మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం వెస్టిండీస్ జట్టును నిన్న (ఆగస్ట్ 29) ప్రకటించారు. ఈ జట్టులో స్టార్ ప్లేయర్ డియాండ్రా డొట్టిన్‌కు చోటు కల్పించారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డొట్టిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని తిరిగి జట్టులో చేరింది. మహిళల టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు డొట్టిన్ పేరిట ఉంది. విండీస్ జట్టుకు హేలీ మాథ్యూస్ సారథ్యం వహించనుంది.
మొత్తం 15 మంది సభ్యుల బృందాన్ని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేశారు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన జట్టులో నాలుగు మార్పులు చేశారు విండీస్ సెలెక్టర్లు. డొట్టిన్‌తో పాటు అష్మిని మునిసర్, మ్యాండీ మంగ్రూ, అన్‌క్యాప్డ్ ప్లేయర్ నెరిస్సా క్రాఫ్టన్‌లను కొత్తగా జట్టులోకి వచ్చారు. శ్రీలంక టూర్‌లో ఆడిన చెర్రీ ఫ్రేసర్, రషాదా విలియమ్స్, షబిక గజ్నబీ, కేట్ విల్‌మాట్ స్థానాల్లో వీరికి అవకాశం లభించింది.
కాగా, 2016 ఎడిషన్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్.. త్వరలో ప్రారంభంకాబోయే వరల్డ్‌కప్‌లో గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. విండీస్.. అక్టోబర్ 4న సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది.
వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్‌బెల్, ఆలియా అలెన్, అఫీ ఫ్లెచర్, అష్మిని మునిసర్, చెడీన్ నేషన్, చినెల్ హెన్రీ, డియాండ్రా డొట్టిన్, కరిష్మా రామ్‌హారక్, మ్యాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్, క్వియానా జోసఫ్, షమీలియా కానెల్, స్టెఫానీ టేలర్, జైదా జేమ్స్
Comments
Please login to add a commentAdd a comment