Harmanpreet To Be Fined 75 Percent Match Fee, Receive Four Demerit Points - Sakshi
Sakshi News home page

టీమిండియా కెప్టెన్‌ దురుసు ప్రవర్తన.. ఐసీసీ చర్యలు

Published Sun, Jul 23 2023 3:27 PM | Last Updated on Sun, Jul 23 2023 4:04 PM

Harmanpreet To Be Fined 75 Percent Match Fee, Receive Four Demerit Points - Sakshi

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. బంగ్లాదేశ్‌తో నిన్న (జులై 22) జరిగిన మూడో వన్డేలో అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ.. బ్యాట్‌తో వికెట్లను కొట్టనందుకు గాను, అలాగే ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా అంపైర్లపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసినందుకు గాను హార్మన్‌కు ఐసీసీ జరిమనా విధించింది .

హర్మన్‌ వ్యవహరించిన తీరును దురుసు ప్రవర్తనగా పేర్కొన్న ఐసీసీ.. ఆమె మ్యాచ్‌ ఫీజ్‌లో 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. హర్మన్‌ ప్రవర్తనను లెవెల్‌ 2 అఫెన్స్‌ కింద పరిగణించిన ఐసీసీ.. ఆమెకు 4 డీ మెరిట్‌ పాయింట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.

జరిమానాలో 50 శాతం ఆన్‌ ఫీల్డ్‌ దురుసు ప్రవర్తనకు, 25 శాతం ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు ఐసీసీ తెలిపింది. అలాగే 3 డీమెరిట్‌ పాయింట్లు ఆన్‌ ఫీల్డ్‌ దురుసు ప్రవర్తనకు, ఓ డీమెరిట్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు వివరించింది. 

కాగా, బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్‍కు తగలకుండా.. ప్యాడ్‍కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్‍బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్‍ అవతల పిచ్ అయిందని భావించిన హర్మన్‌ అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయింది.  బ్యాట్‍తో వికెట్లను కొట్టడమే కాకుండా.. కనీస ధర్మాన్ని పాటించడం లేదంటూ అంపైర్‌ను తిట్టుకుంటూ పెవిలియన్‌ వైపు వెళ్లింది. 

ఇంతటితో ఆగని హర్మన్‌.. మ్యాచ్‌ అనంతరం ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా బంగ్లాదేశ్‌ అంపైరింగ్‌ ప్రమాణాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఇండియన్‌ హైకమీషన్‌కు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు కనీసం స్వాగతం కూడా పలకలేదని అసహనం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో అంపైరింగ్‌ లోపాలే అనుకున్నాం.. వారికి కనీస మర్యాదలు కూడా తెలియవని తీవ్రస్థాయి పదజాలాన్ని వాడింది. అలాగే ప్రజెంటేషన్‌ సెర్మనీ మొత్తం పూర్తయ్యాక బంగ్లా ఆటగాళ్లతో ఫోటోలు దిగేందుకు కూడా నిరాకరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement