Harmanpreet Kaur to lead Team India Women in T20I Series against Australia - Sakshi
Sakshi News home page

IND-W vs AUS_W: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. భారత జట్టు ప్రకటన! స్టార్‌ ఆల్‌ రౌండర్‌ దూరం

Published Fri, Dec 2 2022 12:13 PM | Last Updated on Sat, Dec 3 2022 10:33 AM

Harmanpreet Kaur to lead Indian Women team vs Australia inT20 Series - Sakshi

స్వదేశంలో ఆస్ట్రేలియా మహిళలతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. ఇక ఈ హోం సిరీస్‌కు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా దూరమైంది.

ఇక స్వదేశీ సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. డిసెంబర్‌ 9న ముంబై వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా క్రికెట్‌ తమ జట్టును ప్రకటిచింది.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్

భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్‌), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్‌ కెప్టెన్‌), డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్‌ల్యాండ్, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్.
చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement