మహిళా క్రికెటర్లకు దేశవాళీ రెడ్ బాల్ టోర్నీ
ముంబై: భారత దేశవాళీ క్యాలెండర్‌లో మహిళా క్రికెటర్ల కోసం ఆరేళ్ల తర్వాత రెడ్ బాల్ టోర్నీని నిర్వహించనున్నారు. ఈనెల 28 నుంచి ఏప్రిల్ 11 వరకు పుణేలో ఈ టోర్నీ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. మొత్తం ఆరు జోనల్ జట్లు (ఈస్ట్, నార్త్ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, నార్త్, సౌత్‌జోన్) ఈ టోర్నీలో పోటీపడతాయి.
ప్రతి మ్యాచ్ మూడు రోజులపాటు జరుగుతుంది. నార్త్, సౌత్ జోన్ జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్‌లు లభించగా... ఈస్ట్–నార్త్ ఈస్ట్; వెస్ట్–సెంట్రల్ జోన్ జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో గెలిచిన జట్లు సెమీఫైనల్స్‌లో నార్త్, సౌత్ జోన్ జట్లతో ఆడతాయి. చివరిసారి 2018లో మహిళా క్రికెటర్లకు రెడ్ బాల్ టోర్నీని ఏర్పాటు చేయగా... ఆ సమయంలో రెండు రోజుల మ్యాచ్‌లు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment