శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో టీ20కు సిద్దమైంది. దంబుల్లా వేదికగా శనివారం జరగునున్న ఈ మ్యాచ్‌లో తొలి టీ20 జోరును కనబరిచి సిరీస్ కైవసం చేసుకోవాలని హర్మన్ ప్రీత్ సేన భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 అధిక్యంలో ఉంది.
ఇక బౌలింగ్, బ్యాటింగ్ పరంగా భారత్ పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ రాణిస్తుండగా.. బౌలింగ్‌లో రాధా యాదవ్,దీప్తీ శర్మ, పుజా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
భారత తుది జట్టు(అంచనా): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, రాధా యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్
చదవండి: India Vs Ireland T20: రాహుల్ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు!
Comments
Please login to add a commentAdd a comment