భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది. మహిళల ఆసియాకప్-2022 ఫైనల్లో శ్రీలంకపై బరిలోకి దిగిన హర్మన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
ఇప్పటి వరకు హర్మన్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 137 మ్యాచ్‌లు ఆడింది. అంతకుముందు ఈ అరుదైన రికార్డు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. బేట్స్ ఇప్పటి వరకు 136 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడింది.
తాజా మ్యాచ్‌తో బేట్స్ రికార్డును హర్మన్‌ప్రీత్ అధిగమించింది. కాగా హర్మన్‌ప్రీత్ 2009లో భారత్ తరపున టీ20 అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు 122 ఇన్నింగ్స్‌లో హర్మన్.. 2,683 పరుగులు చేసింది. ఆమె టీ20 కెరీర్‌లో ఇప్పటి వరకు సెంచరీతో పాటు 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక భారత మహిళా క్రికెటర్ కూడా హర్మన్ కావడమే గమనార్హం.
ఆసియా కప్-2022 విజేత భారత్
ఇక మహిళల ఆసియా కప్-2022 ఛాంపియన్స్‌గా భారత్ నిలిచింది. షెల్లాట్ వేదికగా ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి.. 7వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ అవతరించింది. ఈ మ్యాచ్‌లో 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను పూర్తి చేసింది. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు.. రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: Women's Asia Cup 2022: ఛాంపియన్ భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment