HarmanPreetKaur
-
ఆస్ట్రేలియాతో తొలి టీ20.. బ్యాటింగ్ భారత్‌దే! కర్నూలు అమ్మాయి ఎంట్రీ
ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళలలతో తొలి టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా భారత బ్యాటర్ దేవికా వైద్యకు తుది జట్టలో చోటు దక్కింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వణి భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. ఇక ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ లానింగ్ దూరం కావడంతో హీలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తుంది. కాగా భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తుది జట్లు ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ(కెప్టెన్), బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, గ్రేస్ హారిస్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్ భారత జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దేవికా వైద్య, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి శర్వాణి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ చదవండి: ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ఆల్ రౌండర్ దూరం
స్వదేశంలో ఆస్ట్రేలియా మహిళలతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. ఇక ఈ హోం సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా దూరమైంది. ఇక స్వదేశీ సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9న ముంబై వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ తమ జట్టును ప్రకటిచింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్ భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్ల్యాండ్, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్. చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! -
చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది. మహిళల ఆసియాకప్-2022 ఫైనల్లో శ్రీలంకపై బరిలోకి దిగిన హర్మన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు హర్మన్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 137 మ్యాచ్‌లు ఆడింది. అంతకుముందు ఈ అరుదైన రికార్డు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. బేట్స్ ఇప్పటి వరకు 136 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడింది. తాజా మ్యాచ్‌తో బేట్స్ రికార్డును హర్మన్‌ప్రీత్ అధిగమించింది. కాగా హర్మన్‌ప్రీత్ 2009లో భారత్ తరపున టీ20 అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు 122 ఇన్నింగ్స్‌లో హర్మన్.. 2,683 పరుగులు చేసింది. ఆమె టీ20 కెరీర్లో ఇప్పటి వరకు సెంచరీతో పాటు 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక భారత మహిళా క్రికెటర్ కూడా హర్మన్ కావడమే గమనార్హం. ఆసియా కప్-2022 విజేత భారత్ ఇక మహిళల ఆసియా కప్-2022 ఛాంపియన్స్‌గా భారత్ నిలిచింది. షెల్లాట్ వేదికగా ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి.. 7వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ అవతరించింది. ఈ మ్యాచ్‌లో 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను పూర్తి చేసింది. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు.. రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: Women's Asia Cup 2022: ఛాంపియన్ భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? -
రన్ఔట్ విషయం లో మమ్మల్ని హెచ్చరించలేదు : హీథర్ నైట్
-
శ్రీలంకతో రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన భారత్
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో టీ20కు సిద్దమైంది. దంబుల్లా వేదికగా శనివారం జరగునున్న ఈ మ్యాచ్‌లో తొలి టీ20 జోరును కనబరిచి సిరీస్ కైవసం చేసుకోవాలని హర్మన్ ప్రీత్ సేన భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 అధిక్యంలో ఉంది. ఇక బౌలింగ్, బ్యాటింగ్ పరంగా భారత్ పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ రాణిస్తుండగా.. బౌలింగ్‌లో రాధా యాదవ్,దీప్తీ శర్మ, పుజా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. భారత తుది జట్టు(అంచనా): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, రాధా యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్ చదవండి: India Vs Ireland T20: రాహుల్ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు! -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2022కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, తానియా భాటియా, రిచా ఘోష్ వికెట్ కీపర్ల లిస్ట్‌లో ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నమెంట్ మార్చి 4న బే ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడనుంది. ఇక మార్చి 4న భారత్ తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా భారత్ ఈసారి టైటిల్ బరిలో హాట్ ఫేవరేట్ దిగనుంది. భారత జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన , షఫాలి వర్మ, యాస్తిక, దీప్తి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, ఝులన్, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ స్టాండ్‌బై: ఎస్. మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్ చదవండి: SA Vs IND: ఎవరీ అల్లావుద్దీన్ పాలేకర్.. భారత్‌తో ఏంటి సంబంధం ? #TeamIndia squad for ICC Women's World Cup 2022 & New Zealand ODIs: Mithali Raj (C), Harmanpreet Kaur (VC), Smriti, Shafali, Yastika, Deepti, Richa Ghosh (WK), Sneh Rana, Jhulan, Pooja, Meghna Singh, Renuka Singh Thakur, Taniya (WK), Rajeshwari, Poonam. #CWC22 #NZvIND pic.twitter.com/UvvDuAp4Jg — BCCI Women (@BCCIWomen) January 6, 2022 -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లండ్
గ్రాస్‌ఐలెట్ (సెయింట్ లూసియా): మహిళల టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలింది. ఈ నెల 23న శుక్రవారం జరిగే రెండో సెమీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఆదివారం అర్ధరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పరాజయం పాలైన ఇంగ్లండ్... గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్ ‘బి’ టాపర్ భారత్‌ను ఆ జట్టు ఎదుర్కోనుంది. దీనికి కొద్ది గంటల ముందు జరిగే తొలి సెమీస్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఢీ కొంటాయి. అజేయంగా విండీస్.. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ గ్రూప్ ‘ఎ’లో అజేయంగా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డిండ్రా డాటిన్ (2/21) ధాటికి తొలుత ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేసింది. సోఫియా డంక్లీ (35) టాప్ స్కోరర్. ఛేదనలో తడబడినప్ప టికీ, డాటిన్ (46), షిమైన్ కాంప్‌బెల్ (45) రాణించడంతో విండీస్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి గెలుపొందింది. -
కోహ్లితో మహిళా క్రికెటర్లు.. ధోని ఫ్యాన్స్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు చిన్న స్వామి స్టేడింలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని మహిళా క్రికెట్ స్టార్లు హార్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధనలు కలిశారు. ఈ ఏడాది మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టులో ఈ లేడీ క్రికెటర్లు అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆసీస్‌తో నాలగో వన్డే అనంతరం కోహ్లితో ఈ లేడీ క్రికెటర్లు సరదాగా నవ్వుతూ మాట్లాడారు. ఈ ఫోటోను బీసీసీఐ శుక్రవారం తన అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై కొందరు అభిమానులు సానుకూలత వ్యక్తం చేయగా.. మరికొందరు ధోని బ్యాటింగ్ ఆర్డర్ స్థానం ప్రస్తావిస్తూ కోహ్లిపై మండిపడ్డారు. ధోనిని నాలుగో స్థానంలో పంపించకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందని, ఎన్నోసార్లు మంచి ఫినీషర్‌గా సత్తా చాటిన ధోనిని నాలుగు లేదా ఐదో స్థానంలో పంపిచకపోవడం విస్మయానికి గురి చేస్తోందని ట్వీట్లతో విమర్శించారు. ఇక నాలుగో వన్డేలో ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో భారత్ ఓడిన విషయం తెలిసిందే. #TeamIndia Captain @imVkohli meets @BCCIWomen members @ImHarmanpreet & @mandhana_smriti post the match in Bengaluru pic.twitter.com/3sMyl4ZfGD — BCCI (@BCCI) 29 September 2017 @imVkohli bhai..meeting toh hoti rahe gi..Dhoni ko No.4 pa batting kab karwaogah... — Dilwar (@DIL__war) 29 September 2017 -
'ఆమె నా కూతురైనందుకు గర్వపడుతున్నా'
ఢిల్లీ: అత్యున్నత క్రీడా పురస్కారాలలో ఒకటైన అర్జున అవార్డుకు టీమిండియా మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్‌కౌర్ పేరును ప్రతిపాదించడంపై ఆమె తండ్రి హర్మందర్ సింగ్ బుళ్లార్ హర్షం వ్యక్తం చేశారు. ఆడపిల్లలు భారమని ఎందరో తల్లిదండ్రులు భావిస్తుంటారు కానీ ఆడపిల్లకు తండ్రిని కావడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. కూతురిగా హర్మన్‌ప్రీత్‌ను అందించిన దేవుడికి రుణపడి ఉంటానన్నారు. తన కూతురు హర్మన్ ప్రీత్ పేరును అర్జున అవార్డు కోసం పరిగణనలోకి తీసుకున్నందుకు ప్రభుత్వానికి, బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ పలు కీలక ఇన్నింగ్స్ ఆడింది. ముఖ్యంగా సెమీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ సెంచరీతో జట్టును ఫైనల్ చేర్చడం ఒకటి. భుజం గాయం బాధిస్తున్నప్పటికీ.. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనూ హాఫ్ సెంచరీతో హర్మన్ ప్రీత్ కీలక ప్రదర్శణ చేసింది. మన జాతీయ క్రీడైన హాకీలో సుదీర్ఘకాలంగా ముఖ్య భూమిక పోషిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్, పారా ఒలింపియన్ దేవేందర్ ఝఝారియాను ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించగా.. అర్జునకు సిఫారుసు చేసిన వారిలో క్రికెటర్లు చటేశ్వర పుజరా(పురుష క్రికెటర్), హర్మన్ ప్రీత్ కౌర్ (మహిళా క్రికెటర్)లతో పాటు పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మరియప్పన్ తంగవేలు, వరుణ్ భాటి, గోల్ఫర్ ఎస్ ఎస్ పీ చవ్రాసియా, హాకీ ఆటగాడు ఎస్ వీ సునీల్ సహా 17 మంది ఉన్నారు.