హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్ | KS Ravi Kumar Shocking Comments On Balakrishna's Behaviour | Sakshi
Sakshi News home page

Balakrishna: సెట్‌లో ఎవరు అలా చేసిన బాలకృష్ణ తట్టుకోలేడు: ప్రముఖ దర్శకుడు

Published Wed, Mar 6 2024 7:28 AM | Last Updated on Wed, Mar 6 2024 8:54 AM

KS Ravi Kumar Shocking Comments On Balakrishna Behaviour - Sakshi

హీరో బాలకృష్ణ గురించి చెప్పగానే చాలామంది ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన ప్రవర్తన. ముందు వెనక ఆలోచించకుండా ఎవరినైనా సరే కొట్టేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. బయటనే కాదు సెట్‌లోనూ ఇలా కొట్టడాలు జరుగుతుంటాయని విన్నాం. కానీ ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ చెప్పడంతో ఇది నిజమని తేలిపోయింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్.. పలు సినిమాలు తీశాడు. తెలుగులో బాలయ్యతో కలిసి  'జై సింహా', 'రూలర్' చిత్రాలు చేశాడు. కానీ ఈ రెండూ ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. అయితే షూటింగ్ సందర్భంగా ఎవరు నవ్వినా బాలకృష్ణ తట్టుకోలేడని చెప్పారు. అలానే తన అసిస్టెంట్ డైరెక్టర్‌ని కూడా కొట్టడానికి రెడీ అయిపోయాడని చెబుతూ అప్పటి విషయాన్ని చెప్పాడు. తాజాగా 'గార్డియన్' అనే తమిళ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ బాలయ్య నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.

(ఇదీ చదవండి:పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు)

'షూటింగ్‌లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే తట్టుకోలేడు. తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి కొడతాడు. అలా ఓ మూవీ షూటింగ్ చేస్తున్న టైంలో నా అసిస్టెంట్ శరవణన్‌ని ఫ్యాన్ తిప్పమని చెప్పాను. అతడు అనుకోకుండా బాలయ్య వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది. దీంతో శవరణన్ కాస్త నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు' 

'మళ్లీ ఆయన శరవణన్‌ని ఎక్కడ కొడతాడో అని నేనే వెళ్లి.. సర్ అతడు మన అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్ది చెప్పాల్సి వచ్చింది. అయినా సరే కూల్ కాలేదు. వెంటనే నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని శరవణన్‌కి అరిచి చెప్పాను. అప్పుడు బాలకృష్ణ కాస్త స్థిమిత పడ్డాడు' అని కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం చెబుతున్నంతసేపు స్టేజీపైన ఉన్న హీరోయిన్ హన్సికతో పాటు మిగతా వాళ్లందరూ నవ్వుతూనే ఉన్నారు.

(ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement