
బాలకృష్ణ, వేదిక
‘‘ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫామ్ తీశానా... బయటకు వచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే’’ అని ‘రూలర్’ టీజర్‌లో విలన్‌కు పవర్‌ఫుల్ వార్నింగ్ ఇస్తున్నారు బాలకృష్ణ. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. సి. కల్యాణ్ నిర్మాత. ఈ చిత్రం టీజర్ గురువారం రిలీజ్ అయింది. టీజర్‌లో రెండు డిఫరెంట్ గెటప్స్‌తో బాలకృష్ణ కనిపించారు. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్.
Comments
Please login to add a commentAdd a comment