
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తుతం సినీ రంగంపై పలువురు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. కొందరు టీవీల్లో కనిపించటం కోసమే అన్నం పెట్టిన చిత్రసీమ పరువు బజారున పడేస్తున్నారు. చీప్ పబ్లిసిటీ కోసమే చిత్రసీమపై అబాండాలు వేస్తున్నారు. గతంలో ఇలా కామెంట్లు చేసిన చాలా మంది కనుమరుగయ్యారన్నారు.
ఇటీవల బాలయ్య హీరోగా జై సింహా సినిమాను నిర్మించి కళ్యాణ్ తర్వలో బాలకృష్ణ హీరోగా మరో సినిమాను నిర్మించబోతున్నట్టుగా ప్రకటించారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మే 27న సినిమాను ప్రారంభిస్తామని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment