సాక్షి, హైదరాబాద్: బెంగళూరు చిన్న స్వామి స్టేడింలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మహిళా క్రికెట్ స్టార్లు హార్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధనలు కలిశారు. ఈ ఏడాది మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టులో ఈ లేడీ క్రికెటర్లు అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆసీస్‌తో నాలగో వన్డే అనంతరం కోహ్లితో ఈ లేడీ క్రికెటర్లు సరదాగా నవ్వుతూ మాట్లాడారు. ఈ ఫోటోను బీసీసీఐ శుక్రవారం తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌పై కొందరు అభిమానులు సానుకూలత వ్యక్తం చేయగా.. మరికొందరు ధోని బ్యాటింగ్ ఆర్డర్ స్థానం ప్రస్తావిస్తూ కోహ్లిపై మండిపడ్డారు. ధోనిని నాలుగో స్థానంలో పంపించకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందని, ఎన్నోసార్లు మంచి ఫినీషర్‌గా సత్తా చాటిన ధోనిని నాలుగు లేదా ఐదో స్థానంలో పంపిచకపోవడం విస్మయానికి గురి చేస్తోందని ట్వీట్లతో విమర్శించారు. ఇక నాలుగో వన్డేలో ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో భారత్ ఓడిన విషయం తెలిసిందే.
#TeamIndia Captain @imVkohli meets @BCCIWomen members @ImHarmanpreet & @mandhana_smriti post the match in Bengaluru pic.twitter.com/3sMyl4ZfGD
— BCCI (@BCCI) 29 September 2017
@imVkohli bhai..meeting toh hoti rahe gi..Dhoni ko No.4 pa batting kab karwaogah...
— Dilwar (@DIL__war) 29 September 2017