్యతో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా బోయపాటి శ్రీనివాస్ పైనే ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రంతోనైనా బాలయ్య సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్ర రిలీజ్ డేట్ గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీనే(జులై 30న) ఈ చిత్రం రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జులై 30న ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే అవకాశం లేకపోవడంతో అదే తేదీన ఈ చిత్రం రిలీజ్ చేస్తే అన్నివిధాల కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ డేట్‌ను కూడా బుక్ చేసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: ‘రూలర్’ మూవీ రివ్యూ అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’ -
‘రూలర్’ సక్సెస్ మీట్
-
మా ప్రయత్నాన్ని ఆదరించారు
‘‘రూలర్ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మేం ఓ మంచి ప్రయత్నం చేశాం.. మా ప్రయత్నానికి విజయాన్ని అందించారు. సి.కల్యాణ్‌గారితో నేను చేసిన మూడో సినిమా ఇది. మంచి కథా విలువలున్న చిత్రం చేయాలని భావించే ఆయనకు నా తరఫున, అభిమానుల తరఫున కృతజ్ఞతలు’’ అని బాలకృష్ణ అన్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రూలర్’. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (డిసెంబర్ 20) విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ పరుచూరి మురళిగారు మంచి కథ, డైలాగ్స్‌ను అందించారు. ఈ కథలో మంచి సందేశాన్ని కూడా చొప్పించినందుకు ఆయనకు థ్యాంక్స్. ఆర్టిస్టుల దగ్గర నుంచి తనకు ఏం కావాలో రాబట్టుకునే దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌గారు. ఆయన నిర్మాతల దర్శకుడు కూడా. మా సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘జై సింహా’ తర్వాత మా కాంబినేషన్ లో వచ్చిన ‘రూలర్’ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మా కాంబినేషన్లో వచ్చే తర్వాతి చిత్రం ‘రూలర్’ కంటే మంచి చిత్రం అవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు వెరీ హ్యాపీ’’ అన్నారు వేదిక. ‘‘జైసింహా’ తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన ‘రూలర్’కి సినిమాటోగ్రఫీ అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు కెమెరామేన్ రాంప్రసాద్. ‘‘కల్యాణ్‌గారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని పరుచూరి మురళి అన్నారు. -
రివ్యూ: ‘రూలర్’ చిత్రం ఎట్లుందంటే?
మూవీ: రూలర్ జానర్: యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు: బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, భూమిక, జయసుధ, షియాజీ షిండే, ప్రకాష్‌రాజ్, పరాగ్ త్యాగి, నాగినీడు, ఝాన్సీ సంగీతం: చిరంతన్ భట్ దర్శకత్వం: కె.ఎస్ రవికుమార్ నిర్మాత: సి. కల్యాణ్ నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఈ హీరో సినిమా వస్తే ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కు డబుల్ ధమాకానే. వారికి కావాల్సిన ఫుల్ మాస్ ఎలిమెంట్స్ బాలయ్య సినిమాలో చూడొచ్చనే ఎగ్జైట్మెంట్తో ఉంటారు. ఇక తమిళనాట స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన కెఎస్ రవికుమార్ బాలయ్య బాబుతో రెండో సారి జత కట్టి ‘రూలర్’ ను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, ట్రైలర్లతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో భారీ అంచనాల నడుమ శుక్రవారం ‘రూలర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? నయా లుక్స్‌లో బాలయ్య ఏ మేరకు ఆకట్టుకున్నారు? ‘రూలర్’తో బాలకృష్ణ ఈ ఏడాదిని ఘనంగా ముగించారా? అనేది రివ్యూలో చూద్దాం. కథ: ఈ సినిమా కథ ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ప్రారంభమై వయా రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. సరోజిని నాయుడు(జయసుధ)కు చెందిన పలు కంపెనీల బాధ్యతలను రెండేళ్లు విదేశాల్లో ఐటీ రంగంపై ప్రత్యేక శిక్షణ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తన వారసుడు అర్జున్ ప్రసాద్(బాలకృష్ణ)కు అప్పగిస్తారు. అయితే పోటీ ప్రపంచంలో భాగంగా తన ప్రత్యర్థి కంపెనీకి చెందిన హారిక(సోనాల్) అర్జున్‌కు తారసపడుతుంది. ఈ క్రమంలోనే అర్జున్‌తో హారిక ప్రేమలో పడుతుంది. అయితే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉత్తరప్రదేశ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అర్జున్ ప్రసాద్ భావిస్తాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సరోజిని నాయుడు అడ్డుపడతారు. ఈ ప్రాజెక్ట్‌కు తన తల్లి ఎందుకు అడ్డుపడుతుందో తెలుసుకొని ఉత్తర ప్రదేశ్ బయల్దేరుతాడు అర్జున్. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. యూపీలో అర్జున్ను అందరూ పోలీస్ అఫీసర్ ధర్మ అని పిలుస్తారు. ఇదే క్రమంలో లోకల్ మినిస్టర్ భవానీనాథ్ ఠాగూర్(పరాగ్ త్యాగీ) అర్జున్‌పై దాడి చేయిస్తాడు. దీనికి గల కారణాలు ఏంటి? అసలు ధర్మ, అర్జున్ ఒక్కరేనా? లేక వేరువేరా?. అసలు ఈ కథలోకి సంధ్య(వేదిక), సీతారామయ్య(నాగినీడు), నిరంజనా ప్రసాద్(భూమిక)లు ఎందుకు ఎంటర్ అవుతారు? వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: ఈ సినిమాలో రెండు ఢిపరెంట్ షేడ్స్‌లో కనిపించిన బాలయ్య తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రేమనని.. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోనని ఈ సినిమాతో నిరూపించారు. ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ఇరగదీశాడు. సినిమా మొత్తం ఒంటి చేత్తో నడిపించాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చిత్రంలో బాలయ్య వేసిన స్టెప్పులకు థియేటర్లో ఒకటే ఈలలు గోలలు. ఇక నటనకు పెద్ద స్కోప్ లేకపోయినప్పటికీ గ్లామరస్ పాత్రల్లో హీరోయిన్లు సోనాల్, వేదికలు ఆకట్టుకున్నారు. వారి అందచందాలతో కుర్రకారును కట్టిపడేశారు. మరోవైపు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భూమికకు ఈ చిత్రంలో ఎలాంటి డైలాగ్‌లు లేవు. కానీ స్టోరీ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. మిగతా పాత్రల్లో నాగినీడు, ప్రకాష్‌రాజ్, పరాగ్ త్యాగి, ఝాన్సీ, తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: ‘నలభైకి పైగా అంతస్థుల గల మేడ నుంచి పడిపోతున్న ఓ యువతిని హెలికాప్టర్లో వచ్చి బాలయ్య కాపాడతాడు’. ఈ ఒక్క సీన్‌తో అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుందో. బాలకృష్ణ సినిమా అంటే ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో నందమూరి ఫ్యాన్స్ ఊహించని సీన్లు, హీరో ఎలివేషన్ షాట్స్, ఫైట్లు హై రేంజ్లో ఉన్నాయి. ‘ఎన్టీఆర్’ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత వచ్చే చిత్రం అన్ని హంగులతో ఉండాలని భావించిన బాలకృష్ణ.. తన తదుపరి చిత్రం కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన కెఎస్ రవికుమార్‌కు అప్పగించాడు. అయితే బాలయ్య బాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుబు నూటికినూరు శాతం నిలబెట్టుకోలేకపోయాడు. కేవలం బాలకృష్ణ ఇమేజ్ను మాత్రమే పరిగణలోకి తీసుకుని డైరెక్టర్ కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథలో ఏదో మూలన కాస్త కొత్త దనం కనిపించినప్పటికీ.. దానిని అటుతిప్పి ఇటుతిప్పి రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మలిచాడు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్, ఫైట్స్, కమర్షియల్ హంగుల మీద దృష్టిపెట్టినంత శ్రద్ద కథ, కథనంపై పెడితే ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక రెండో అర్థబాగంలో పోలీస్ ఆఫీసర్‌గా వచ్చే బాలయ్య లుక్ సగటు ప్రేక్షకుడికి రుచించలేదు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్లు, ఇంగ్లీష్ డైలాగ్ సోనాల్ అందచందాలు, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్, శ్రీనివాస్ రెడ్డి బృందం కామెడీతో ఫస్టాఫ్ సక్సెస్ ఫుల్‌గా ముగుస్తుంది. తొలి అర్థభాగం ముగిసే సరికి సినిమా అసలు కథలోకి ఎంటర్ కాదు. అయితే సెకండాఫ్‌లో అసలు స్టోరీలోకి ఎంటర్ అయ్యాక సినిమా ఎటో వెళ్లిపోతుంది. దీనిపై దర్శకుడు తన సీనియార్టీని ఉపయోగించి అభిమానులను కాస్త మెస్మరైజ్ చేయాల్సింది. కానీ దర్శకుడు ఏమాత్రం తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించలేదని ఈ సినిమాతో అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే సినిమాకు చాల ప్లస్‌గా నిలిచింది డ్యాన్స్. బాలయ్య ఇమేజ్ను పరిగణలోకి తీసుకుని డ్యాన్స్‌లను ఎక్సలెంట్‌గా కంపోజ్ చేశారు మూవీ కొరియోగ్రాఫర్స్. ఫార్మేషన్స్, బాలయ్యకు ఆప్ట్ అయ్యే స్లైలీష్ స్టెప్పులను కంపోజ్ చేశారు. సినిమాకు మరోప్లస్ పాయింట్స్ ఫైట్స్. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించిన ఫైట్లు వారిని మైమరిపిస్తాయి. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సాంగ్స్, హీరోయిన్ ఎంట్రీ సీన్లలో కెమెరా పనితనం కనిపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాకు తగ్గట్టు పాటలను కంపోజ్ చేశాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో రఫ్పాడించాడు. అయితే ఎడిటింగ్, స్క్రీన్ ప్లేపై కాస్త దృష్టి పెట్టాల్సి ఉండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఓవరాల్‌గా సినిమా గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షోతో సినిమాను బాలయ్య నెట్టుకొచ్చాడు. బాలకృష్ట కష్టానికి తగ్గట్టు దర్శకుడు తన ప్రతిభను ప్రదర్శిస్తే సినిమా వేరే రేంజ్లో ఉండేది. ప్లస్ పాయింట్స్ బాలకృష్ణ ఎనర్జీ డ్యాన్స్ ఫార్మేషన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ దర్శకత్వ విలువలు ఎడిటింగ్ సాగదీత సీన్లు సినిమా నిడివి కథనంలో కొత్తదనం లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను
‘‘చేసే పనిపై ఏకాగ్రతతో ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఆ ఏకాగ్రతే క్రమశిక్షణ, అంకితభావం, నిజాయతీలను అలవరుస్తుంది’’ అన్నారు కేయస్ రవికుమార్. బాలకృష్ణ హీరోగా ఆయన దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మించిన ‘రూలర్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్ రవికుమార్ చెప్పిన విశేషాలు. ► ముందుగా ‘రూలర్’ సినిమాకు వేరే కథ అనుకున్నమాట వాస్తవమే. కానీ పరుచూరి మురళి చెప్పిన కథ నచ్చడంతో కొన్ని చిన్న మార్పులతో ‘రూలర్’ సినిమా చేశాం. మొదట అనుకున్న కథను వద్దనుకోవడానికి పెద్ద కారణాలు లేవు. ఉత్తరప్రదేశ్‌లోని తెలుగువారికి చెందిన కథ ఇది. సినిమాలోని ఈ సినిమా బాలకృష్ణగారి అభిమానులకే కాదు... ఇతర ప్రేక్షకులకూ నచ్చుతుంది. ‘జై సింహా’ తర్వాత వెంటనే నేను బాలకృష్ణగారితో ‘రూలర్’ చేశాను. ఈ సినిమా కోసం బాలకృష్ణగారు బరువు తగ్గారు. ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి వర్కౌట్స్ చేసేవారట. ► నా కెరీర్లో ముందుగా చిన్న సినిమాలు చేసి, ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం హీరో ఇమేజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాను. ‘రూలర్’ సినిమాని బాలకృష్ణగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకునే చేశా. తన అసిస్టెంట్లు తప్పు చేసినప్పుడు మాత్రమే బాలకృష్ణగారు సెట్లో కోప్పడతారు. అది కూడా అన్ని సందర్భాల్లో కాదు. ప్రణాళిక ప్రకారం అన్నీ జరగకపోతే సెట్లో నేనూ షార్ట్ టెంపరే. ► నా కెరీర్ మొదట్లో దాదాపు పదేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. అప్పుడు సినిమా ఎలా తీయాలి? అనే దానికంటే కూడా... ఒక సినిమా ఎందుకు ఫెయిల్ అవుతుంది? సినిమాను ఎలా తీయకూడదు? ఏం తప్పులు చేయకూడదు? అనే అంశాలనే ఎక్కువగా నేర్చుకున్నాను. ► ప్రీ–ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పక్కాగా ప్లాన్ చేసుకుంటే పెద్ద స్టార్స్‌తో సినిమా లను కూడా త్వరగా పూర్తి చేయవచ్చు. ‘రూలర్’ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేశాం. గతంలో చిరంజీవిగారి ‘స్నేహాంకోసం’ సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేశాను. ఆ సినిమా చేసేటప్పుడే రజనీకాంత్‌గారి ‘నరసింహా’ సినిమాకి డైలాగ్స్ రాసుకున్నాను. పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసేప్పుడు ఈగో ఉండకూడదు. హీరో ఇమేజ్‌ని డైరెక్టర్ గౌరవించాలి. డైరెక్టర్‌ను హీరో గౌరవించాలి. నటీనటులకు లొకేషన్లో నటించి చూపిస్తాం కాబట్టి దర్శకులకు కూడా నటన వచ్చేస్తుంది. ప్రస్తుతం నేను కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో రవితేజ సినిమాలో ఓ పాత్ర చేయాల్సింది. కానీ కుదర్లేదు. -
రూలర్ సాంగ్: యూత్ గుండెల్లో అలారమే..
గర్జించే రూలర్ రొమాంటిక్‌గా మారిపోయాడు. హీరోయిన్‌తో కలిసి అదుర్స్ అనేలా స్టెప్పులేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రూలర్’. ఇందులో సోనాల్ చౌహాన్, వేదిక కథాయికలుగా నటిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన అందమైన పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియోలో బాలయ్య బాబు సోనాల్ చౌహాన్‌తో కలిసి అందమైన లొకేషన్లలో చిందులు వేస్తున్నాడు. ‘యాలయాల ఇయ్యాల డియ్యా డియ్యాల..’ అంటూ సాగుతున్న ఈ పాట మెలోడీ గీతంతో అలరిస్తోంది. డైలాగులతో కేక పుట్టించే బాలయ్య కాస్త రూటు మార్చి హీరోయిన్‌తో రొమాన్స్ పండించాడు. లొకేషన్ల ఎంపికతోపాటు హీరోహీరోయిన్ల కాస్ట్యూమ్స్ పాటకు సరితూగేలా ఉన్నాయి. ‘అలారమేదో మోగినాది గుండె మారుమూల..’ అంటూ సాగే ఈ పాట యూత్ గుండెల్లో అలారం మోగించేట్లు కనిపిస్తోంది. అనురాగ్ కులకర్ణి, అనుష మణిలు ఈ గీతాన్ని ఆలపించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. చదవండి: ఆ స్ఫూర్తితోనే రూలర్ చేశాం -
ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బంది అదే!
‘‘లెజెండ్’ సినిమాలో తొలిసారి బాలకృష్ణగారి సరసన యాక్ట్ చేశాను. పెద్ద సూపర్‌స్టార్‌తో ఎలా వర్క్ చేస్తాం అని టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు బాలకృష్ణగారితో మూడో సినిమా చేశాను. బాలకృష్ణగారి సినిమా అంటే ఓకే అనేస్తున్నాను. వీలుంటే ఆయనతోనే వంద సినిమాలయినా చేస్తాను’’ అన్నారు సోనాల్ చౌహాన్. బాలకృష్ణ హీరోగా సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘రూలర్’. ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా సోనాల్ చెప్పిన విశేషాలు. ►‘రూలర్’ చిత్రంలో నా పాత్ర పేరు హారిక. కావాలనుకున్నది సాధించుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి. ఓ విషయంలో హీరోతోనే పోటీ పడాల్సి వస్తుంది. నా పాత్ర ఫుల్ గ్లామరస్‌గా ఉంటుంది. కామెడీ కూడా చేశాను. ఈ సినిమాలో బాలకృష్ణగారు రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ఒకటి మాస్ గెటప్. ►ఒక యాక్టర్ ఒక పాత్ర చేసి అది బాగా హిట్ అయితే అన్నీ అలాంటి పాత్రలే వస్తాయి. మన ఇండస్ట్రీలో ఇబ్బందే అది. ఆ యాక్టర్ ఇక ఆ పాత్రలే చేయాలన్నట్టు చూస్తారు. యాక్టర్ అన్నాక అన్ని పాత్రలు చేయాలి. నాకు పల్లెటూరి అమ్మాయి పాత్ర చేయాలనుంది. భవిష్యత్తులో డిజిటల్ మాధ్యమమే టాప్‌లో ఉంటుందనుకుంటున్నాను. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేశాను. ప్రస్తుతం హిందీలో ఓ సినిమా, తెలుగులో ఓ పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయింది. -
అందుకే తెలుగులో వీలు కుదర్లేదు
‘‘ఒక్కో ఇండస్ట్రీ ఒక్కోలాంటి సినిమాలు తీస్తుంది. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో నేను సినిమాలు చేస్తుంటాను. పలు భాషల్లో సినిమాలు చేయడం వల్ల విభిన్నత చూపించడానికి నటిగా నాకు మంచి అవకాశం అనుకుంటాను’’ అన్నారు వేదిక. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూలర్’. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ‘బాణం, విజయ దశమి, దగ్గరగా దూరంగా’ సినిమాల్లో కనిపించి వేదిక 7 ఏళ్ల విరామం తర్వాత ‘రూలర్’ అనే తెలుగు సినిమా చేశారు. ఈ సందర్భంగా వేదిక పంచుకున్న విశేషాలు... ► ఇతర భాషల్లో సినిమాలతో బిజీగా ఉండటంతో తెలుగులో సినిమాలు చేసే వీలు కుదర్లేదు. అక్కడ వరుస చిత్రాలతో ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. నాకు తెలుగులో మేనేజర్ కూడా లేరు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన 3’ తమిళంలో, తెలుగులో హిట్ అయింది. నా పాత్రకు మంచి స్పందన రావడంతో ‘రూలర్’కి నన్ను సంప్రదించారు. ► బాలకృష్ణగారిలాంటి పెద్ద స్టార్ సినిమాలో అవకాశం రావడం మంచి అవకాశంగా భావించాను. కేఎస్ రవికుమార్‌గారు చాలా మంచి సినిమాలు తీశారు. ఈ సినిమాను పూర్తి చేయాలంటే ఏడాది పడుతుంది. కానీ, మూడున్నర నెలల్లో పూర్తి చేశారాయన. సి.కల్యాణ్‌గారు రాజీపడకుండా క్వాలిటీతో తెరకెక్కించారు. ► ‘రూలర్’ సినిమాలో నా పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి సంప్రదాయబద్ధంగా, మరొకటి ఫుల్ గ్లామరస్‌గా ఉండేది. డామినేటింగ్‌గా ఉండే పాత్ర నాది. సప్తగిరితో కలసి కామెడీ చేస్తాను. నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఈ సినిమాలో పాత్రలానే నేనూ డామినేటింగే. కానీ నా ఫేస్ అలా కనిపించదు(నవ్వుతూ). ► బాలకృష్ణగారి ఎనర్జీ సూపర్. డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను(నవ్వుతూ). ఆయన డైలాగ్స్, యాక్టింగ్‌లో ఒక స్టయిల్ ఉంటుంది. ఆయన అందర్నీ సమానంగా చూసుకుంటారు. -
ఆ స్ఫూర్తితోనే రూలర్ చేశాం
‘‘రైతుల మీద సినిమాలు చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఓ సందర్భంలో చాలామందిని కలిశాను కూడా. కానీ కుదర్లేదు. ‘రూలర్’ సినిమాతో ఆ కోరిక కొంత తీరింది’’ అన్నారు బాలకృష్ణ. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘రూలర్’. ఇందులో వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్లో సినిమా ట్రైలర్‌ను దర్శకుడు బోయపాటి శీను, నందమూరి రామకృష్ణ విడుదల చేశారు. బాల కృష్ణ మాట్లాడుతూ–‘‘నేనూ, కల్యాణ్, కేఎస్ రవికుమార్ కలిసి చేసిన ‘జై సింహా’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే ‘రూలర్’ సినిమా తీశాం. మొదట్లో ఈ సినిమాకు మరో కథ అనుకున్నాం. కుదర్లేదు. ఆ సమయంలో నేను పరుచూరి మురళిగారికి ఫోన్ చేశాను. ఆయన దగ్గర ఉన్న ఓ కథను వినిపించారు. ఆ కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయించు కున్నాను. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, కొత్తదనం అందించాలనే ప్రయత్నాలు చేస్తుంటాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు చేశాను. కళామతల్లికి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని అన్నారు. ‘‘రూలర్’ అనే పేరు బాలకృష్ణగారికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తమిళంలో రవికుమార్‌గారు చేసిన సినిమాలు మాలాంటి దర్శకులకు రిఫరెన్స్లా ఉపయోగపడతాయి. సి.కల్యాణ్‌గారికి అభినందనలు’’అన్నారు బోయపాటి శీను. ‘‘ఇండస్ట్రీలో నాకు బాగా సపోర్ట్ అందించిన వ్యక్తి బాలకృష్ణగారు. కేఎస్ రవికుమార్ సూపర్ డైరెక్టర్. సి.కల్యాణ్‌గారితో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఇంతమంది నాకు కావాల్సిన వ్యక్తులు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘జైసింహా’ తర్వాత మా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ఇది. టీమ్ అందరూ ఎంతగానో కష్టపడ్డారు’’ అన్నారు కేఎస్ రవికుమార్. ‘‘బాలకృష్ణగారు ఈజ్ గ్రేట్’ అనేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు సి. కల్యాణ్. కథానాయికలు సోనాల్ చౌహాన్, వేదిక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, అంబికా కృష్ణ, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘రూలర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
దుమ్ములేపిన బాలయ్య.. రూలర్ ట్రైలర్ రిలీజ్
నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటేనే మాస్ డైలాగులు, దుమ్ములేచిపోయే ఫైట్ సీన్స్‌కి కేరాఫ్ అడ్రస్. తన అభిమానులు కూడా ఆయన నుంచి అదే కోరుకుంటారు. సింహా, లెజెండ్ వంటి మాస్ సినిమాలతో ఓ ట్రెండ్ సృష్టించిన బాలయ్య.. మరోసారి అదే ఊపుతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. ఆయన కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్’ ట్రైలర్ వచ్చేసింది. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటివరకూ ‘రూలర్’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన బాలకృష్ణ స్టైలిష్, మాస్లుక్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజా ట్రైలర్ మరింత ఆసక్తికరంగా సాగింది. దుమ్ములేపే ఫైట్లు, తూటాల్లాంటి డైలాగులతో ట్రైలర్లోనే బాలయ్య రెచ్చిపోయాడు. ‘ఇది దెబ్బతిన్న సింహాంరా.. అంత తొందరగా చావదు. వెంటాడి వేటాడి చంపుద్ది’ అంటూ బాలయ్య పలికే డైలాగు అదిరిపోయింది. సినిమాలో ఆయన చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌ను మరింత విపరీతంగా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ తీవ్ర నిరాశను మిగల్చడంతో.. రూలర్‌పై బాలకృష్ణ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సినిమాలో ఆయన గెటప్, డ్రస్, డైలాగ్స్‌ను చూస్తే ఇది అర్థమవుతుంది. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అదిరిపోయిన బాలయ్య 'రూలర్' ఫస్ట్ సాంగ్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రూలర్’. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి భారీ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి భారీ రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ చిత్రం నుంచి ‘అడుగడుగో యాక్షన్ హీరో.. అరే దేఖో యారో..’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ అందించగా, సాయిచరణ్ సాయిచరణ్ భాస్కరుని ఆలపించాడు. చిరంతన్ భట్ సంగీతం అందించాడు. సినిమాలో బాలకృష్ణ పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా లిరిక్స్ ఉన్నాయి. హీరో పవర్ తెలియజేసేలా రామజోగయ్య లిరిక్స్ అందించారు. -
గుమ్మడికాయ కొట్టారు
‘రూలర్’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటించారు. సి. కల్యాణ్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. ‘‘మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో పాటల లిరికల్ వీడియోను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సీవీ రావ్, పత్సా నాగరాజు సహ–నిర్మాతలు. -
ఇక వేటే
‘‘ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫామ్ తీశానా... బయటకు వచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే’’ అని ‘రూలర్’ టీజర్లో విలన్‌కు పవర్ఫుల్ వార్నింగ్ ఇస్తున్నారు బాలకృష్ణ. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. సి. కల్యాణ్ నిర్మాత. ఈ చిత్రం టీజర్ గురువారం రిలీజ్ అయింది. టీజర్లో రెండు డిఫరెంట్ గెటప్స్‌తో బాలకృష్ణ కనిపించారు. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్. -
రెచ్చిపోయిన బాలయ్య.. రూలర్ టీజర్
నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్’. టీజర్ వచ్చేసింది. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటివరకూ ‘రూలర్’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన బాలకృష్ణ స్టైలిష్, మాస్లుక్లు సినిమాపై అంచనాలను పెంచగా, టీజర్ మరింత ఆసక్తికరంగా సాగింది. ‘ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బయటకు వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే..’ అంటూ బాలకృష్ణ పలికిన డైలాగ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న‘రూలర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. -
రొమాంటిక్ రూలర్
ప్రేయసితో ప్రణయ గీతాలా పన చేస్తున్నారు బాలకృష్ణ. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. సి.వి. రావ్, పత్సా నాగరాజు సహ–నిర్మాతలు. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు బాలకృష్ణ. అందులో ఒకటి పోలీసాఫీసర్. మరొకటి ఐటీ ప్రొఫెషనల్ అని సమాచారం. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ మున్నార్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఓ మెలోడీ సాంగ్‌ను బాలకృష్ణ, వేదికలపై చిత్రీకరిస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ‘రూలర్’ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. -
బాలయ్య అభిమానులకు మరో సర్ప్రైజ్ గిప్ట్
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రూలర్’. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య స్టైలీష్ లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన చిత్ర పోస్టర్ అభిమానులను అలరిస్తోంది. తాజాగా బాలయ్య అభిమానులను మరోసారి సర్ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. ‘రూలర్’లో బాలయ్యకు సంబంధించిన మరో లుక్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా టీజర్ వెరీ సూన్ అంటూ పేర్కొంది. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్లో బాలయ్య స్టెప్పులేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో పాటు అతడు వేసుకున్న షూస్ ట్రెండీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య తన రూపం, ఆహార్యం పూర్తిగా మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివర దశకు చేరడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు ‘రూలర్’ చిత్ర యూనిట్. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ ,భూమిక కీలక పాత్రలు పోషించారు. రూలర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘ఎన్టీఆర్’కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు నిరాశపర్చడంతో పాటు ఎన్నికలు రావడంతో బాలయ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. దీంతో లాంగ్య్ గ్యాప్ తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘రూలర్’పై నందమూరి అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా పూర్తైన తరువాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు. సినిమా కథ ఇప్పటికే పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు సమాచారం. Presenting you the Stylish look of #NBK from #Ruler Teaser Coming Soon!#NandamuriBalakrishna @sonalchauhan7 @Vedhika4u@prakashraaj @bhumikachawlat#KSRaviKumar @bhattchirantan@HaappyMovies @CKEntsOffl #RulerOnDec20 pic.twitter.com/nVWqkxqJRr — Haappy Movies (@HaappyMovies) November 9, 2019 -
అది బాలయ్య టైటిల్ కాదు..!
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఆ తరువాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి. సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి హీరోయిన్ ఎవరు టైటిల్ ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే హీరోయిన్గా నయనతారను కన్ఫామ్ చేశారు చిత్రయూనిట్. చిత్ర నిర్మాణ సంస్థ ఇటీవల ఛాంబర్లో రూలర్ అనే టైటిల్ రిజిస్టర్ చేయటంతో అదే బాలయ్య సినిమా టైటిల్ అన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని చిత్ర యూనిట్ ఖండించారు. ప్రస్తుతానికి సినిమాకు ఏ టైటిల్ నిర్ణయించలేదని తెలిపారు. రూలర్‌తో పాటు జయసింహా, రెడ్డి గారు లాంటి టైటిల్స్ బాలయ్య సినిమాకు పరిశీలనలో ఉన్నాయి. -
బాలయ్య 102 కోసం పవర్ ఫుల్ టైటిల్..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన నెక్ట్స్ సినిమాను కూడా ఫైనల్ చేశాడు బాలకృష్ణ. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమాను ఆగస్టు 2న కుంభకోణంలో ప్రారంభించనున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్ర నిర్మాత సీ కళ్యాణ్, తన సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూలర్ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. దీంతో ఈ పవర్ఫుల్ టైటిల్ బాలయ్య కోసమే అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. బాలయ్య ఇమేజ్‌కు రూలర్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. అయితే ఈ టైటిల్ నిజంగా బాలయ్య కోసమా.. కాదా తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.