కోహ్లి గేమ్‌కు పాక్‌ వుమెన్‌ క్రికెటర్లు ఫ్లాట్‌ | Pak Women Cricketers Praised Kohli After 35 Tone | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 17 2018 2:05 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

Pak Women Cricketers Praised Kohli After 35 Tone  - Sakshi

కైనత్‌ ఇంతియాజ్‌.. నైని అబిది (ఇన్‌సెట్‌లో కోహ్లి)

సాక్షి, స్పోర్ట్స్‌ : సౌతాఫ్రికాతో చివరి వన్డేలో సెంచరీతో విజృంభణతో టీమిండియాకు విజయాన్ని, వన్డే సిరీస్‌ను కట్టబెట్టిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఇండియాలోనే కాదు.. పాక్‌ లోనూ అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహిళా క్రికెటర్లు కోహ్లి ఆటకు ఫ్లాట్‌ అయిపోయారు. 

‘బ్యాట్స్‌మెన్‌ అమితమైన గుర్తింపు. 35 సెంచరీలతో అమోఘమైన రికార్డు. నిజంగా అద్భుతమైన బ్యాటింగ్‌. కోహ్లి ఓ జీనియస్‌’ అంటూ పాక్‌ బ్యాట్స్‌ ఉమెన్‌ నైని అబిది ట్వీట్‌ చేయగా.. వాట్‌ ఏ ప్లేయర్‌ అంటూ మరో క్రీడాకారిణి కైనత్‌ ఇంతియాజ్‌ ట్వీట్‌ చేసింది.

ఇక యువరాజ్‌, రైనా, అశ్విన్‌ రవిచంద్రన్‌, అఫ్గన్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌, ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌పీటర్సన్‌లు కూడా ట్విటర్‌లో ప్రశంసలు కురిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement