
గ్రాస్‌ఐలెట్ (సెయింట్ లూసియా): మహిళల టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలింది. ఈ నెల 23న శుక్రవారం జరిగే రెండో సెమీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఆదివారం అర్ధరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పరాజయం పాలైన ఇంగ్లండ్... గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్ ‘బి’ టాపర్ భారత్‌ను ఆ జట్టు ఎదుర్కోనుంది. దీనికి కొద్ది గంటల ముందు జరిగే తొలి సెమీస్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఢీ కొంటాయి.
అజేయంగా విండీస్..
డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ గ్రూప్ ‘ఎ’లో అజేయంగా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డిండ్రా డాటిన్ (2/21) ధాటికి తొలుత ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేసింది. సోఫియా డంక్లీ (35) టాప్ స్కోరర్. ఛేదనలో తడబడినప్ప టికీ, డాటిన్ (46), షిమైన్ కాంప్‌బెల్ (45) రాణించడంతో విండీస్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment