Women cricketers
-
వయసు 16 ఆట ఖరీదు 1.6 కోట్లు
తమిళనాడుకు చెందిన ఆ అమ్మాయి 12 ఏళ్ల వయసు వరకూ స్కేటింగ్ చేసింది. అదృష్టమో దురదృష్టమో లాక్డౌన్ వచ్చింది. బోర్ కొట్టి బ్యాట్ అందుకుంది. సరిగ్గా నాలుగేళ్లు. డబ్ల్యూపీఎల్ ఆక్షన్‌లో 10 లక్షలు పలికితే గొప్పనుకుంటే కోటీ అరవై లక్షలు పలికింది. అద్భుతమైన ప్రతిభ, కృషి ఉంటే విధిని తిరగరాయొచ్చని చెబుతుంది జి.కమలిని.మొన్నటి ఆదివారం (డిసెంబర్ 15) ఏం జరిగిందో తెలుసా? కౌలాలంపూర్‌లో మహిళల అండర్–19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్–ఇండియాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్‌లో పాకిస్తాన్ బ్యాటర్స్ రన్స్ కోసం బాల్‌ను బాదినప్పుడల్లా వికెట్స్ వెనుక నుంచి ఆ అమ్మాయి గట్టిగట్టిగా కేకలు వేస్తూ బాల్‌ను విసరమని ఫీల్డర్లను ఉత్సాహపరుస్తోంది. ఆ అమ్మాయి హుషారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్యాహ్నం టార్గెట్‌ను ఛేదించే బాధ్యత ఇండియన్స్‌ది. వికెట్‌కీపర్‌గా ఉన్న అమ్మాయి ఇప్పుడు బ్యాట్ పట్టుకొని క్రీజ్ మీదకు వచ్చింది. అంతవరకే గుర్తుంది... అందరికీ. ఆ తర్వాత ఆ అమ్మాయి కొడుతున్న షాట్లకి గతం భవిష్యత్తు మర్చిపోయి వర్తమానంలో మునకలేశారు. షాట్ షాట్‌కు కేరింతలే. మొత్తం 44 రన్స్ చేసిందా అమ్మాయి. లాస్ట్ బంతిని భారీ సిక్స్ కొట్టి ఆట ముగించింది.కౌలాలంపూర్‌లో ఇలా ఆట ముగుస్తున్న సమయానికి బెంగళూరులో డబ్ల్యూపీఎల్ కోసం మహిళా క్రికెటర్ల ఆక్షన్ జరుగుతోంది. ఇదే అమ్మాయి పేరును పిలిచారు. అంతవరకూ ఆమె 10 లక్షల రూపాయలకు వేలంలో దక్కుతుందని అందరూ భావించారు. కాని కౌలాలంపూర్ ఆట ప్రభావం చూపింది. ముంబై ఇండియన్స్ టీమ్, ఢిల్లీ కాపిటల్స్ టీమ్ పాట పెంచుతూ పోటీ పడ్డాయి. చివరకు కోటీ అరవై లక్షలతో ఆక్షన్ ముగిసి ఆ అమ్మాయి ముంబై ఇండియన్స్ జట్టు భాగస్వామి అయ్యింది. ఒకేరోజు ఇలా కౌలాలంపూర్‌లో ఇటు బెంగళూరులో మార్మోగిన ఆ అమ్మాయి పేరు కమలిని. వయసు 16.మదురై అమ్మాయికమలినిది మధ్యతరగతి కుటుంబం. మదురైలో ఉండేది. స్కేటింగ్ నేర్చుకుంటూ హుషారుగా ఉండే కమలిని 12 ఏళ్ల వరకు క్రికెట్ జోలికే వెళ్లలేదు. 2022లో కరోనా రావడంతో లాక్డౌన్ వచ్చి ఆమె తండ్రి గుణాలన్ కాలక్షేపానికి కొడుకుతో వీధిలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఒకరోజు కమలినిని పిలిచి నువ్వు బౌలింగ్ చెయ్ అన్నాడాయన. కమలిని బౌలింగ్ చేస్తే దిమ్మెర పోయాడు. అలా ఆ వయసులో అలా బౌలింగ్ చేసే పిల్లలు లేరు. కమలినికి ఇది సహజసిద్ధంగా వచ్చిందని గ్రహించిన తండ్రి మరి ఆలస్యం చేయలేదు. మరుసటి సంవత్సరమే చెన్నై కాపురం మార్చి‘చైన్నె సూపర్‌కింగ్స్ అకాడెమీ’లో చేర్చాడు. అక్కడ ఆమె ప్రతిభ గమనించి వెంటనే ‘తమిళనాడు అండర్–19’లోకి తీసుకున్నారు. విమెన్స్ అండర్ 19 టి 20 కప్‌లో 8 మేచెస్లో 311 పరుగులు కొట్టింది కమలిని. అంతేకాదు సిక్సర్ల కమలినిగా పేరు ΄పొందింది. ఆమె సిక్స్‌కు బాల్ని లేపితే బౌండరీ దాటాల్సిందే.తండ్రి అంటే ప్రేమకమలినికి తండ్రంటే చాలా ప్రేమ. ఆయనకు గుండె సమస్య తలెత్తితే తల్లడిల్లిపోయింది కమలిని. ‘మా నాన్నంటే నాకు చాలా ఇష్టం’ అంటుంది. ఆ సమయంలో ఆటమీద మనసు లగ్నం చేయలేకపోయింది. అయితే తండ్రికి సర్జరీ అయ్యి ఇంకేం పర్వాలేదని డాక్టర్లు చె΄్పాక ఆ మరుసటి రోజే తమిళనాడు– ఆంధ్రల మధ్య మ్యాచ్ ఉంటే చెలరేగి సెంచరీ బాదింది కమలిని. ప్రతిభ, తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రోత్సాహం సమృద్ధిగా ఉన్న ఈ అమ్మాయి మున్ముందు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తుంది. -
బుల్లి క్రికెట్ స్టార్ సంచలనం : స్టైలిష్ బ్యాటింగ్‌తో సచిన్ ఫిదా
క్రికెట్‌పై అమ్మాయిలు చూపిస్తున్న ఆసక్తి మహిళా క్రికెట్‌పై ఆశల్ని మరింత పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రికెట్ మహిళలు స్టార్లుగా సత్తా చాటుతున్న నేపథ్యంలో తాజాగా ఒక సంచలన తార అవతరించడం విశేషంగా నిలిచింది. తొమ్మిదేళ్లకే అత్యుత్తమ ప్రతిభతో ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది. ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఆకట్టుకునే స్టైలిష్ బ్యాట్ స్వింగ్‌తో మైదానం నలుమూలలకు బంతిని పరుగులు పెట్టించింది. గొప్ప క్రికెటర్‌గా రాణించాలని కలలు కంటోంది. కశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక హర్మత్ ఇర్షాద్ భట్. సాధారణ డ్రైవర్ కుమార్తె. బుమై (జైంగీర్)లో రెండో తరగతి చదువుతోంది. ఇటీవల ప్లేగ్రౌండ్‌లో అబ్బాయిల టీంతో ఆడుతూ షాట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఆమె లాంటి పిల్లలు క్రికెట్‌ను ఆస్వాదించడం చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈవీడియోను రీ-ట్వీట్ చేశాడు. యువత ఆడటం క్రికెట్ ఆడటం చూడటం తనకు చాలా సంతోషినిస్తోందంటూ ట్వీట్‌చేశారు. దీంతో మరింత వైరల్ అయింది. పలువురు ఆమె టాటెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. Always good to see young girls playing cricket. Watching videos like these brings a smile to my face. https://t.co/LaQv9ymWRx — Sachin Tendulkar (@sachin_rt) March 30, 2024 క్రికెట్ స్టార్లు మిథాలీ రాజ్,శిఖర్ ధావన్ తన ఫ్యావరెట్ అని చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ని చూసిన తర్వాత క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకుందట. అంతేకాదు చాలా కాలంగా ఈ ప్లేగ్రౌండ్‌లో ఆడతానని తన కిష్టమైన షాట్ కవర్ డ్రైవ్ అని, తన తాతయ్యతో కలిసి ఆడేదాన్నని చెప్పుకొచ్చింది. ఉదయం 8 గంటలకు ప్రాక్టీస్ షురూ. జాసిమ్ భట్, అర్సలాన్, ఫైసల్, ఫయీజ్, ఇఖ్లాక్ , ఇతర అబ్బాయిలతో పోటీ పడి ఆడుతుంది. ‘‘సచిన్ సర్ నా వీడియోను షేర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ” హర్మత్. భారత జట్టులోకి ఎంపికై మిథాలీ రాజ్‌తో మ్యాచ్ ఆడాలని హర్మత్ కలలు కంటోంది. ఇక్కడ చాలా టాలెంట్ ఉంది కానీ తగిన గుర్తింపు లభించడం లేదని, శిక్షణకోసం అకాడమీలు లేవంటూ స్థానికులు తౌసీఫ్ అహ్మద్ వ్యాఖ్యానించారు హర్మత్ తరహాలో క్రీడాకారులకు క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు. -
BCCI: ఆరేళ్ల తర్వాత మళ్లీ...
ముంబై: భారత దేశవాళీ క్యాలెండర్లో మహిళా క్రికెటర్ల కోసం ఆరేళ్ల తర్వాత రెడ్ బాల్ టోర్నీని నిర్వహించనున్నారు. ఈనెల 28 నుంచి ఏప్రిల్ 11 వరకు పుణేలో ఈ టోర్నీ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. మొత్తం ఆరు జోనల్ జట్లు (ఈస్ట్, నార్త్ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, నార్త్, సౌత్‌జోన్) ఈ టోర్నీలో పోటీపడతాయి. ప్రతి మ్యాచ్ మూడు రోజులపాటు జరుగుతుంది. నార్త్, సౌత్ జోన్ జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్‌లు లభించగా... ఈస్ట్–నార్త్ ఈస్ట్; వెస్ట్–సెంట్రల్ జోన్ జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో గెలిచిన జట్లు సెమీఫైనల్స్‌లో నార్త్, సౌత్ జోన్ జట్లతో ఆడతాయి. చివరిసారి 2018లో మహిళా క్రికెటర్లకు రెడ్ బాల్ టోర్నీని ఏర్పాటు చేయగా... ఆ సమయంలో రెండు రోజుల మ్యాచ్‌లు నిర్వహించారు. -
HCA: అంతా అబద్ధం.. అసలు కారణం ఇదే! అవునా?
సాక్షి, హైదరాబాద్: ఆయన రాష్ట్ర సీనియర్ మహిళల క్రికెట్ జట్టు కోచ్... టీమ్‌తో పాటు మ్యాచ్ కోసం బస్సులో ప్రయాణిస్తున్నారు... ఎంతో బాధ్యతగా, హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి కట్టు తప్పారు. బస్సులోనే మద్యం బాటిల్ తీసి దర్జాగా సేవించారు. ఆపై ముందు సీట్లో దానిని పెట్టుకొని అదే కొనసాగించారు! ఈ వీడియో వెలుగులోకి రావడంతో వ్యవహారం బయటపడింది. హైదరాబాద్ మహిళల టీమ్‌కు హెడ్ కోచ్‌గా ఉన్న విద్యుత్ జైసింహ చేసిన నిర్వాకమిది. ఈ ఘటనపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెంటనే స్పందించింది. జైసింహను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ వేటు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడంతో పాటు విచారణ ముగిసే వరకు హైదరాబాద్ క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి వ్యవహారాల్లో పాలుపంచుకోరాదని ఆదేశించింది. ఈ ఘటన ఎప్పటిదనే విషయంపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. బస్సులోకి ఆల్కహాల్‌ను ఎవరు తీసుకొచ్చారు, ఎలా అనుమతించారనే దానిపై కూడా విచారణ చేస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్రకటించారు. అంతా అబద్ధం.. అసలు కారణం ఇదే! అవునా? పాతతరం క్రికెట్ దిగ్గజం ఎంఎల్ జైసింహ కుమారుడైన విద్యుత్ గతంలో హెచ్‌సీఏలో వేర్వేరు బాధ్యతల్లో పని చేశారు. తండ్రి పేరుతోనే సికింద్రాబాద్‌లో చాలా ఏళ్లుగా ఒక ప్రైవేట్ క్రికెట్ అకాడమీని కూడా నిర్వహిస్తున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను విద్యుత్ జైసింహ ఖండించారు. తానెప్పుడూ టీమ్ బస్సులోకి మద్యాన్ని తీసుకురాలేదని, తాగలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు నిరాధారమని... ఒక హైదరాబాద్ మాజీ క్రికెటర్ కుమార్తెను జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జైసింహ వివరణ ఇచ్చారు. జై సింహా ప్రవర్తన గురించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు అప్పట్లోనే లేఖ కోచ్ జై సింహా తాగుడుకు బానిసగా మారారని మహిళా క్రికెటర్లు ఆరోపించారు. తమ ముందు మద్యం తాగొద్దని పలుసార్లు వారించినా వినలేదని, ఇదేంటని ప్రశ్నిస్తే టీం నుంచి తీసేస్తానని బెదిరించారన్నారు. ఈ క్రమంలో.. మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. గత జనవరిలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు జనవరిలో లేఖ కూడా రాశారు. -
మహిళా క్రికేటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ పై వేటు
-
HCA: మహిళా క్రికెట్ హెడ్‌కోచ్‌పై వేటు
మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. కాగా విజయవాడలో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో జై సింహా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్‌లో వారి ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లు కోచ్ వ్యవహారశైలిపై హెచ్‌సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు అతడికి సహకరించారంటూ సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావుపై కూడా కంప్లైంట్ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో హెచ్‌సీఏ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా.. కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. ‘‘మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు పెడతాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతాం’’ అని జై సింహా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. మహిళా క్రికెటర్లకు హెచ్‌సీఏ ఎల్లపుడూ అండగా ఉంటుందని జగన్మోహన్ రావు భరోసా ఇచ్చారు. విచారణ ముగిసే వరకు జై సింహాను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై -
హైదరాబాద్ లో మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన
-
HCA: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ!
Hyderabad Cricket Association: హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన జై సింహా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. కాగా మ్యాచ్ ఆడే నిమిత్తం ఉమెన్ టీమ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్ మిస్ అవడంతో టీమ్‌తో సహా బస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో బస్‌లో మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జై సింహా మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు. ఆ సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు జై సింహాకు అడ్డు చెప్పలేదు. పైగా అతడిని ఎంకరేజ్ చేశారు. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ.. జై సింహా, పూర్ణిమరావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కి ఫిర్యాదు చేశారు. వేటు పడింది ఈ నేపథ్యంలో.. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రచారం కావడంతో హెచ్‌సీఏ చర్యలకు పూనుకుంది. మహిళల హెడ్‌కోచ్‌గా జై సింహాను తప్పిస్తూ వేటు వేసింది. ఈ విషయంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘కోచ్ జై సింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాము. విచారణ ముగిసే వరకు అతడిని సస్పెండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు, -
‘అమ్మాయిల ఆటకు డబ్ల్యూపీఎల్‌తో అందలం’
దేశంలో మహిళా క్రికెటర్ల కలలు సాకారమయ్యేందుకు డబ్ల్యూపీఎల్ దోహదం చేస్తుందని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ అన్నారు. ‘మరెంతో మంది యువ క్రీడాకారిణిలు క్రికెట్‌వైపు మళ్లేందుకు, కెరీర్‌గా ఎంచుకునేందుకు డబ్ల్యూపీఎల్ ఉపయోగపడుతుంది. ఇందులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. తొలి మ్యాచ్‌లో తమ ఫ్రాంచైజీ భారీ విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నా’ అని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. -
మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. అడవిలో మృతదేహం!
ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన రాజశ్రీ.. శుక్రవారం(జనవరి 13) కటక్ సమీపంలోని ఓ దట్టమైన ఆడవిలో శవమై కన్పించింది. అథఘర్ ప్రాంతంలోని గురుడిఝాటియా అడవిలో చెట్టుకు వేలాడుతూ ఆమె మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా 26 ఏళ్ల రాజశ్రీ స్వైన్‌కు జనవరి 10న ప్రకటించిన ఒడిశా రాష్ట్ర మహిళల క్రికెట్ జట్టు తుది జాబితాలో చోటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆ మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయింది. ఇక రాజశ్రీ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కోచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమె మృతదేహం అథఘర్ ఆడివిలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతదేహంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: Siddharth Sharma Death: భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. స్టార్ బౌలర్ మృతి -
'తెలియని దారుణాలు చాలానే.. బీసీసీఐ బయటపడనివ్వలేదు'
బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా).. పేరుకు భారత క్రికెట్ బోర్డు అయినప్పటికి.. ఐసీసీనీ కూడా శాసించే స్థాయికి ఎదిగింది. క్రికెట్లో అత్యంత ధనికవంతమైన బోర్డుగా బీసీసీఐకి పేరుంది. పురుషుల క్రికెట్.. మహిళల క్రికెట్‌ను సమానంగా చూస్తూ ఆటగాళ్లకు తగిన హోదా కల్పిస్తున్నాయి. అయితే ఇవన్నీ బయటకు మాత్రమే. అంతర్లీనంగా బీసీసీఐలో కొన్నేళ్ల క్రితం జరిగిన దారుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. బీసీసీఐలో మనకు తెలియని దారుణాలు ఏం చోటుచేసుకున్నయనేది మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ వెల్లడించారు. వినోద్ రాయ్‌ను సూప్రీంకోర్టు.. 2017-19 మధ్య బీసీసీఐ స్పెషల్ కమిటి అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. బీసీసీఐలో ఎన్నికలు జరిగే వరకు వినోద్ రాయ్ సహా రామచంద్ర గుహ, విక్రమ్ లిమాయే, భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలతో నలుగురు సభ్యుల బృంధాన్ని ఏర్పాటు చేసి బోర్డు అడ్మినిస్ట్రేషన్ నడిపించారు. కాగా ఈ 33 ఏళ్ల కాలంలో వినోద్ రాయ్ బీసీసీఐలో జరిగిన లోటుపాట్ల గురించి స్పష్టంగా తెలుసుకున్నారు. అయితే ఆయన ఏనాడు వాటిని బయటపెట్టలేదు. తాజాగా వినోద్ రాయ్ ..''నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్‌మన్'' అనే బుక్ రాశారు. ఈ బుక్‌లో ముఖ్యంగా బీసీసీఐకి తాను అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన కాలంలో జరిగిన అనుభవాలను, జ్ఞాపకాలను రాసుకొచ్చారు. అందులోనే అంతర్లీనంగా మహిళా క్రికెటర్లు ఎదుర్కొన్న వివక్ష గురించి కూడా ప్రస్తావించారు. ఈ విషయాన్ని వినోద్ రాయ్ స్వయంగా ద వీక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో వెల్లడించారు. ''బీసీసీఐ మహిళా క్రికెట్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది. 2006 వరకు మహిళా క్రికెటర్లపై వివక్ష దారుణంగా ఉండేది. వాళ్లు మ్యాచ్‌లు ఆడేది తక్కువ సంఖ్య కాబట్టి.. కొత్త జెర్సీలు ఎందకన్న కారణంతో... పురుషుల వాడిన జెర్సీలనే కట్ చేసి మళ్లీ కుట్టి వాటిని మహిళా క్రికెటర్లకు అందించేవారు. ఒక రకంగా వాడేసిన జెర్సీలను మహిళా క్రికెటర్లకు ఇచ్చారు. అయితే శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా వచ్చాకా.. పరిస్థితి కొంత నయమైంది. ఆయన మెన్స్, వుమెన్స్ క్రికెట్‌ను ఒకే దగ్గరకు చేర్చాలనే కొత్త ఆలోచనతో వచ్చారు. దానివల్ల మహిళా క్రికెటర్ల బతుకులు చాలావరకు బాగుపడ్డాయి. సెంట్రల్ కాంట్రాక్ట్(క్రికెటర్లకు జీతాలిచ్చే బోర్డు) అనేది రావడం వల్ల వివక్ష కాస్త తగ్గింది. కానీ ఇప్పటికి ఎక్కడో ఒక చోట అది కొనసాగుతూనే ఉంది. 2017లో నేనే బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నప్పుడు.. భారత మహిళల జట్టు 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరింది. ఆ ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 171 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ టీమిండియాను ఫైనల్లో అడుగుపెట్టేలా చేసింది. అయితే ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్‌కౌర్‌కు మ్యాచ్‌కు ముందు సరైన ఫుడ్ ఇవ్వలేదంటే నమ్ముతారా. ఆ విషయం హర్మన్ స్వయంగా చెప్పింది. 171 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ తర్వాత హర్మన్‌తో ఫోన్లో మాట్లాడా.''సార్.. పరిగత్తడానికి శక్తి లేక బలాన్ని కుంచించుకొని సిక్స్‌లతోనే ఇన్నింగ్స్ ఆడాను. దానికి కారణం మాకు సరైన ఫుడ్ లేకపోవడమే. మ్యాచ్ ప్రారంభానికి ముందు మేమున్న హోటల్ సిబ్బంది.. ఈరోజు మీకు బ్రేక్‌ఫాస్ట్ ఏం లేదని.. సమోసాలతోనే సరిపెడుతున్నామని చెప్పారు. ఆ ఒక్క సమోసాతోనే నా శక్తినంతా కుంగదీసుకొని ఇన్నింగ్స్ ఆడాను.'' అంటూ చెప్పుకొచ్చింది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. బీసీసీఐ మహిళా క్రికెటర్లను సరైన దిశలో పట్టించుకోలేదని.. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి పురుషులతో సమానంగా మహిళలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లకు సరైన ట్రైనింగ్, కోచింగ్ అవసరాలు, ట్రావెల్ ఖర్చులు, క్రికెట్ కిట్, గేర్, చివరకు మ్యాచ్ ఫీజులు సక్రమంగా చెల్లిస్తే మరింత ముందుకెళ్లడం సాధ్యం. బీసీసీఐని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. అందులో ఉన్న లోపాలు మాత్రమే ఎత్తిచూపాను. ఇలాంటివి తొందరగా పరిష్కరించుకుంటే మేలు'' అంటూ ఆయన పేర్కొన్నారు. చదవండి: ఐపీఎల్ వ్యవస్థాపకుడి బయోపిక్‌ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత -
అరుదైన దృశ్యాలు.. ఊహకందని భావోద్వేగాలు!
అందరి జీవితాల్లోనూ కొన్ని అపురూప క్షణాలు ఉంటాయి. అలాంటి వాటిని తడిమి చూసుకున్నప్పుల్లా ఒకలాంటి ఉద్వేగానికి లోనవుతాం. ఆటల్లోనూ ఇలాంటి అరుదైన క్షణాలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ప్రతిస్పందనగా రకరకాల భావోద్వేగాలకు గురవుతుంటాం. ముఖ్యంగా గెలుపోటములను నిర్ణయించే సమయంలో క్రీడాకారులతో ప్రేక్షకులు కూడా ఒత్తిడి, ఉత్కంఠ, ఆందోళన చెందుతుంటారు. ఆట చివరి క్షణాల్లోని నాటకీయతను మునివేళ్లపై నిల్చుకుని వీక్షిస్తుంటారు ఫ్యాన్స్. ఫలితాలకు అనుగుణంగా ఆనందం, నిరాశ, నిస్పృహ లాంటి భావావేశాలను ప్రకటిస్తుంటారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నమెంట్లలో ఎంతో పోటీ ఉంటుందో క్రీడాభిమానులందరికీ ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా అలాంటి సందర్భమే ఈసారి ఎదురయింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీ నుంచి భారత జట్టు భారంగా నిష్ర్కమించింది. తుది అంకానికి చేరువయ్యేందుకు చివరి బంతి వరకు పడతులు పోరు సాగించినా ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. అయితే గెలుపు కోసం ఇరు జట్ల క్రీడాకారిణులు సాగించిన సమరం స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు ప్రేక్షకులకు ఉత్కంఠతో కూడిన వినోదాన్ని అందించింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో మార్చి 27న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీరాజ్ బృందం పోరాడి ఓడింది. చివరి బంతికి ఫలితం వచ్చిన ఈ మ్యాచ్‌లో అఖరి క్షణాలను ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆత్రుతగా చూశారు. తమ జాతకం భారత్ టీమ్ చేతిలో ఉండడంతో వెస్టిండీస్ క్రీడాకారిణులు మరింత ఉత్కంఠగా మ్యాచ్‌ను వీక్షించారు. మిథాలీరాజ్ బృందం ఓడిన క్షణంలో డ్రెసింగ్స్లో రూమ్‌లో విండీస్ క్రీడాకారిణుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. (క్లిక్: కత్తి మీద సాము లాంటిది.. ఎలా డీల్ చేస్తారో?!) ఓడిపోయామనుకున్న మ్యాచ్‌లో గెలిచినట్టు తేలడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. విజయం సాధించేశామన్న సంతోషంతో భారత బృందం ప్రదర్శించిన ఆనంద క్షణాలు.. నోబాల్ నిర్వేదం, ఓటమి బాధతో నిర్వేద వదనంతో నిష్క్రమించిన క్షణాలు, కామెంటేటర్లు మాటలు మర్చిపోయి అవాక్కయిన దృశ్యాలు.. ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలాయి. కెమెరాలో నిక్షిప్తమైన ఈ అరుదైన దృశ్యాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన అధికారిక ట్విటర్లో పేజీ షేర్ చేసింది. జయాపజయాలను పక్కనపెడితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రదర్శించిన పోరాట పటిమ అందరి మనసులను గెలిచింది. (క్లిక్: భారత్ కొంపముంచిన నోబాల్..) -
బంగ్లా క్రికెట్ జట్టులో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరికి నిర్ధారణ
ఢాకా: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఇటీవలే జింబాబ్వే పర్యటన నుంచి తిరిగివచ్చిన ఇద్దరు మహిళా క్రికెటర్లు ఒమిక్రాన్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆ దేశ వైద్య మంత్రి జహీద్ మలాకీ శనివారం ప్రకటించారు. కోవిడ్ బారిన పడిన ఆ ఇద్దరు క్రికెటర్లలో స్వల్ప జ్వరం మినహా ఎటువంటి లక్షణాలు లేవని, నిబంధనల ప్రకారం వారిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన తెలిపాడు. అలాగే బాధితులతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ కోవిడ్ పరీక్షలు చేసామని, వారందరికీ నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌లో ఇవే తొలి ఒమిక్రాన్ కేసులని ఆయన నిర్ధారించారు. కాగా, గత నెలలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలలో కోవిడ్ కొత్త వేరియంట్(ఒమిక్రాన్) కేసులు వెలుగు చూడడంతో ప్రపంచం మొత్తం మరోసారి అప్రమత్తంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: Ashes 1st Test: ఆసీస్ చేతిలో భంగపడ్డ రూట్ సేనకు మరో భారీ షాక్.. -
ఇక ‘బ్యాట్స్‌మన్’ కాదు.. బ్యాటర్!
Batter Instead Of Batsman: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిబంధనలను రూపొందించే మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఒక కీలక మార్పు చేసింది. కేవలం పురుష ఆటగాడినే గుర్తు చేసే ‘బ్యాట్స్‌మన్’కు బదులుగా ఇకపై మహిళలకు కూడా ఉపయోగించే విధంగా ‘బ్యాటర్’ పదాన్ని చేర్చాలని నిర్ణయించింది. క్రీడల్లో లింగ వివక్ష ఉండరాదని, సాంకేతిక పదాల్లో కూడా అది కనిపించరాదనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్లు ఎంసీసీ ప్రకటించింది. ఇదే తరహాలో ‘బ్యాట్స్‌మెన్’ స్థానంలో ‘బ్యాటర్స్’ అని వ్యవహరిస్తారు. చదవండి: సంపాదనలో మెస్సీని దాటేశాడు.. ఏడాదికి 922 కోట్లు అర్జిస్తున్నాడు -
ఆరు జట్లతో మహిళల ఐపీఎల్ కావాలి!
న్యూఢిల్లీ: అమ్మాయిలకు ఆరు జట్లతో ఐపీఎల్ నిర్వహిస్తే జాతీయ జట్టు బలంగా తయారవుతుందని, రిజర్వ్ బెంచ్ సత్తా పెరుగుతుందని భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అన్నారు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 25 ఏళ్ల ఓపెనర్ మాట్లాడుతూ ‘ఐపీఎల్ ఆరంభంతో పురుషుల జట్లు అద్భుత పురోగతి సాధించాయి. నాణ్యమైన క్రికెటర్లతో జట్ల బలం, రిజర్వ్ బలం కూడా పెరిగింది. చెప్పాలంటే పది పదకొండేళ్ల క్రితం ఉన్నట్లుగా ఇప్పుడు జట్లు లేవు. పురుష క్రికెటర్లు అనూహ్యంగా పుంజుకుంటే మహిళా క్రికెటర్లు అక్కడే ఉన్నారు. అలా కాకుండా అమ్మాయిలకు ఐపీఎల్ ఉండివుంటే మా పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఇప్పటికైనా ఐదారు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహిస్తే కచ్చితమైన మార్పు కనిపిస్తుంది. తగినంత మంది ప్లేయర్లు కూడా మన వద్ద ఉన్నారు. ఆదరణను బట్టి జట్ల సంఖ్యను పెంచాలనేదే నా సూచన’ అని ఆమె తెలిపింది. ఆస్ట్రేలియాలో ఉమెన్ బిగ్‌బాష్ లీగ్ వల్ల మహిళా క్రికెటర్ల బెంచ్ పరిపుష్టిగా ఉందని మంధాన చెప్పింది. -
గ్రౌండ్లో కుప్పకూలిన క్రికెటర్లు.. షాక్‌లో ఆటగాళ్లు
అంటిగ్వా: పాకిస్తాన్ వుమెన్స్‌తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లు చినెల్లె హెన్రీ, చెడియన్ నేషన్లు గ్రౌండ్‌లోనే కుప్పకూలడం ఆందోళన కలిగించింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆటగాళ్లు అప్రమత్తమై సిబ్బందిని అలర్ట్ చేశారు. ఫిజియో వచ్చి వారిని పరీక్షించి స్ట్రెచర్‌పై మైదానం నుంచి తీసుకెళ్లారు. అనంతరం వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ''ప్రస్తుతం వారిద్దరు కోలుకుంటున్నారని.. వాతావరణ మార్పులు, విపరీతమైన వేడిని తట్టుకోలేక డీహైడ్రేట్ అయ్యారని వైద్యులు తెలిపారు. ఇప్పడు వారిద్దరు బాగానే ఉన్నారని'' వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ వుమెన్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వుమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కైసియా నైట్ 30 నాటౌట్, చెడియన్ నేషన్ 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ వుమెన్స్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. దీంతో వర్షం అంతరాయం కలిగించే సమయానికి పాక్ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 103 పరుగులతో ఆడుతోంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం విండీస్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. Match between Pakistan and West Indies women cricketers continues ... Suddenly West Indies women cricketer fainted and collapsed . She was shifted to a nearby hospital. Hopefully she will recover soon. VC: @windiescricket#WIWvPAKW #WIWvsPAKW pic.twitter.com/OjhJmWioeO — Qadir Khawaja (@iamqadirkhawaja) July 2, 2021 -
BCCI: అనుకున్నాం... కానీ ఇవ్వలేకపోయాం
న్యూఢిల్లీ: గతేడాది కరోనా కారణంగా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు ప్రతిష్టాత్మకమైన రంజీ టోర్నీ రద్దయింది. మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టుల రూపంలో దేశవాళీ ఆటగాళ్లకు చెప్పలేనంత ఆర్థిక నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్ద మనసు చేసుకుంది. ఆయా టోర్నీలను కోల్పోయిన పురుషులు, మహిళా క్రికెటర్లకు పరిహారం అందజేయాలని గతేడాదే నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. అయితే బోర్డు కృషి మాత్రం ప్రణాళికాబద్ధంగా సాగలేదు. ఆచరణలో విఫలమైంది. ఏడాది పూర్తయినా కానీ ఇంకా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు, అమ్మాయిలకు ఎలాంటి పరిహారభత్యం అందలేదు. మహిళల టి20 ప్రపంచకప్ రన్నరప్ భారత్‌కు ప్రైజ్‌మనీ ఇవ్వలేదన్న అంశం తెరమీదకు రావడంతో ఇప్పుడు ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్ల చెల్లింపుల విషయం కూడా బయటికొచ్చింది. దీనిపై బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఆటగాళ్ల జాబితాలను ఇప్పటివరకు బీసీసీఐకి పంపలేదని, వారి తాత్సారం వల్లే ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు పరిహారం అందజేయలేకపోయామని చెప్పారు. ‘ఎవరు ఆడేవాళ్లు. ఎన్ని మ్యాచ్‌లు ఆడతారు. ఎవరు రిజర్వ్ ఆటగాళ్లు అన్న వివరాలేవీ రాష్ట్ర సంఘాలు పంపలేదు. అందుకే చెల్లించలేకపోయాం’ అని అరుణ్ అన్నారు. -
షఫాలీ, రాజేశ్వరి, పూనమ్ రౌత్‌లకు ప్రమోషన్
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్‌కుగాను మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. గత ఏడాది కాంట్రాక్ట్‌లలో 22 మంది ఉండగా... ఈసారి దానిని 19 మందికి పరిమితం చేశారు. వార్షిక కాంట్రాక్ట్ ఫీజుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గ్రేడ్ ‘ఎ’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 50 లక్షలు... గ్రేడ్ ‘బి’ వారికి రూ. 30 లక్షలు... గ్రేడ్ ‘సి’ వారికి రూ. 10 లక్షలు లభిస్తాయి. గత ఏడాది కాంట్రాక్ట్ పొందిన ఏక్తా బిష్త్, వేద కృష్ణమూర్తి, హేమలత, అనూజా పాటిల్‌లకు ఈసారి స్థానం లభించలేదు. టీనేజ్ క్రికెటర్ షఫాలీ వర్మ, లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్, ఓపెనర్ పూనమ్ రౌత్‌లకు ప్రమోషన్ లభించింది. ఈ ముగ్గురు గ్రేడ్ ‘సి’ నుంచి గ్రేడ్ ‘బి’లోకి వచ్చారు. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ గ్రేడ్ ‘బి’లోనే కొనసాగనుండగా... బెంగాల్ అమ్మాయి రిచా ఘోష్‌కు తొలిసారి కాంట్రాక్ట్ దక్కింది. గ్రేడ్ ‘ఎ’ (రూ. 50 లక్షల చొప్పున): హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్. గ్రేడ్ ‘బి’ (రూ. 30 లక్షల చొప్పున): మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్, రాజేశ్వరి గైక్వాడ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తానియా, జెమీమా రోడ్రిగ్స్. గ్రేడ్ ‘సి’ (రూ. 10 లక్షల చొప్పున): అరుంధతి రెడ్డి, మాన్సి జోషి, పూజా వస్త్రకర్, హర్లీన్ డియోల్, ప్రియా పూనియా, రిచా ఘోష్. -
మహిళల జట్టులో అన్నీ రాజకీయాలే!
భారత మహిళల క్రికెట్ జట్టు అంతర్గత వ్యవహారాలపై మరో మాజీ కోచ్ తుషార్ అరోథే తీవ్ర విమర్శలు చేశారు. బయటకు కనిపించని రాజకీయాలు చాలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీమ్‌తో సంబంధం లేని మాజీ మహిళా క్రికెటర్లు బయటినుంచి ఎన్నో విషయాలు శాసిస్తుంటారని అన్నారు. తప్పు ఎవరిదైనా కోచ్‌పైనే వేటు పడుతుందన్న తుషార్... అగ్రశ్రేణి జట్లతో పోటీ పడే విధంగా మన సన్నాహకాలు బాగుండాలని చెబితే తాము అంత కష్టపడలేం అన్నట్లుగా వారు వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. -
మహిళా క్రికెట్: నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో విమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్)2020 టైటిల్ విజేతగా ట్రైల్ బ్లేజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్మ్యాచ్కు ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫైనల్ పోరులో ఎవరు గెలిచినా ఆ విజయం ఎంతోమంది ఔత్సాహిక మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె భారతదేశంలో మహిళల క్రికెట్‌కు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి నీతా అంబానీ ఇన్‌స్టాలో సోమవారం ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రతి రంగంలో, ముఖ్యంగా క్రీడా, విద్యా రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలని, వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నీతా పేర్కొన్నారు. ఇందుకు తమ ఫౌండేషన్ తరపున బాలికలు అందరికీ విద్య, క్రీడా అవకాశాలు అందించాలనేదే తన ధ్యేయమని చెప్పారు. మౌలిక వసతులు, సదుపాయాలతోపాటు, అవకాశాలు, నైపుణ్య శిక్షణ అవసరమన్నారు. ఈ విషయంలో తమ ఫౌండేషన్ చాలా కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో దేశానికి 33 మందితోపాటు, 12 మంది విదేశీ మహిళా క్రికెటర్లు జియో విమెన్ 2020లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అలాగే తొలిసారి థాయ్‌లాండ్ నుంచి నాథకాన్(24) పాల్గొంటున్నారని నీతా అంబానీ తెలిపారు. క్రీడల్లో బాలికల ప్రోత్సాహం కోసం నవీముంబైలో ఒక జియో క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పిస్తే, గ్లోబల్‌గా రాణిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించారని నీతా ప్రశంసించారు. టీమిండియా మహిళల క్రికెట్ జట్టు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తోందన్నారు. గత ఆరేళ్లుగా అంజుం చోప్పా, జులన్గోస్వామి, మిథాలీ రాజ్లాంటి లెజెండ్లు మంచి పేరు సంపాదించారన్నారు. అలాగే స్మృతి మంధన, పూనం యాదవ్, హర్మన్ ప్రీత్‌కౌర్ మన మహిళా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. భవిష్యత్తులోమరింత రాణించనున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్నోవాస్ను ఓడించి మూడేళ్లలో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది ట్రైల్ బ్లేజర్స్. జియో అండ్ రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ మహిళల టి 20 ఛాలెంజ్‌ను స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. View this post on Instagram “In the end, women’s cricket will be the winner today.” - Mrs. Nita Ambani. . Here’s how Reliance Foundation Education and Sports for All and JIO are bridging the gender divide in sport. . #OneFamily #MumbaiIndians #MI #JioWomensT20Challenge @reliancefoundation @reliancejio A post shared by Mumbai Indians (@mumbaiindians) on Nov 9, 2020 at 7:17am PST -
యూఏఈ చేరుకున్న మహిళా క్రికెటర్లు
దుబాయ్: మహిళల టి20 చాలెంజ్ సిరీస్ కోసం భారత టాప్–30 మహిళా క్రికెటర్లు గురువారం యూఏఈ చేరుకున్నారు. షార్జా వేదికగా నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనున్న ఈ టోర్నీలో భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్, టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ తదితరులు పాల్గొననున్నారు. తొమ్మిదిరోజుల పాటు ముంబైలో క్వారంటైన్లో ఉన్న మహిళా క్రికెటర్లు... బయో బబుల్‌లోకి ప్రవేశించే ముందు మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఆరు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో సూపర్నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ జట్లకు మిథాలీరాజ్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ సారథ్యం వహిస్తారు. మినీ ఐపీఎల్‌గా పరిగణించే ఈ టోర్నీతోనే భారత మíహిళా క్రికెటర్లు కరోనా విరామం తర్వాత తొలి సారి మళ్లీ బ్యాట్ పడుతున్నారు. -
మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన
వడోదర: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం బరోడా మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న అతుల్ బెదాడే తీవ్ర వివాదానికి కేంద్రంగా మారాడు. తాను కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమ్ క్రికెటర్లతో అతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. దాంతో బెదాడేను సస్పెండ్ చేస్తున్నట్లు బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) ప్రకటించింది. ఈ మేరకు బెదాడేకు లేఖ రాసిన కార్యదర్శి అజిత్ లెలె పలు అంశాలు వెల్లడించారు. ‘మహిళా క్రికెటర్ల శారీరక విషయాల గురించి, వారి ఆరోగ్య విషయాల గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర భాష మాట్లాడటం, లైంగికపరమైన అంశాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేయడంలాంటివి’... బెదాడేపై వచ్చిన ప్రధాన ఆరోపణలని ఆయన చెప్పారు. క్రికెటర్ల రాతపూర్వక ఫిర్యాదు తర్వాత తాము విచారణ జరపడంతో అనేక విషయాలు బయటపడ్డాయని లెలె పేర్కొన్నారు. ప్రస్తుతానికి సస్పెండ్ చేసినా... ఈ అంశంపై ఇక ముందు పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కూడా బీసీఏ ప్రకటించింది. 53 ఏళ్ల అతుల్ బెదాడే 1994లో భారత్ తరఫున 13 వన్డేలు ఆడి 22.57 సగటుతో 158 పరుగులు చేశాడు. -
ఒక్కటైన క్రికెట్ జంట!
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ హలే జెన్సెన్, ఆస్ట్రేలియాకు చెందిన నికోలా హాన్‌కాక్‌ను పెళ్లాడారు. వారం రోజుల క్రితం ఈ క్రికెట్ జంట వివాహ బంధంతో ఒక్కటైనట్లు నికోలా ప్రాతినిథ్యం వహిస్తున్న మెల్బోర్న్ స్టార్స్ ట్విటర్ ద్వారా పేర్కొంది. ఈ మేరకు... ‘ గత వారం తన భాగస్వామి హెలే జెన్సెన్ను పెళ్లాడిన మా స్టార్ బౌలర్ హాన్‌కాక్‌కు టీమ్‌గ్రీన్ తరఫున శుభాభినందనలు’ అంటూ కొత్త జంట ఫొటోను షేర్ చేసింది. కాగా విక్టోరియా వుమన్ ప్రీమియర్ క్రికెట్ కాంపిటీషన్ సీజన్ 2017-18లో ప్రతిభ కనబరిచినందుకు గానూ ఉనా పైస్లీ మెడల్ పొందిన జెన్సెన్.. 2014లోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. కివీస్ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగిన ఆమె.. 2015లో జరిగిన ఓ మ్యాచ్‌లో 122 పరుగులు చేసి వుమెన్ క్రికెట్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. ఇక ఆమె జీవిత భాగస్వామి హాన్కాక్ మహిళా బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక ఆగస్టు 19, 2013 నుంచి న్యూజిలాండ్‌లో స్వలింగ వివాహాలు చట్టబద్ధమైన సంగతి తెలిసిందే. కాగా క్రికెట్ లెస్బియన్ జంట పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్, ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. -
పెళ్లితో ఒక్కటైన మహిళా క్రికెటర్లు!
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు అగ్రశ్రేణి క్రీడాకారిణిలిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జట్టు కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్ శనివారం పెళ్లి చేసుకున్నారు. సఫారీ దేశంలో ఇద్దరు మహిళల వివాహంపై ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. 2009 వరల్డ్ కప్ టోర్నీలో వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. 2017–18 సంవత్సరానికి దక్షిణాఫ్రికా అత్యుత్తమ క్రికెటర్ అవార్డు అందుకున్న నికెర్క్, ఇప్పుడు ఆ దేశం తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతోంది. కాప్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. వీరిద్దరు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా టాప్–10లో ఉన్నారు. బిగ్‌బాష్ లీగ్‌లో కూడా సిడ్నీ సిక్సర్స్ తరఫున కలిసి ఆడిన నికెర్క్, కాప్... దక్షిణాఫ్రికాలో బాలుర అకాడమీలో శిక్షణ పొందిన తొలి ఇద్దరు అమ్మాయిలుగా కూడా గుర్తింపు పొందారు. ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఇది రెండోసారి. గత ఏడాది న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌ను సహచరి లియా తహుహు పెళ్లాడింది. -
బీసీసీఐ పై అభిమానుల ఆగ్రహం
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా క్రికెటర్ల వార్షిక వేతనాలను భారీగా పెంచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపులో పురుష, మహిళా క్రికెటర్లకు వ్యత్యాసం చూపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత పురుషుల క్రికెటర్లకు కోట్లలో వార్షిక వేతనం ఉండగా.. మహిళా క్రికెటర్లకు లక్షల్లో ఉండటం ఏమిటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రికెటర్లుకు ఇచ్చిన కానుక ఇదేనా? అని నిలదీస్తున్నారు. దేశం తరుఫున ఇరు జట్లు అద్బుతంగా రాణిస్తున్నా జీతాల్లో ఇంత వ్యత్యాసం ఏమిటో ప్రశ్నించండి అని ఒకరంటే.. షేమ్ బీసీసీఐ.. మహిళా టాప్ క్రికెటర్ల జీతాలు పురుషుల సీ గ్రేడ్ ఆటగాళ్ల వేతనాల్లో సగం ఉండటం సిగ్గుచేటని మరోకరు ట్రోల్ చేస్తున్నారు. పురుషుల కెప్టెన్ విరాట్ కోహ్లికి రూ 7 కోట్లు వస్తే మహిళా జట్టు కెప్టెన్‌కు మరి రూ. 50 లక్షలా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక భారత పురుషుల క్రికెటర్ల జీతాలు ఏ+ గ్రేడ్- రూ. 7 కోట్లు, ఏ గ్రేడ్- రూ. 2 కోట్ల నుంచి 5 కోట్లు, బీ గ్రేడ్ - రూ.1 కోటి నుంచి 3 కోట్లు, సీ గ్రేడ్- రూ. 50 లక్షల నుంచి 1 కోటి మేర పెంచారు. ఇటీవల మహిళా క్రికెటర్ల అద్బుతంగా రాణించడంతో అభిమానుల నుంచి ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో వీరి జీతాలు కూడా భారీగా పెరుగుతాయని అందరు భావించారు. కానీ బీసీసీఐ మహిళా దినోత్సవం నాడే మహిళా క్రికెటర్లకు మొండి చెయ్యి చూపించింది. జీతాలు పెంచిన అవి పురుష క్రికెటర్లతో పోల్చితో చాలా తక్కువ. భారత మహిళా క్రికెటర్ల వార్షిక వేతనాలు.. గ్రేడ్ ఏ- 50 లక్షలు, గ్రేడ్ బీ- 30 లక్షలు, గ్రేడ్ సీ -10 లక్షలుగా ప్రకటించారు. ఈ వార్షిక వేతనాల వ్యత్యాసం మరీ ఇంతగా ఉండటం నెటిజన్లకు ఆగ్రహం కలిగిస్తోంది. नारी शशक्तिकरण की धज्जियाँ उड़ा रहा है @BCCI The pay gap b/w the male and female cricket players is so huge. How this gap will uplift the motivation of the women players @PMOIndia @Manekagandhibjp @NCWIndia please look into this @BJP4India @narendramodi @INCIndia @cpimspeak @IYC pic.twitter.com/xvClEyH0a7 — Sachin Dubey (@ISachinDubey) 8 March 2018