భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగలనుంది. చైనాలోని హాంగ్‌ఝౌ వేదికగా జరుగనున్న ఏసియన్ గేమ్స్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు (టీ20లు) టీమిండియా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లేకుండానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడో వన్డేలో దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ హర్మన్‌కు 4 డీ మెరిట్ పాయింట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ క్రికెటర్ 2 డీ మెరిట్ పాయింట్లకు ఓ టీ20 మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన 4 డీ మెరిట్ పాయింట్లు మూటగట్టుకున్న హార్మన్.. టీమిండియా తదుపరి ఆడే ఆసియా క్రీడల్లో తొలి రెండు టీ20లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసియాలో టాప్ జట్టుగా ఉన్న భారత్ ఏసియన్ గేమ్స్‌లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఐసీసీ నిబంధనలు అమలైతే.. ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు హర్మన్ లేకుండా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ ఫైనల్‌కు చేరుకుంటే హర్మన్ ఆ మ్యాచ్ ఆడేందుకు అర్హత కలిగి ఉంటుంది. హర్మన్ గైర్హాజరీలో స్మృతి మంధన టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది.
ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో గోల్డ్ మెడల్‌పై కన్నేసిన భారత్‌కు కెప్టెన్ హర్మన్ లేకపోవడం పెద్ద లోటుగా పరిగణించాలి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ మహిళల విభాగంతో పాటు పురుషుల విభాగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఏసియన్ గేమ్స్-2023లో భారత్ పురుషుల క్రికెట్ జట్టు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో బరిలోకి దిగనుంది.
Comments
Please login to add a commentAdd a comment