
నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్’. టీజర్ వచ్చేసింది. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటివరకూ ‘రూలర్’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన బాలకృష్ణ స్టైలిష్, మాస్‌లుక్‌లు సినిమాపై అంచనాలను పెంచగా, టీజర్ మరింత ఆసక్తికరంగా సాగింది. ‘ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బయటకు వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే..’ అంటూ బాలకృష్ణ పలికిన డైలాగ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న‘రూలర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.