మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు.
కాగా విజయవాడలో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో జై సింహా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్‌లో వారి ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లు కోచ్ వ్యవహారశైలిపై హెచ్‌సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు అతడికి సహకరించారంటూ సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావుపై కూడా కంప్లైంట్ చేశారు.
ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో హెచ్‌సీఏ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా.. కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. ‘‘మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు.
క్రిమినల్ కేసులు పెడతాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతాం’’ అని జై సింహా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. మహిళా క్రికెటర్లకు హెచ్‌సీఏ ఎల్లపుడూ అండగా ఉంటుందని జగన్మోహన్ రావు భరోసా ఇచ్చారు. విచారణ ముగిసే వరకు జై సింహాను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై
Comments
Please login to add a commentAdd a comment