Jai Simha
-
హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్
హీరో బాలకృష్ణ గురించి చెప్పగానే చాలామంది ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన ప్రవర్తన. ముందు వెనక ఆలోచించకుండా ఎవరినైనా సరే కొట్టేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. బయటనే కాదు సెట్లోనూ ఇలా కొట్టడాలు జరుగుతుంటాయని విన్నాం. కానీ ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ చెప్పడంతో ఇది నిజమని తేలిపోయింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్.. పలు సినిమాలు తీశాడు. తెలుగులో బాలయ్యతో కలిసి 'జై సింహా', 'రూలర్' చిత్రాలు చేశాడు. కానీ ఈ రెండూ ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. అయితే షూటింగ్ సందర్భంగా ఎవరు నవ్వినా బాలకృష్ణ తట్టుకోలేడని చెప్పారు. అలానే తన అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా కొట్టడానికి రెడీ అయిపోయాడని చెబుతూ అప్పటి విషయాన్ని చెప్పాడు. తాజాగా 'గార్డియన్' అనే తమిళ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ బాలయ్య నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. (ఇదీ చదవండి:పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు) 'షూటింగ్లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే తట్టుకోలేడు. తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి కొడతాడు. అలా ఓ మూవీ షూటింగ్ చేస్తున్న టైంలో నా అసిస్టెంట్ శరవణన్‌ని ఫ్యాన్ తిప్పమని చెప్పాను. అతడు అనుకోకుండా బాలయ్య వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది. దీంతో శవరణన్ కాస్త నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు' 'మళ్లీ ఆయన శరవణన్‌ని ఎక్కడ కొడతాడో అని నేనే వెళ్లి.. సర్ అతడు మన అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్ది చెప్పాల్సి వచ్చింది. అయినా సరే కూల్ కాలేదు. వెంటనే నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని శరవణన్‌కి అరిచి చెప్పాను. అప్పుడు బాలకృష్ణ కాస్త స్థిమిత పడ్డాడు' అని కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం చెబుతున్నంతసేపు స్టేజీపైన ఉన్న హీరోయిన్ హన్సికతో పాటు మిగతా వాళ్లందరూ నవ్వుతూనే ఉన్నారు. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్..) -
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది
టాలీవుడ్‌కి చెందిన మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. మూడు రోజుల క్రితమే శుభకార్యం జరగ్గా.. తాజాగా ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫొటోలు చూస్తుంటేనే వివాహం చాలా గ్రాండ్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు బ్యూటీకి అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ ఎవరీ హీరోయిన్? పెళ్లి కొడుకు ఎవరో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) ముంబయి బ్యూటీ నటాషా దోషి.. మలయాళ సినిమాలతో నటిగా కెరీర్ ప్రారంభించింది. 2012-17 మధ్య నాలుగు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. 2018లో 'జై సింహా' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఈమెకు మరో రెండు చిత్రాల్లో మాత్రమే అవకాశమొచ్చింది. శ్రీకాంత్ 'కోతలరాయుడు'లో హీరోయిన్గా, కల్యాణ్ రామ్ 'ఎంతమంచి వాడవురా' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. 2020 తర్వాత సినిమాల్ని పక్కనబెట్టేసిన నటాషా దోషి.. పూర్తిగా సైలెంట్ అయిపోయింది. కానీ గతేడాది జూలైలో మనన్ షా అనే వ్యాపారవేత్త నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. త్వరలోనే పెళ్లి ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ ఏడాది జనవరి 31న కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. కానీ దాదాపు నెల తర్వాత ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిన విషయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలోనే అందరూ నటాషా దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) -
HCA: మహిళా క్రికెట్ హెడ్‌కోచ్‌పై వేటు
మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. కాగా విజయవాడలో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో జై సింహా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్‌లో వారి ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లు కోచ్ వ్యవహారశైలిపై హెచ్‌సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు అతడికి సహకరించారంటూ సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావుపై కూడా కంప్లైంట్ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో హెచ్‌సీఏ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా.. కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. ‘‘మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు పెడతాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతాం’’ అని జై సింహా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. మహిళా క్రికెటర్లకు హెచ్‌సీఏ ఎల్లపుడూ అండగా ఉంటుందని జగన్మోహన్ రావు భరోసా ఇచ్చారు. విచారణ ముగిసే వరకు జై సింహాను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై -
HCA: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ!
Hyderabad Cricket Association: హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన జై సింహా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. కాగా మ్యాచ్ ఆడే నిమిత్తం ఉమెన్ టీమ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్ మిస్ అవడంతో టీమ్‌తో సహా బస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో బస్‌లో మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జై సింహా మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు. ఆ సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు జై సింహాకు అడ్డు చెప్పలేదు. పైగా అతడిని ఎంకరేజ్ చేశారు. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ.. జై సింహా, పూర్ణిమరావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కి ఫిర్యాదు చేశారు. వేటు పడింది ఈ నేపథ్యంలో.. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రచారం కావడంతో హెచ్‌సీఏ చర్యలకు పూనుకుంది. మహిళల హెడ్‌కోచ్‌గా జై సింహాను తప్పిస్తూ వేటు వేసింది. ఈ విషయంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘కోచ్ జై సింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాము. విచారణ ముగిసే వరకు అతడిని సస్పెండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు, -
బాలయ్య హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ, నయనతార నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రంలో మరో నటి హీరోయిన్గా కనిపించింది. మలయాళ చిత్రం మాంత్రికన్తో ఎంట్రీ ఇచ్చిన ముంబయి ముద్దుగుమ్మ నటాషా దోషి ఆ తర్వాత తెలుగులో కోతల రాయుడు చిత్రంలో నటించింది. తాజాగా ఈ ముంబయి భామ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. 'ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో నటాషా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తంది. ఇది చూసిన నటాషా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. (ఇది చదవండి: ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్!) అమ్మ కుట్టి పాటకు అదరగొట్టింది జై సింహా చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటాషా. ఈ చిత్రంలో సినిమాలో 'అమ్మ కుట్టి' పాటకు స్టెప్పులతో అదరగొట్టింది. అంతకుముందు మలయాళంలో నాలుగు సినిమాల్లో నటించింది. జైసింహా తర్వాత శ్రీకాంత్ సరసన 'కోతల రాయుడు'లో కనిపించింది. అంతే కాకుండా కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. (ఇది చదవండి: 'సౌందర్య చనిపోలేదు.. ఆ రూపంలో ఇంకా బతికే ఉంది') View this post on Instagram A post shared by Natasha Doshi (@natashadoshi) -
నెక్ట్స్ బాలయ్యతోనే..!
నందమూరి బాలకృష్ణ హీరోగా వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. సి కళ్యాణ్.. ఈ కాంబినేషన్లో మరోసారి తెర మీదకు తెచ్చేందుకు ప్లాన్ చేశారు. జై సింహా తరువాత వినాయక్ సినిమానే సెట్స్ మీదకు వస్తుందని భావించినా.. బాలయ్య మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో బిజీ అయ్యారు. దీంతో వినాయక్, బాలకృష్ణ ల సినిమా ఆగిపోయినట్టే అన్న టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్యతో చేయబోయే సినిమాకు వినాయక్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘ఎన్టీఆర్’ పూర్తయిన వెంటనే వినాయక్ దర్శకత్వంలో నటించేందుకు బాలకృష్ణ ఓకె చెప్పారట. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
16 ఏళ్ల తరువాత అదే కాంబినేషన్లో..
కుర్ర హీరోలకు పోటి ఇచ్చేలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ మరో సినిమాకు అంగీకరించారు. ఇటీవల జై సింహా సినిమాతో ఆకట్టుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ (ఎన్టీఆర్ బయోపిక్) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తాజా మరో సినిమాను ఫైనల్ చేశారు బాలకృష్ణ. జై సింహా సినిమాను నిర్మించిన సీ కల్యాణ్ బ్యానర్లో మరో సినిమాను చేయనున్నాడు బాలయ్య. ఈ సినిమాను మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ వీవీ వినాయక్ డైరెక్ట్ చేయనున్నారు. 2002లో వినాయక్ దర్శకత్వంలో చెన్నకేశవ రెడ్డి సినిమాలో నటించారు బాలయ్య, 16 ఏళ్ల తరువాత మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ సినిమాను మేలో ప్రారంభించి 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేలాప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ మఫ్టీ కి రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. -
సూపర్ హిట్ రీమేక్‌లో బాలయ్య..?
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల జై సింహా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఇలా వరుస సినిమాలో బిజీగా ఉన్న బాలయ్య ఓ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారట. కన్నడలో శివరాజ్ కుమార్, శ్రీ మురళి, శాన్వీలు ప్రధాన పాత్రల్లో నార్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మఫ్టీ. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఈ సినిమాను బాలకృష్ణ హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య మఫ్టీ రీమేక్‌కు అంగీకరిస్తాడా లేదా చూడాలి. -
చీప్ పబ్లిసిటీ కోసం చిత్రసీమపై అభాండాలు
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తుతం సినీ రంగంపై పలువురు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. కొందరు టీవీల్లో కనిపించటం కోసమే అన్నం పెట్టిన చిత్రసీమ పరువు బజారున పడేస్తున్నారు. చీప్ పబ్లిసిటీ కోసమే చిత్రసీమపై అబాండాలు వేస్తున్నారు. గతంలో ఇలా కామెంట్లు చేసిన చాలా మంది కనుమరుగయ్యారన్నారు. ఇటీవల బాలయ్య హీరోగా జై సింహా సినిమాను నిర్మించి కళ్యాణ్ తర్వలో బాలకృష్ణ హీరోగా మరో సినిమాను నిర్మించబోతున్నట్టుగా ప్రకటించారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మే 27న సినిమాను ప్రారంభిస్తామని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
భారీ వసూళ్లు సాధించిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై మంచి వసూళ్లు సాధించింది. సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్ ఉన్న బాలయ్య జై సింహా సక్సెస్ తో మరోసారి ఆ సెంటిమెంట్ నిజమని ప్రూవ్ చేశాడు. ఇప్పటి వరకు ఈ సినిమా 35.85 కోట్ల షేర్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 28.25 కోట్లు షేర్ రాబట్టగా.. కర్ణాటకలో 4.30 కోట్లు, ఇతర రాష్ట్రాల నుంచి 2.10 కోట్లు, ఓవర్ సీస్ నుంచి 1.20 కోట్ల షేర్ సాధించింది. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సీ.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఫేం చిరంతన్ భట్ సంగీతమందించారు. -
జైసింహా సక్సెస్ మీట్
-
పురోహితుల కోసం ‘జై సింహా’ స్పెషల్ షో
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో జై సింహా మంచి విజయం సాధించటంపై చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. వరుసగా సంక్రాంతి బరిలో సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ జై సింహాతో మరోసారి సంక్రాంతి స్టార్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమాలో బ్రాహ్మణులకు సంబంధించి బాలకృష్ణ చెప్పిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మాణులు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బాలయ్యతో సహా చిత్రయూనిట్ ను అభినందించారు. తాజాగా బాలకృష్ణ అభిమానులు అనంతపురంలోని గౌరీ థియేటర్లో పురోహితుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ షోకు అభిమాన సంఘం నాయకులతో పాటు చిత్ర హీరోయిన్ హరిప్రియ హజరయ్యారు. జనవరి 12 రిలీజ్ అయిన జై సింహా ఇప్పటి మంచి వసూళ్లును సాధిస్తోంది. -
టాలీవుడ్లో కలకలం రేపిన ఐటీ దాడులు
-
జై సింహా, అజ్ఞాతవాసి నిర్మాతలకు షాక్
సాక్షి, హైదరాబాద్: పలువురు సినీ ప్రముఖుల కార్యాలయాలపై ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు బుధవారం దాడులు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన జైసింçహా చిత్ర నిర్మాత సి.కల్యాణ్, పవన్‌కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబుతో పాటు మరో నలుగురు సినీ ప్రముఖుల కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తొలుత కృష్ణానగర్‌లోని సి.కల్యాణ్ కార్యాలయంలో ఆరుగురితో కూడిన ఐటీ అధికారుల బృందం దాడి చేసి.. ఐదు గంటల పాటు తనిఖీలు నిర్వహించింది. అనంతరం ఆయన నివాసంలోనూ సోదాలు చేసింది. జైసింహా చిత్రంతోపాటు త్వరలో వీవీ వినాయక్, సాయిధరమ్‌తేజ్ కాంబినేషన్లో తలపెట్టిన భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన లెక్కలు, పెట్టుబడుల వివరాలను, ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను సేకరించినట్లు సమాచారం. -
ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ రిలీజ్ వాయిదా
సంక్రాంతి బరిలో జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ, తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలసిందే. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ దర్శకత్వంలో బాలయ్యే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంతో రిసెర్చ్ చేసిన తరువాత ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రారంభిస్తున్నామని గతంలోనే ప్రకటించాడు నందమూరి హీరో. ఈ సినిమా టీజర్ ను ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జనవరి 18న రిలీజ్ చేయాలని భావించారు. టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ కూడా చేశారు. తాజాగా టీజర్ రిలీజ్ ను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. టీజర్ రిలీజ్ ఎప్పుడున్న విషయాన్ని త్వరలోనే బాలకృష్ణ స్వయంగా ప్రకటించనున్నారు. -
వర్క్‌షాపుల్లో హైడ్రాలిక్ లిప్ట్‌లు అవసరం లేదు!
సాక్షి, హైదరాబాద్: నందమూరి బాలకృష్ణకు మాస్ అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. ఆయన సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు అభిమానులకు తెగ నచ్చేస్తాయి. అలాంటిదే తాజాగా ఆయన నటించిన తాజా చిత్రం ‘జై సింహా’. లోను ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశానికి చెందిన వీడియోని విష్ణు చైతన్య అనే నెటిజన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు ట్విటర్లో ట్యాగ్ చేశారు. ‘మహీంద్ర సర్..ఇలాంటిది మీ కలెక్షన్లలో ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో బొలెరో ట్రెండింగ్ అవుతోంది.. మీరు చూడండి’ అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్‌కు స్పందించిన ఆనంద్ మహీంద్ర రిప్లై ఇచ్చారు. బొలెరో కార్లను చెక్ చేయడానికి సర్వీస్ వర్క్‌షాపుల్లో హైడ్రాలిక్ లిప్ట్‌లు ఉపయోగించాల్సిన అవసరం లేదంటూ సరదాగా బదులిచ్చారు. Haha. Now all our service workshops won’t need any hydraulic lifts anymore to do Bolero check-ups!! https://t.co/WiS6hcpT2h — anand mahindra (@anandmahindra) January 16, 2018 -
షరతులు వర్తిస్తాయి!
తమిళసినిమా: ఇకపై నిబంధనలు వర్తిస్తాయి(కండిషన్స్ అప్లై) అంటోంది నటి నయనతార. నటిగా ఒకప్పటి స్థాయి వేరు ఇప్పటి నయన్ స్థానం వేరు. ఆదిలో నటిగా స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఇమేజ్ను కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. మొదట్లో దర్శకుల సూచనలతో నటించేవారు. అందాలారబోత విషయంలో హద్దుల పరిధి విధించుకోలేదు. టూపీస్ దుస్తుల నటనకు పరాకాష్ట బిల్లా చిత్రం. అయితే అదంతా గతం. ఇప్పటి నయన్ స్థాయి వేరు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మొదలెట్టారో.. అప్పటి నుంచి అభిమానులు ఈ బ్యూటీకి ‘లేడీసూపర్‌స్టార్’ పట్టం కట్టేశారు. అరమ్ చిత్రంతో నయనతార లెవెల్ వేరు అన్నంతగా మారిపోయింది. గతంలో ప్రేమ ఓటమి, తాజాగా ప్రియుడితో సహజీవనం వంటివి నయన్ నట జీవితానికి ఎలాంటి ఆటంకం కాలేదన్నది నిజం. కరెక్ట్‌గా చెప్పాలంటే మొదట్లో దర్శకులు శాసించినట్లు నయన్ నటించేవారు. ఇప్పుడు ఆమె ఆదేశాలను దర్శక నిర్మాతలు పాటించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని గ్రహించిన నయన్ ఇకపై నిబంధనలు వర్తిస్తాయి అని అంటోందట. ముఖ్యంగా ఇంతకు ముందు మాదిరి హీరోలతో సన్నిహితంగా నటించేది లేదు. ఇక ఒక పరిమితికి మించి కురుచ దుస్తులు ధరించను అని దర్శక నిర్మాతలకు కథ వినిపించినప్పుడే స్పష్టంగా చెప్తోందట. ప్రచార కార్యక్రమాలకు దూరం ఉండే పరిస్థితి ఇకపై కూడా కొనసాగుతుందని చెబుతుందట. ఇటీవల నయన్ నటించిన తెలుగు చిత్రం ‘జైసింహా’లో కూడా దుస్తులు, హీరోతో సన్నిహితంగా నటించే విషయాల్లో పరిమితులు పాటించిందట. ఇలా ఈ అమ్మడు తన చిత్ర ప్రయాణాన్ని ఇంకా ఎంతకాలం సాగించుకుంటుందో. ప్రస్తుతం చేతిలో ఐదు చిత్రాలతో బిజీగా ఉంది. తను ఊ అంటే మరిన్ని అవకాశాలు రెడీగా ఉన్నాయట. ఇమైకానోడిగళ్, కొలైయుధీర్ కాలం, కొలమావు కోకిల, తెలుగులో సైరా నరసింహారెడ్డి, ఆరడుగుల బుల్లెట్టు చిత్రాల్లో నయన్ ప్రస్తుతం నటిస్తోంది. ఇక అరమ్ చిత్రానికి సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
ఒక్క సినిమా కూడా వదలట్లేదు..!
విభిన్న చిత్రాలతో సత్తా చాటుతున్న యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం అమెరికాలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. కన్నడ సూపర్ హిట్ కిరిక్ పార్టీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న కిరాక్ పార్టీ లో నటిస్తున్న నిఖిల్, షూటింగ్‌కు గ్యాప్ రావటంతో ఫారిన్ ట్రిప్ కు వెళ్లాడు. అక్కడ ఈ యంగ్ హీరో రిలీజ్ అయిన ప్రతీ సినిమా చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల అజ్ఞాతవాసి సినిమా చూసిన నిఖిల్, ‘ ప్రస్తుతం న్యూజెర్సీ 8కె సినిమాస్‌లో.. రచ్చ ఎంట్రీ, పండుగ సమయం’ అంటూ ట్వీట్ చేశాడు. రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన బాలయ్య జై సింహా సినిమాను కూడా ఫిలడల్ఫియాలో ప్రీమియర్ షో చూశాడు నిఖిల్. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలయ్య బాబు ఈజ్ ద బెస్ట్’ అంటూ ట్వీట్ చేశాడు. పండుగ రోజు రిలీజ్ అవుతున్న రంగుల రాట్నంపై నిఖిల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. New Jersey 8k cinemas ... right now. Raccha entry... #PowerStarMass #Agnyathavasi Celebration time 😁😀🤣😃😄 pic.twitter.com/MRQi6Ud9qn — Nikhil Siddhartha (@actor_Nikhil) 10 January 2018 East or West Balayya Babu is the Best... Watching #JaiSimha premiere show #Philadelphia pic.twitter.com/hA1za2I1hS — Nikhil Siddhartha (@actor_Nikhil) 12 January 2018 -
అజ్ఞాతంలోకి మరో సినిమా : కత్తి మహేశ్
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాది జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే సంక్రాంతి బరిలో, భారీ అంచనాల నడుమ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదలై అభిమానులను నిరాశ పరచడంతో, అందరి చూపు ఇప్పుడు జైసింహాపైనే ఉంది. అయితే 80ల కథకి, 90ల కథనంతో 'జై సింహా' ఉందని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ట్విటర్‌లోపోస్ట్ చేశారు. 'గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగురగంప సినిమా 'జై సింహ'. నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!' అంటూ పేర్కొన్నారు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జై సింహా'లో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. రిస్క్ చేసి చూస్తే మీ ఇష్టం అంటూ అజ్ఞాతవాసి చిత్రానికి కత్తి రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. -
‘జై సింహా’ మూవీ రివ్యూ
టైటిల్ : జై సింహా జానర్ : ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా సంగీతం : చిరంతన్ భట్ దర్శకత్వం : కేయస్ రవికుమార్ నిర్మాత : సి. కళ్యాణ్ సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాది జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. బాలయ్యకు కలిసొచ్చే సంక్రాంతి సీజన్ తో పాటు బాలయ్యకు లక్కీ సెంటిమెంట్స్ అయిన టైటిల్ లో సింహా, హీరోయిన్ గా నయనతారలను కూడా రిపీట్ చేసిన ఈ సినిమా మరోసారి బాలయ్యను సంక్రాంతి హీరోగా నిలబెట్టిందా..? చాలా కాలం తరువాత స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన కేయస్ రవికుమార్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ : నరసింహం(బాలకృష్ణ) ఏడాది వయసున్న కొడుకుతో బతుకుతెరువు కోసం తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఓ గుడి ధర్మకర్త మురళీ కృష్ణ (మురళీమోహన్) ఇంట్లో డ్రైవర్‌గా పనిలోచేరతాడు. అక్కడి లోకల్ రౌడీ కనియప్పన్ (కాళకేయ ప్రభాకర్) తమ్ముడికి మురళీ కృష్ణ కూతురు కారణంగా యాక్సిడెంట్ అవుతుంది. మురళీ కృష్ణ కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని కనియప్పన్ చేతిలో దెబ్బలో తింటాడు నరసింహం. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఏసీపీతోనూ నరసింహానికి గొడవ అవుతుంది. ఈ గొడవల్లో తన కొడుకుకు ఏమన్నా అవుతుందన్న భయంతో ఊరొదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. (సాక్షి రివ్యూస్)కానీ అదే సమయంలో తన కొడుకు లాగే ఉండే మరో అబ్బాయిని కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేయటంతో తన కొడుకే అనుకొని ఆ అబ్బాయి కాపాడతాడు. అసలు కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేసిన బాబు ఎవరు..? ఆ బాబు నరసింహం కొడుకులాగే ఎందుకు ఉన్నాడు..? నరసింహం భార్య ఏమైంది..? కొత్తగా వచ్చిన ఏసీపీకి నరసింహానికి సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ యాక్షన్. జై సింహాతో మరోసారి తన ఇమేజ్ తగ్గ క్యారెక్టర్ తో అభిమానులను అలరించాడు బాలకృష్ణ. తన మార్క్ పంచ్ డైలాగ్ లు, మాస్ ఎలిమెంట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. అదే సమయంలో ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. అమ్మకుట్టి పాటలో బాలయ్య డాన్స్‌లు అభిమానులను ఖుషీ చేస్తాయి. బాలయ్య జోడిగా నయనతార మరోసారి సూపర్బ్ అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ లో నయనతార నటన కంటతడిపెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్)నటషా దోషి, హరిప్రియల పాత్రల నిడివి చాలా తక్కువ.. కనిపించిన కాసేపు నటనతో పాటు, గ్లామర్ తోనూ మెప్పించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో తన మార్క్ చూపించాడు. విలన్లుగా కాళకేయ ప్రభాకర్, అశుతోష్ రానాలు ఆకట్టుకున్నారు. ఇటీవల వెండితెర మీద పెద్దగా కనిపించని సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ సినిమాతో తిరిగి సత్తా చాటుతాడని భావించారు. కానీ మరోసారి బ్రహ్మీ కామెడీ ఆశించిన స్థాయిలో అలరించలేదు. విశ్లేషణ : దర్శకుడు కేయస్ రవికుమార్ బాలయ్య ఇమేజ్ తగ్గ మాస్ క్యారెక్టర్ తో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణ నుంచి అభిమానుల ఆశించే డైలాగ్స్, సీన్స్ తో సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మలిచాడు. సంక్రాంతి పండుగ సీజన్ లో రిలీజ్ అవుతుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను కూడా జోడించి ఆకట్టుకున్నాడు. ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా రొటీన్ ఫార్ములాతో సినిమా తెరకెక్కించిన దర్శకుడు అభిమానులను సంతృప్తి పరిచినా.. కొత్తదనాన్ని ఆశించే ఆడియన్స్‌ను మాత్రం ఆ స్థాయిలో అలరించలేకపోయాడు.(సాక్షి రివ్యూస్) ఎం.రత్నం డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్, బాలయ్య పవర్ కు తగ్గ పంచ్ డైలాగ్స్ తో అభిమానులతో విజిల్స్ వేయించాడు రత్నం. చిరంతన్ భట్ సంగీతం బాగుంది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా తరువాత బాలయ్యతో కమర్షియల్ ఎంటర్టైనర్ చేసిన చిరంతన్ మరోసారి మంచి మ్యూజిక్‌తో మెప్పించాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అక్కడక్కడ కథనం నెమ్మదించి విసిగిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : బాలకృష్ణ నటన ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
24 గంటలూ షోలే.. షోలు
అత్యాశవాసి.. సారీ అజ్ఞాతవాసికి ఇప్పుడు జై సింహ తోడయ్యాడు. ఒకరేమో అధికార పార్టీకి మిత్రసేనుడిగా సుపరిచితుడు.. ఇంకొకరేమో ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే.. అందునా.. స్వయానా సీఎం చంద్రబాబుకు బావమరిది, మంత్రి లోకేష్‌కు మామ.. ఇంకేం.. మిత్రసేనుడి సినిమాకు ఇచ్చినట్లే.. బంధుజనుడి సిన్మాకూ ఉదారంగా అదనపు షోలకు అనుమతులిచ్చేశారు. ఐదు రోజులపాటు ఏకధాటిగా సదరు సిన్మా ఆడించేసుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసేసింది. థియేటర్లు ఫుల్ అయినా.. కాకున్నా పోటీపడి వరుసగా ఏడు షోలు ఆడించడం వల్ల కలెక్షన్ల దందా ఏమో గానీ.. ఏమాత్రం రెస్ట్ లేకుండా పని చేస్తున్న థియేటర్ల సిబ్బంది మాత్రం చెప్పుకోలేని ‘హింస’ అనుభవిస్తున్నారు. పండుగపూట ఇంటిపట్టున ఉండనివ్వకుండా అదనపు షోలతో సేవ చేయించుకున్నందుకు తగిన ఆర్థిక ప్రతిఫలం విషయాన్ని మాత్రం అటు సర్కారు గానీ.. ఇటు యాజమాన్యాలు గానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పవన్ స్టార్ అజ్ఞాతవాసి మాదిరిగానే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన జైసింహ సినిమాకు కూడా సర్కారు ఇష్టారాజ్యంగా ఏడు షోలకు అనుమతినిచ్చేసింది. ఏదో ఒక్క రిలీజ్ రోజు కాకుండా ఏకంగా ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు 24 గంటలూ బొమ్మ ఆడించుకోవచ్చని సర్కారు తెర ఎత్తేయడం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే అజ్ఞాతవాసికి వరుసగా వారంరోజుల పాటు ఏడు షోలకు అనుమతివ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇక సినిమా టికెట్ల రేట్లు కూడా ఇష్టారాజ్యంగా పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఈ రెండు సినిమాలు ఆడే థియేటర్లలో టికెట్ల రేట్లు ఏకంగా రూ.200కి పెంచేశారు. సినిమా టాక్ ఎలా ఉన్నా కేవలం పండుగ రోజుల్లో దండుకునే పర్వానికి తెర లేపేందుకే 24గంటలూ షోలకు అనుమతిచ్చారన్నది నిర్వివాదాంశం. నాలుగు షోలకే జనం లేరట!.. ఏకంగా ప్రభుత్వం నుంచి జీవో తెప్పించుకుని ఏడు షోలు వేసుకున్నా చూసే వాడే లేకుంటే?!.. ప్రస్తుతం అజ్ఞాతవాసికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సినిమాపై డివైడ్ టాక్‌తో మామాలుగా నాలుగు షోలకే హాలు నిండే పరిస్థితి లేదంటున్నారు. హైప్ క్రియేట్ చేసి భారీ అంచనాలతో రిలీజ్ చేసినా మొదటిరోజు తప్ప ఆ తర్వాత ఏడు షోలకూ టికెట్లు తెగట్లేదని ధియేటర్ల సిబ్బంది చెబుతున్నారు. విశాఖ నగరంలోని చాలా థియేటర్లలో ఇదే పరిస్థితి కాగా.. పెందుర్తిలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గురువారం సాయంత్రం పెందుర్తిలోని ఓ ధియేటర్లో టికెట్లు తెగక సినిమా ప్రదర్శనే నిలిపివేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. థియేటర్ల సిబ్బంది గోడు వినేదెవరు?.. ఏడు షోలతో ఆయా సినిమాలు కలెక్షన్లు కొల్లగొట్టడం(?) ఏమో గానీ ధియేటర్ల ఉద్యోగులు, సిబ్బంది మాత్రం అల్లాడిపోతున్నారు. సాధారణంగా రోజుకి నాలుగు షోలు ఆడే థియేటర్లో ఒకేసారి ఏడు షోలు ఆడిస్తున్నా.. సిబ్బందిని మాత్రం యాజమాన్యాలు పెంచలేదు. పోనీ కనీసం వారి వేతనాలు కూడా పెంచలేదని తెలుస్తోంది. కేవలం వారం రోజులేగా పనిభారం.. అన్న భావనలో ధియేటర్ల యజమానులు ఉన్నారు. అదనపు షోలకు ఉదారంగా అనుమతులిచ్చిన ప్రభుత్వం సైతం సిబ్బంది పనిభారం, అదనపు వేతనాల చెల్లింపు విషయాన్ని పట్టించుకోలేదు. కలెక్షన్లు ‘ఫుల్లు’ గా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇప్పటికైతే ఒక సినిమా పరిస్థితి తేలిపోయింది. రెండో రోజు నుంచే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. కేవలం పండుగ మూడురోజుల కలెక్షన్లపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక బాలకృష్ణ సినిమా ఫలితం నేడు తేలనుంది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా... ఏడు షోల దెబ్బకు రాత్రనక, పగలనక సిబ్బంది పనిభారంతో ‘హింస’ పడుతున్నారన్నది వాస్తవం. అడ్వాన్స్ బుకింగ్ నిలిపివేత పెందుర్తి: అజ్ఞాతవాసి ఇచ్చిన షాక్‌తో పెందుర్తిలోని లక్ష్మికాంత్ థియేటర్ యాజమాన్యం జైసింహా సినిమా అడ్వాన్స్ బుకింగ్ నిలుపుదల చేసింది. అజ్ఞాతవాసి కోసం రెండు రోజుల ముందుగా బుధ, గురువారాల ఆటలకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారు థియేటర్ వాళ్లకే టికెట్లు తిరిగి ఇచ్చేశారు. తిరిగి డబ్బులు కూడా అడగలేదు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకున్నారు. కొందరైతే హాల్ ముందే రూ.200 టికెట్‌ను రూ.20, రూ.30కి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో శుక్రవారం విడుదల అయిన జైసింహా పరిస్థితి కూడా ఇదే అయితే ప్రేక్షకులు తమ థియేటర్‌కు ఏ హాని తలపెడతారో అన్న భయంతో యాజమాన్యం జైసింహాకు అడ్వాన్స్ బుకింగ్‌ను పూర్తిగా రద్దు చేసింది. శుక్రవారం ఉదయమే కౌంటర్లో టికెట్లు అమ్మేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుత కాలంలో థియేటర్లు అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేయడం ఎక్కడా లేదు. మరోవైపు గురువారం సాయంత్రం లక్ష్మికాంత్ హాల్లో ప్రేక్షకులు రాకపోవడంతో రెండు స్క్రీన్లలో ఆటలు రద్దు చేశారు. రెండు స్క్రీన్లకు కలిపి పది మంది మాత్రమే వచ్చారు. ఈ థియేటర్ ప్రారంభం నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు లేక ఆటను రద్దు చేయడం ఇదే ప్రథమం. -
‘జై సింహా’కు కూడా నైట్ షోస్
బుధవారం విడుదలైన అజ్ఞాతవాసి సినిమాకు అర్థరాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు షో వేసుకునేందుకు అనుమతించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జై సింహా సినిమాకు కూడా అదే పర్మిషన్ ఇచ్చింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న జై సింహా సినిమాకు అర్థరాత్రి కూడా షో వేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 12వ తేదినుంచి 16వ తేది వరకు అర్థరాత్రి సినిమా ప్రదర్శనకు అనుమతించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాతో సంక్రాంతి సీజన్ లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. -
ఎన్టీఆర్ బయోపిక్‌లో కళ్యాణ్ రామ్ కొడుకు
సంక్రాంతి బరిలో జై సింహాగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ గా బాలయ్యే నటిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ జీవితాన్ని సమగ్రంగా చూపిస్తామని ఇటీవల బాలకృష్ణ ప్రకటించారు. సినిమాలో ఎన్టీఆర్ చిన్నతనానికి సంబంధించిన సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ తన నందమూరి శౌర్య రామ్ ఎన్టీఆర్ గా కనిపించనున్నాడట. ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా.. ఫిలిం నగర్ లో ఈ వార్త గట్టిగానే వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇజం సినిమాల్లో హీరో చిన్నప్పటి పాత్రలో నటించిన శౌర్య, చిన్నారి తారక రాముడిగా అభిమానులను అలరించనున్నాడట. -
‘జై సింహా’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
‘జై సింహా’లో అవే హైలెట్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై సింహా. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకుడు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో నందమూరి అభిమానులను అలరించే అంశాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య మార్క్ భారీ డైలాగులు, చిరంతన్ భట్ సంగీతంతో పాటు కంటతడిపెట్టించే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయట. బాలయ్య డ్యాన్స్ మూమెంట్స్ కూడా అభిమానులను ఫుల్ ఖుషీ చేయనున్నాయి. కేయస్ రవికుమార్ రేసీ స్క్రీన్ ప్లే తో పాటు సీ కళ్యాణ్ నిర్మాణ విలువలు కూడా సినిమా రేంజ్ ను పెంచాయట. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జై సింహా’
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జై సింహా’. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. భారీ యాక్షన్స్ సీన్స్ తో రూపొందిన ఈ సినిమాలో ద్వితీయార్థం హైలెట్ గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా వైజాగ్ లో చిత్రీకరించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాలయ్య అభిమానులను అలరిస్తుందంటున్నారు. -
బాలయ్యతో ఢీ.. గ్యాంగ్ రెడీ
సంక్రాంతికి సూపర్ హిట్ రికార్డు ఉన్న నందమూరి బాలకృష్న 2018 సంక్రాంతికి ‘జై సింహా’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాలయ్య సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇచ్చేందుకు ‘గ్యాంగ్’ రెడీ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్. బాలీవుడ్ సూపర్ హిట్ స్పెషల్ 26 ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతోంది. సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. -
నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి.!
సాక్షి, హైదరాబాద్: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ ట్రైలర్ ఆదివారం విడుదలైంది. ఫుల్ మాస్ యాక్షన్ తో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొంత సమయానికి 2 మిలియన్ల వ్యూస్, 30 వేల లైక్స్ తో జై సింహా ట్రైలర్ దూసుకుపోతోంది. 'సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తదంటూ' బాలకృష్ణ టీజర్లో చెప్పిన మాస్ డైలాగ్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకోగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో ‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి.. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి’, బొమ్మ తిరగేస్తా నీ..! అనే ఎం.రత్నం పవర్ఫుల్ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్లో హీరోయిన్ నయనతార అందంగా కనిపించింది. 'నీకు వయసు ఆగిపోతుందేమో, కానీ నాకు వయసు అయిపోతోంది' అని చెప్పిన డైలాగ్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి.! -
నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి.!
-
జైసింహా ఆడియో రిలీజ్
-
అమరావతిలో ఆడియో విడుదల చేయడం సంతోషం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తను నటించిన జై సింహా చిత్రం ఆడియోను అమరావతిలో విడుదల చేయడం సంతోషంగా ఉందని సినీ నటుడు, ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ అన్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల ఆదివారం విజయవాడలో జరిగింది. మంత్రి నారా లోకేశ్ ఈ చిత్రం పాటల సీడీని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జీవితచరిత్రను సినిమాగా తీస్తున్నామని బాలకృష్ణ చెప్పారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఇప్పుడు పేర్లు మారుస్తున్నారన్నారు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నట్లు నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. కార్యక్రమంలో చిత్ర కథానాయికలు హరిప్రియ, నటాషా, మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్, నటులు చలపతిరావు, శివాజీరాజా, ఎల్బి.శ్రీరామ్, ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత స్పీడు పెంచారు సీనియర్ హీరో, యువరత్న నందమూరి బాలకృష్ణ. ఆయన లేటెస్ట్ మూవీ జై సింహా సినిమా టీజర్ గురువారం విడుదలైంది. ఫుల్ మాస్ యాక్షన్ తో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొంత సమయానికి భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ తో జై సింహా టీజర్ దూసుకుపోతోంది. 'సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని కెలికితే తల కొరికేస్తదంటూ' బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 30 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో బాలయ్య నటనతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎం రత్నం మాటలు అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. -
బాలయ్య హీరోగా ఫాంటసీ మూవీ..!
నందమూరి బాలకృష్ణ వంద సినిమాలు పూర్తి చేసిన తరువాత మరింత స్పీడు పెంచాడు. తన 101వ సినిమాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తమిళదర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తరువాత తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తాజా బాలకృష్ణ చేయబోయే మరో సినిమాపై ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గతంలో బాలయ్య హీరోగా టాప్ హీరో సినిమాను తెరకెక్కించిన ఎస్వీ కృష్టారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాను ఫాంటసీ కథాంశంతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన లేకపోయినా.. ఇప్పటికే కథ కూడా ఓకె అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. -
డిసెంబర్ 23న 'జై సింహా' ఆడియో
వందో సినిమా తరువాత స్పీడు పెంచిన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం జై సింహా సినిమాలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎం రత్నం మాటలు అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న జై సింహా సినిమా ఆడియోను డిసెంబర్ 23న విజయవాడలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జై సింహా షూటింగ్ పూర్తయిన వెంటనే తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు బాలకృష్ణ. -
వైజాగ్ చుట్టొచ్చిన సింహం
బాలకృష్ణ నటిస్తోన్న 102వ చిత్రం ‘జై సింహా’. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. నయనతార, నటాషా జోషీ, హరిప్రియ కథానాయికలు. ఈ చిత్రం వైజాగ్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సి.కళ్యాణ్ మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. వైజాగ్ బీచ్ రోడ్లో ఐదువేల మంది జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో ‘మహా ధర్నా’ సీక్వెన్స్ తీశాం. బాలకృష్ణ– హరిప్రియలపై రొమాంటిక్ సాంగ్‌తోపాటు, బాలయ్య–నయనతారపై ఓ మాంటేజ్ పాటను చిత్రీకరించాం. టైటిల్‌కి, ఇటీవల విడుదల చేసిన బాలయ్య ఫస్ట్ లుక్‌కి విశేషమైన స్పందన వస్తోంది. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్లో ‘సింహా‘ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలన్నీ హిట్. ‘జై సింహా‘ కూడా సూపర్ హిట్ అవడం ఖాయం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్–తేజ. -
ఉగ్ర నరసింహ!
దాన.. వీర.. శూర.. కర్ణ... నరసింహుడతడు! కానీ, కత్తిపట్టి సింహంలా రంగంలోకి దూకాడో... శత్రువులు శరణు కోరాల్సిందే. సింహం ముందు లొంగిపోవాల్సిందే. దానవీర శూరకర్ణుడు లాంటి వ్యక్తి కసితో రగిలే నరసింహుడిలా ఎందుకు మారాడు? అసలేమైంది? ఉగ్ర నరసింహ అవతారంలో బాలకృష్ణ ఏం చేశారు? అనేది వచ్చే సంక్రాంతికి తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘జై సింహా’. బుధవారం ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్, టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్, సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లోని కంటైనర్ యార్డులో పూర్తి చేశారు. త్వరలో చిత్రీకరణ అంతా పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రానికి కథ–మాటలు: యం. రత్నం, సంగీతం: చిరంతన్ భట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సి. వరుణ్‌కుమార్–సి. తేజ, సహనిర్మాత: సీవీ రావు. -
బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ హీరోగా అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను బాలయ్య కు తిరుగులేని రికార్డ్ ఉన్న సంక్రాంతి సీజన్లో జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.