సోనాల్ చౌహాన్
‘‘లెజెండ్’ సినిమాలో తొలిసారి బాలకృష్ణగారి సరసన యాక్ట్ చేశాను. పెద్ద సూపర్‌స్టార్‌తో ఎలా వర్క్ చేస్తాం అని టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు బాలకృష్ణగారితో మూడో సినిమా చేశాను. బాలకృష్ణగారి సినిమా అంటే ఓకే అనేస్తున్నాను. వీలుంటే ఆయనతోనే వంద సినిమాలయినా చేస్తాను’’ అన్నారు సోనాల్ చౌహాన్. బాలకృష్ణ హీరోగా సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘రూలర్’. ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా సోనాల్ చెప్పిన విశేషాలు.
►‘రూలర్’ చిత్రంలో నా పాత్ర పేరు హారిక. కావాలనుకున్నది సాధించుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి. ఓ విషయంలో హీరోతోనే పోటీ పడాల్సి వస్తుంది. నా పాత్ర ఫుల్ గ్లామరస్‌గా ఉంటుంది. కామెడీ కూడా చేశాను. ఈ సినిమాలో బాలకృష్ణగారు రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ఒకటి మాస్ గెటప్.
►ఒక యాక్టర్ ఒక పాత్ర చేసి అది బాగా హిట్ అయితే అన్నీ అలాంటి పాత్రలే వస్తాయి. మన ఇండస్ట్రీలో ఇబ్బందే అది. ఆ యాక్టర్ ఇక ఆ పాత్రలే చేయాలన్నట్టు చూస్తారు. యాక్టర్ అన్నాక అన్ని పాత్రలు చేయాలి. నాకు పల్లెటూరి అమ్మాయి పాత్ర చేయాలనుంది. భవిష్యత్తులో డిజిటల్ మాధ్యమమే టాప్‌లో ఉంటుందనుకుంటున్నాను. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేశాను. ప్రస్తుతం హిందీలో ఓ సినిమా, తెలుగులో ఓ పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయింది.
Comments
Please login to add a commentAdd a comment