క్రికెట్‌పై అమ్మాయిలు చూపిస్తున్న ఆసక్తి మహిళా క్రికెట్‌పై ఆశల్ని మరింత పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రికెట్ మహిళలు స్టార్లుగా సత్తా చాటుతున్న నేపథ్యంలో తాజాగా ఒక సంచలన తార అవతరించడం విశేషంగా నిలిచింది. తొమ్మిదేళ్లకే అత్యుత్తమ ప్రతిభతో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది.
ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఆకట్టుకునే స్టైలిష్ బ్యాట్ స్వింగ్‌తో మైదానం నలుమూలలకు బంతిని పరుగులు పెట్టించింది. గొప్ప క్రికెటర్‌గా రాణించాలని కలలు కంటోంది.
కశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక హర్మత్ ఇర్షాద్ భట్. సాధారణ డ్రైవర్ కుమార్తె. బుమై (జైంగీర్)లో రెండో తరగతి చదువుతోంది. ఇటీవల ప్లేగ్రౌండ్‌లో అబ్బాయిల టీంతో ఆడుతూ షాట్‌లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఆమె లాంటి పిల్లలు క్రికెట్‌ను ఆస్వాదించడం చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈవీడియోను రీ-ట్వీట్ చేశాడు. యువత ఆడటం క్రికెట్ ఆడటం చూడటం తనకు చాలా సంతోషినిస్తోందంటూ ట్వీట్‌చేశారు. దీంతో మరింత వైరల్ అయింది. పలువురు ఆమె టాటెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Always good to see young girls playing cricket. Watching videos like these brings a smile to my face. https://t.co/LaQv9ymWRx
— Sachin Tendulkar (@sachin_rt) March 30, 2024
క్రికెట్ స్టార్లు మిథాలీ రాజ్,శిఖర్ ధావన్ తన ఫ్యావరెట్ అని చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ని చూసిన తర్వాత క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకుందట. అంతేకాదు చాలా కాలంగా ఈ ప్లేగ్రౌండ్‌లో ఆడతానని తన కిష్టమైన షాట్ కవర్ డ్రైవ్ అని, తన తాతయ్యతో కలిసి ఆడేదాన్నని చెప్పుకొచ్చింది. ఉదయం 8 గంటలకు ప్రాక్టీస్ షురూ. జాసిమ్ భట్, అర్సలాన్, ఫైసల్, ఫయీజ్, ఇఖ్లాక్ , ఇతర అబ్బాయిలతో పోటీ పడి ఆడుతుంది.
‘‘సచిన్ సర్ నా వీడియోను షేర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ” హర్మత్.
భారత జట్టులోకి ఎంపికై మిథాలీ రాజ్‌తో మ్యాచ్ ఆడాలని హర్మత్ కలలు కంటోంది. ఇక్కడ చాలా టాలెంట్ ఉంది కానీ తగిన గుర్తింపు లభించడం లేదని, శిక్షణకోసం అకాడమీలు లేవంటూ స్థానికులు తౌసీఫ్ అహ్మద్ వ్యాఖ్యానించారు హర్మత్ తరహాలో క్రీడాకారులకు క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment