అందరి జీవితాల్లోనూ కొన్ని అపురూప క్షణాలు ఉంటాయి. అలాంటి వాటిని తడిమి చూసుకున్నప్పుల్లా ఒకలాంటి ఉద్వేగానికి లోనవుతాం. ఆటల్లోనూ ఇలాంటి అరుదైన క్షణాలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ప్రతిస్పందనగా రకరకాల భావోద్వేగాలకు గురవుతుంటాం. ముఖ్యంగా గెలుపోటములను నిర్ణయించే సమయంలో క్రీడాకారులతో ప్రేక్షకులు కూడా ఒత్తిడి, ఉత్కంఠ, ఆందోళన చెందుతుంటారు. ఆట చివరి క్షణాల్లోని నాటకీయతను మునివేళ్లపై నిల్చుకుని వీక్షిస్తుంటారు ఫ్యాన్స్. ఫలితాలకు అనుగుణంగా ఆనందం, నిరాశ, నిస్పృహ లాంటి భావావేశాలను ప్రకటిస్తుంటారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నమెంట్లలో ఎంతో పోటీ ఉంటుందో క్రీడాభిమానులందరికీ ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు.
సరిగ్గా అలాంటి సందర్భమే ఈసారి ఎదురయింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీ నుంచి భారత జట్టు భారంగా నిష్ర్కమించింది. తుది అంకానికి చేరువయ్యేందుకు చివరి బంతి వరకు పడతులు పోరు సాగించినా ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. అయితే గెలుపు కోసం ఇరు జట్ల క్రీడాకారిణులు సాగించిన సమరం స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు ప్రేక్షకులకు ఉత్కంఠతో కూడిన వినోదాన్ని అందించింది.
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో మార్చి 27న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీరాజ్ బృందం పోరాడి ఓడింది. చివరి బంతికి ఫలితం వచ్చిన ఈ మ్యాచ్‌లో అఖరి క్షణాలను ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆత్రుతగా చూశారు. తమ జాతకం భారత్ టీమ్ చేతిలో ఉండడంతో వెస్టిండీస్ క్రీడాకారిణులు మరింత ఉత్కంఠగా మ్యాచ్‌ను వీక్షించారు. మిథాలీరాజ్ బృందం ఓడిన క్షణంలో డ్రెసింగ్స్‌లో రూమ్‌లో విండీస్ క్రీడాకారిణుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. (క్లిక్: కత్తి మీద సాము లాంటిది.. ఎలా డీల్ చేస్తారో?!)
ఓడిపోయామనుకున్న మ్యాచ్‌లో గెలిచినట్టు తేలడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. విజయం సాధించేశామన్న సంతోషంతో భారత బృందం ప్రదర్శించిన ఆనంద క్షణాలు.. నోబాల్ నిర్వేదం, ఓటమి బాధతో నిర్వేద వదనంతో నిష్క్రమించిన క్షణాలు, కామెంటేటర్లు మాటలు మర్చిపోయి అవాక్కయిన దృశ్యాలు.. ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలాయి. కెమెరాలో నిక్షిప్తమైన ఈ అరుదైన దృశ్యాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన అధికారిక ట్విటర్‌లో పేజీ షేర్ చేసింది. జయాపజయాలను పక్కనపెడితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రదర్శించిన పోరాట పటిమ అందరి మనసులను గెలిచింది. (క్లిక్: భారత్ కొంపముంచిన నోబాల్..)
Comments
Please login to add a commentAdd a comment