
క్రీడా విజేతలకు జగన్ అభినందనలు
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో అద్వితీయ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. క్రికెట్, టెన్నిస్‌ల్లో విజేతలుగా నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గెలుపొందడం ద్వారా మహిళల డబుల్స్ టెన్నిస్‌లో వరసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న సానియా మీర్జా, మార్టినా హింగిస్ జంటను, టీ ట్వంటీ క్రికెట్‌లో సిరీస్‌లు గెలుపొందిన మిథాలీ రాజ్ నేతృత్వంలోని మహిళా క్రికెటర్లను, అలాగే ధోనీ బృందాన్ని వైఎస్ జగన్ అభినందించారు. భారత క్రీడాకారులు భవిష్యత్తులో కూడా తమ విజయాల పరంపరను కొనసాగించాలని జగన్ ఆకాంక్షించారు.