Women's Asia Cup 2022
-
POTM: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఇండియా, పాకిస్తాన్ క్రికెటర్లు
ICC Player Of The Month Winners: రికార్డుల రారాజు, టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరో ఘనత అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న ఈ స్టార్ బ్యాటర్.. అక్టోబరు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి సోమవారం వెల్లడించింది. పురుషుల క్రికెట్ విభాగంలో డేవిడ్ మిల్లర్, సికందర్ రజాలను వెనక్కి నెట్టి అత్యధిక ఓట్లతో కోహ్లి విజేతగా నిలిచినట్లు తెలిపింది. పాక్ ఆల్‌రౌండర్ నిదా ఇక మహిళల విభాగంలో వెటరన్ ఆల్‌రౌండర్ నిదా దర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకుంది. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్-2022లో కోహ్లి హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్టోబరు నెల ముగిసే సరికి 205 పరుగులతో నిలిచాడు కోహ్లి. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లలో అద్భుత అర్ధ శతకాలతో మెరిశాడు. ఇక మహిళల ఆసియా కప్-2022 టోర్నీలో రాణించిన నిదా దర్ అక్టోబరు నెలలో 145 పరుగులు సాధించడం సహా ఎనిమిది వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు- అక్టోబరు 2022 విరాట్ కోహ్లి- ఇండియా నిదా దర్- పాకిస్తాన్ చదవండి: ఆసీస్‌కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు! కోహ్లి తర్వాత సూర్య మాత్రం కాదు! WC 2022: ఒక్క క్యాచ్‌తో తారుమారు: సౌతాఫ్రికాలో పుట్టి ఆ జట్టునే దెబ్బకొట్టిన ప్లేయర్లు.. జట్టులో తెలుగు కుర్రాడు కూడా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శ్రీలంకపై అద్భుత విజయం.. అమ్మాయిల సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా
మహిళల ఆసియాకప్-2022ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైన్లలో విజయం సాధించిన భారత్.. 7వ ఆసియాకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు.. రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. సెలబ్రేషన్స్ అదుర్స్ ఇక శ్రీలంకపై అద్భుతవిజయం అనంతరరం భారత జట్టు అమ్మాయిలు వినూత్న రీతిలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మైదానంలోనే పంజాబీ డ్యాన్స్‌లు, కేరింతలతో ఊర్రూతలూగించారు. కలర్ పేపర్స్‌ను ఒకరిపై ఒకరు చల్లుకుని భారత క్రికెటర్లు సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ఉమెన్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం భారత్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Post-win vibes, be like 🎉 🙌#TeamIndia | #AsiaCup2022 | #INDvSL pic.twitter.com/LsUG1PxNiO — BCCI Women (@BCCIWomen) October 15, 2022 చదవండి: Women's Asia Cup 2022: ఛాంపియన్ భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? -
చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది. మహిళల ఆసియాకప్-2022 ఫైనల్లో శ్రీలంకపై బరిలోకి దిగిన హర్మన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు హర్మన్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 137 మ్యాచ్‌లు ఆడింది. అంతకుముందు ఈ అరుదైన రికార్డు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. బేట్స్ ఇప్పటి వరకు 136 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడింది. తాజా మ్యాచ్‌తో బేట్స్ రికార్డును హర్మన్‌ప్రీత్ అధిగమించింది. కాగా హర్మన్‌ప్రీత్ 2009లో భారత్ తరపున టీ20 అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు 122 ఇన్నింగ్స్‌లో హర్మన్.. 2,683 పరుగులు చేసింది. ఆమె టీ20 కెరీర్లో ఇప్పటి వరకు సెంచరీతో పాటు 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక భారత మహిళా క్రికెటర్ కూడా హర్మన్ కావడమే గమనార్హం. ఆసియా కప్-2022 విజేత భారత్ ఇక మహిళల ఆసియా కప్-2022 ఛాంపియన్స్‌గా భారత్ నిలిచింది. షెల్లాట్ వేదికగా ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి.. 7వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ అవతరించింది. ఈ మ్యాచ్‌లో 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను పూర్తి చేసింది. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు.. రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: Women's Asia Cup 2022: ఛాంపియన్ భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? -
మహిళల ఆసియా కప్ విజేత భారత్ (ఫొటోలు)
-
ఛాంపియన్ భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం షెల్లాట్ జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి 7వ ఆసియాకప్ టైటిల్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక ఆసియాకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు ఫ్రైజ్‌మనీ ఎంత లభించింది?.. ఆసియాకప్ టాప్ రన్ స్కోరర్ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. విజేతకు ఎంతంటే? ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్‌కు ఫ్రైజ్‌మనీ రూపంలో ఇరవై వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 16లక్షల నాలభై ఎనిమిది వేల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను టోర్నీ నిర్వహకులు భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు అందజేశారు. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన శ్రీలంకకు 12,500 డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం సుమారు పది లక్షల ముఫ్పై వేలు)ఫ్రైజ్‌మనీ దక్కింది. ఆసియాకప్-2022లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే జెమిమా రోడ్రిగ్స్(భారత్)- 8 మ్యాచ్‌ల్లో 217 పరుగులు హర్షిత మాధవి(శ్రీలంక)- 8 మ్యాచ్‌ల్లో 202 పరుగులు షఫాలీ వర్మ(భారత్)- 6 మ్యాచ్‌ల్లో-166 పరుగులు సిద్రా అమీన్(పాకిస్తాన్)- 7 మ్యాచ్‌ల్లో 158 పరుగులు నిదా దార్(పాకిస్తాన్) - 7 మ్యాచ్‌ల్లో 145 పరుగులు ఆసియాకప్ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు దీప్తి శర్మ(భారత్)- 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు ఇనోక రణావీరా(శ్రీలంక)- 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు రుమనా ఆహ్మద్(బంగ్లాదేశ్)-5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు ఓమైమా సోహెల్(పాకిస్తాన్)-7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు ఇక ఈ మెగా ఈవెంట్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. దీప్తికి అవార్డు రూపంలో 2000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు లక్షా ఆరవై నాలుగు వేల రూపాయలు) లభించింది. చదవండి: T20 World Cup 2022:టీమిండియాతో మ్యాచ్.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు దూరం -
ఆసియా కప్ గెలిచిన భారత మహిళా జట్టుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: మహిళల ఆసియా కప్-2022 గెలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కాగా మహిళ ఆసియా కప్ విజేతగా భారత్ అవతరించిన విషయం తెలిసిందే. ఏడోసారి ఆసియా కప్ గెలిచిన జట్టుగా భారత్ రికార్డ్ సృష్టించింది. శనివారం జరిగిన కీలకమైన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. 66 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన భారత్ 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజేతగా నిలిచింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో(25 బంతుల్లో 51 పరుగులు) రాణించింది. నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చిన రేణుకా సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. -
ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్
మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచింది. షెల్లాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 7వ ఆసియాకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను పూర్తి చేసింది. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ రేణుకా సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 3⃣ Overs 1⃣ Maiden 5⃣ Runs 3⃣ Wickets Renuka Thakur put on a stunning show with the ball & bagged the Player of the Match award as #TeamIndia beat Sri Lanka in the #AsiaCup2022 Final. 👏 👏 #INDvSL Scorecard ▶️ https://t.co/r5q0NTVLQC pic.twitter.com/APPBolypjE — BCCI Women (@BCCIWomen) October 15, 2022 రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చదవండి: Rohit Sharma Press Meet: వరల్డ్‌కప్ కంటే అతడి కెరీర్ ముఖ్యం! మాకు ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరంటే.. -
చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 16 పరుగులకే ఐదు వికెట్లు
Womens Asia Cup T20 2022 - India Women vs Sri Lanka Women, Final: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన లంక వుమెన్స్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే తమ నిర్ణయం ఎంత తప్పిదమో లంకకు కాసేపటికే అర్థమయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచి లంక క్రికెటర్ల పతనం మొదలైంది. 10 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన లంక జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 6 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు తీయగా.. రెండు రనౌట్లు ఉండడం విశేషం. ఏడోసారి.. ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. అప్డేట్: భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: T20 WC 2022: రోహిత్ నాకంటే పెద్దవాడు! ఇంట్లో వాళ్లు బాగున్నారా? ఏ కారు కొంటున్నావు.. మేము మాట్లాడుకునేది ఇవే! Virat Kohli: ఈ ఏడాది 23 మందిలో 'కింగ్' కోహ్లి ఒక్కడే.. -
ఏడో టైటిల్ వేటలో భారత్
సిల్హెట్: ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. ఈ క్రమంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టుతో హర్మన్ సేన తలపడనుంది. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. ఇలాంటి నేపథ్యంలో నేడు తుది పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. సమష్టి ప్రదర్శనతో... లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడం మినహా ఓవరాల్‌గా టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అన్ని మ్యాచ్‌లు (7) ఆడిన ముగ్గురు ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ అత్యధిక పరుగులు (215) సాధించగా, దీప్తి శర్మ అత్యధిక వికెట్లు (13) తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. షఫాలీ వర్మ కూడా ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు సానుకూలాంశం. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన (4 ఇన్నింగ్స్‌లలో కలిపి 83 పరుగులు) మాత్రం ఆశించిన రీతిలో ఆడలేకపోయినా, ఫైనల్లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. దీప్తి శర్మతో పాటు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్‌ల స్పిన్ ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగలదు. దీప్తి సూపర్ ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. భారత్‌తో పోలిస్తే చమరి అటపట్టు కెప్టెన్సీలోని శ్రీలంక జట్టు బలహీనమనేది వాస్తవం. అయితే పాక్‌తో సెమీఫైనల్లో ఆ జట్టు చివరి బంతి వరకు కనబర్చిన స్ఫూర్తిదాయక ప్రదర్శన చూస్తే తేలిగ్గా ఓటమిని అంగీకరించే తరహా టీమ్ మాత్రం కాదని తెలుస్తోంది. తుది పోరులో ఆ జట్టు పోరాటం ఎంత వరకు సఫలం అవుతుందనేది చెప్పలేం. -
దురదృష్టం అంటే వీళ్లదే! థాయ్‌లాండ్‌కు మేలు చేసిన ‘వర్షం’! సెమీస్‌లో
Womens Asia Cup T20 2022 : మహిళల ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో బంగ్లాదేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. వరణుడు ఆటంకం కలిగించిన కారణంగా ఆ జట్టు సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. దీంతో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ రద్దు! ఇక బంగ్లా నిష్క్రమణతో థాయ్‌లాండ్ నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. సెల్హెట్ వేదికగా మంగళవారం(అక్టోబరు 11) బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం ఆటంకం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉండటంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెమీస్‌లో థాయ్‌లాండ్ దీంతో బంగ్లా, యూఏఈ జట్లకు భంగపాటు ఎదురైంది. చెరో పాయింట్ లభించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 5 పాయింట్లు మాత్రమే సాధించిన బంగ్లా గ్రూప్ దశలో ఐదో స్థానంలో నిలిచిపోయింది. మరోవైపు.. పాకిస్తాన్‌పై సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన థాయ్‌లాండ్ ఆరు పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధించింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంకతో పాటు టాప్-4లో స్థానం దక్కించుకుంది. కాగా అక్టోబరు 13న సెమీ ఫైనల్స్ జరుగనుండగా.. 15న మహిళల ఆసియా కప్-2022 ఫైనల్ జరుగనుంది. ఇక ఈసారి మ్యాచ్‌లన్నీ సెల్హెట్లోని సెల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగడం గమనార్హం. చదవండి: T20 World Cup 2022: నెదర్లాండ్ జట్టు సలహాదారుడిగా టీమిండియా మాజీ కోచ్ Sreehari Nataraj: 'మెడల్స్ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్ స్విమ్మర్‌కు అవమానం After a hard fought battle, India 🇮🇳, Pakistan 🇵🇰, Sri Lanka 🇱🇰 and Thailand 🇹🇭 qualify for the semi-finals of the #WomensAsiaCup2022 🏆! We have some exciting games lined up ahead! Who are you rooting for? 👇#AsianCricketCouncil #ACC pic.twitter.com/QWUUd4z8l9 — AsianCricketCouncil (@ACCMedia1) October 11, 2022 -
మరో విజయమే లక్ష్యంగా... థాయ్‌లాండ్‌తో భారత్ ఢీ
మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు నేడు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ జట్టుతో ఆడనుంది. బంగ్లాదేశ్ వేదికగా ఏడు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించి, ఒక మ్యాచ్‌లో ఓడింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తుది జట్లు(అంచనా) భారత్: స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కిరణ్ నవ్‌గిరే, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, రేణుకా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్ థాయ్‌లాండ్: నన్నపట్ కొంచరోయెంకై (వికెట్ కీపర్), నత్తకన్ చంతమ్, నరుఎమోల్ చైవై (కెప్టెన్), సోర్నరిన్ టిప్పోచ్, చనిద సుత్తిరువాంగ్, రోసెనన్ కానో, ఫన్నిత మాయ, నట్టయ బూచతం, ఒన్నిచ కమ్‌చోంఫు, బంతిద లీఫత్తానా, తిపట్చా పుట్టావొంగ్ చదవండి: సెంచరీతో చెలరేగిన శ్రేయస్.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం -
షఫాలీ ఆల్ రౌండ్ షో.. బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
మహిళల ఆసియాకప్-2022లో భారత్ నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సెల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నిగార్ సుల్తానా 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ, షఫాలీ వర్మ చెరో రెండు వికెట్లు, రేణుకా సింగ్, రాణా తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు షఫాలీ వర్మ(55), స్మృతి మంధాన(47) చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో రుమనా ఆహ్మద్ మూడు వికెట్లు సాధించగా.. సల్మా ఖాటన్ ఒక్క వికెట్ పడగొట్టింది. కాగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 4 విజయాలతో భారత్ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్10న థాయ్‌లాండ్‌తో తలపడనుంది. చదవండి: Women's Asia Cup 2022:33 పరుగులకే ఆలౌట్.. మలేషియాపై శ్రీలంక ఘన విజయం -
33 పరుగులకే ఆలౌట్.. మలేషియాపై శ్రీలంక ఘన విజయం
మహిళల ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంక వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. లంక బ్యాటర్లలో రణసింగే(23), ఆతపత్తు(21) పరుగులతో రాణించారు. మలేషియా బౌలర్లలో ఆజ్మీ, హమీజ్ హాసం రెండు వికెట్లు సాధించారు. ఇక 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక స్పిన్నర్లు చెలరేగడంతో మలేషియా కేవలం 33 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో మల్షా షెహానీ నాలుగు వికెట్లతో మలేషియాను దెబ్బతీయగా.. కుమారి, రణవీరా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక మలేషియా బ్యాటర్లలో హంటర్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. చదవండి: John Campbell: వెస్టిండీస్ క్రికెటర్‌పై నాలుగేళ్ల నిషేధం.. -
Ind Vs Pak: దాయాది చేతిలో భారత్‌కు తప్పని భంగపాటు.. అప్పుడు అలా! ఇప్పుడిలా!
Womens Asia Cup T20 2022- India Vs Pakistan: మహిళల ఆసియా కప్- 2022 టీ20 టోర్నీలో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రీతిలో సాగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేనకు భంగపాటు తప్పలేదు. 13 పరుగుల తేడాతో గెలుపొందిన పాక్ మహిళా జట్టు.. సుదీర్ఘకాలం తర్వాత పొట్టి ఫార్మాట్లో భారత్‌పై తొలి విజయం నమోదు చేసింది. ఆదుకున్న నిదా బంగ్లాదేశ్‌లోని సెల్హెట్ వేదికగా శుక్రవారం భారత్- పాకిస్తాన్ మహిళా జట్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్లు దీప్తి శర్మ మూడు వికెట్లు, పూజా వస్త్రాకర్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ 32 పరుగులతో రాణించగా.. ఆల్‌రౌండర్ నిదా దర్ 56 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో దీప్తికి మూడు, పూజాకు రెండు, రేణుకకు ఒక వికెట్ దక్కాయి. ఒకరిద్దరు మినహా భారత ఓపెనర్లు సబ్బినేని మేఘన 15, స్మృతి మంధాన 17 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించారు. మూడో స్థానంలో వచ్చిన జెమీమా(2) పూర్తిగా నిరాశపరచగా.. హేమలత 20 పరుగులతో రాణించింది. మిగతా వాళ్లలో దీప్తి 16, హర్మన్‌ప్రీత్ కౌర్ 12, రిచా ఘోష్ 26 పరుగులు(13 బంతుల్లో) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు. దీంతో 19.4 ఓవర్లలో 124 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయింది. పాక్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాట్‌తోనూ, బంతితోనూ రాణించిన నిదా దర్(37 బంతుల్లో 56 పరుగులు, రెండు వికెట్లు)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా కాగా టీ20 ఫార్మాట్లో ఇరుజట్లు 13 సార్లు తలపడగా భారత మహిళా జట్టుపై పాక్ టీమ్‌కు ఇది మూడో విజయం. 2016 తర్వాత ఇదే తొలి గెలుపు. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో హర్మన్‌ప్రీత్ బృందం మూడింట గెలిచింది. మరోవైపు పాక్‌కు ఇది రెండో విజయం. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్-2022 ఈవెంట్లో లీగ్ దశలో పాక్‌పై గెలుపొందిన రోహిత్ సేన.. కీలకమైన సూపర్-4 దశలో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. ఫైనల్ చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ డిఫెండింగ్ చాంపియన్. చదవండి: T20 WC 2022: ప్రపంచకప్ టోర్నీ.. ప్రాక్టీసు మొదలుపెట్టిన టీమిండియా IND vs SA: 'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్' -
Womens Asia Cup 2022: చిరకాల ప్రత్యర్ధి పాక్‌తో భారత్ పోరు..
మహిళల ఆసియాకప్-2022లో దాయాదుల పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. షెల్లాట్ వేదికగా శుక్రవారం పాక్-భారత్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ మధ్యహ్నాం 1:00 గంటకు ప్రారంభం కానుంది. కాగా ఈ మెగా టోర్నీలో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడ మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా హర్మాన్ సేన పటిష్టంగా ఉంది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ భీకర ఫామ్‌లో ఉంది. అదే విధంగా స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడాతమ స్థాయికి తగ్గట్టు రాణిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో దీప్తి శర్మ, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్ అద్భుతమైన బౌలింగ్‌తో పత్యర్ధి బ్యాటర్లకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్ పరంగా భారత్‌ను పాక్ ఎంత వరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి. ప్రత్యర్ధి జట్టు విషయంకు వస్తే.. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో పసికూన థాయ్‌లాండ్ చేతిలో ఓటమిని చవిచూసింది. భారత్ విజయాల జోరుతో బరిలోకి దిగుతుండగా.. పాక్ మాత్రం ఓటమి బాధతో బరిలోకి దిగనుంది. ఇక బౌలింగ్ పరంగా పాకిస్తాన్ పర్వాలేదనిపిస్తున్నప్పటికి.. బ్యాటింగ్‌లో మాత్రం ఓపెనర్ సిద్రా అమీన్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించడం లేదు. తుది జట్లు(అంచనా) భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దయాళన్ హేమలత, దీప్తి శర్మ, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్/, రేణుకా సింగ్ పాకిస్తాన్: మునీబా అలీ (వికెట్ కీపర్), సిద్రా అమీన్, బిస్మాహ్ మరూఫ్ (కెప్టెన్), ఒమైమా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, అయేషా నసీమ్, కైనత్ ఇంతియాజ్, డయానా బేగ్, తుబా హసన్, నష్రా సంధు -
భారత అమ్మాయిల ‘హ్యాట్రిక్’
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 75 నాటౌట్; 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. దీంతో భారత అమ్మాయిల జట్టు 104 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ టోర్నీలో మహిళల జట్టుకిది వరుసగా మూడో విజయం. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (10), రిచా ఘోష్ (0), దయాళన్ హేమలత (2) నిరాశపరచడంతో భారత్ 20 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దీప్తి, ఐదో వరుస బ్యాటర్ జెమీమా ధాటిగా ఆడారు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. తదుపరి మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు 7న పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
అదరగొట్టిన ఆంధ్ర అమ్మాయి.. మలేషియాపై భారత్ ఘన విజయం
మహిళల ఆసియాకప్-2022లో భారత్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. షెల్లాట్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 30 పరుగుల తేడాతో విజయం సాధించిది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆంధ్ర అమ్మాయి సబ్భినేని మేఘన అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న మేఘన.. 11 ఫోర్లు, సిక్స్‌తో 69 పరుగులు చేసింది. అదే విధంగా మరో ఓపెనర్ షఫాలీ వర్మ(39 బంతుల్లో 46 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. కాగా 182 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా 5.2 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఈ సమయంలో వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. అయితే ఎప్పటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు. భారత్ తమ తదపరి మ్యాచ్‌లో ఆక్టోబర్4న యూఏఈతో తలపడనుంది. చదవండి: రోహిత్, కోహ్లి, సూర్య కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే! -
మలేషియాను చిత్తు చేసిన పాక్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం
ఆసియాకప్-2022ను పాకిస్తాన్ మహిళల జట్టు విజయంతో ప్రారంభించింది. షెల్లాట్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మలేషియా.. పాకిస్తాన్ స్పిన్నర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 57 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో ఒమైమా సోహైల్ మూడు వికెట్లు పడగొట్టగా.. టుబా హసన్ రెండు, ఇక్భాల్ తలా వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంటర్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేధించింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్లు (సదీరా అమీన్ 31), మునీబా అలీ(21) పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 3న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. చదవండి: Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి! వీరికి వెనుక ఉన్నది ఎవరంటే! -
Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి!
అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని అంటుంటారు. నలుగురికీ భిన్నంగా ఎంచుకున్న రంగంలో అనుకున్న లక్ష్యాలు చేరాలంటే కచ్చితంగా కుటుంబం.. ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ ప్రోత్సాహం ఉంటేనే సాధ్యమవుతుంది. భార్యైనా.. భర్తైనా పరస్పరం సహకరించుకుంటేనే ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం బాగుంటుంది. పాకిస్తాన్‌కు చెందిన తల్లీకూతుళ్లు సలీమా ఇంతియాజ్, కైనత్ ఇంతియాజ్‌కు ఇలాంటి భాగస్వాములే దొరికారు. భర్త ఖవాజా ఇంతియాజ్ ప్రోత్సాహంతో సలీమా అంపైర్‌గా ఎదగగా.. క్రికెటర్ కావాలన్న తమ కూతురు కైనత్ తన కలను నిజం చేసుకోవడంతో సహాయపడ్డారు ఈ దంపతులు. ఇక తండ్రిలాగే భర్త వకార్ సైతం తనకు అండగా నిలుస్తూ ఉండటంతో కైనత్ పాకిస్తాన్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. విశేషమేమిటంటే.. ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇప్పుడు ఆసియా కప్-2022 వంటి మెగా టోర్నీలో తమ వంతు బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. 41 ఏళ్ల వయసులో కల సాకారం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా భారత్- శ్రీలంక మ్యాచ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేసింది సలీమా. మరోవైపు సలీమా కూతురు కైనత్ పాకిస్తాన్ మహిళా జట్టులో సభ్యురాలిగా ఉంది. ఇలా ఇద్దరూ ఒకేసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడంతో ఇంతియాజ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. భర్తతో కైనత్(PC: Kainat Imtiaz Instagram) నాకు గర్వకారణం.. కైనత్ భావోద్వేగం ముఖ్యంగా 41 ఏళ్ల వయసులో తన తల్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తుచేసుకుంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది.ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ‘‘ఏసీసీ ఆసియా కప్ -2022లో అంపైర్‌గా మా మామ్! మా అమ్మ సాధించిన విజయం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాలన్న ఆమె కల, ఆమెతో పాటు నా కల కూడా నేడు నెరవేరింది. మేమిద్దరం మా దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఆ భగవంతుడి దయ. మా అమ్మ ఈ స్థాయికి చేరుకోవడంలో అడుగడుగునా అండగా నిలబడ్డ మా నాన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మమ్మల్ని ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నిరాశతో మేము వెనుదిరగకుండా నిరంతరం స్ఫూర్తి నింపుతూనే ఉంటారు. మా లోపాలు సరిదిద్దే క్రమంలో తనే మొదటి క్రిటిక్. వీళ్లందరూ మా జీవితాల్లో ఉండటం వల్లే ఆయన నా తండ్రి కావడం నిజంగా నా అదృష్టం. ఈ ప్రపంచంలో అందరికంటే నేనే అదృష్టవంతురాలిని అనిపిస్తోంది. అలాగే నా సోదరుడు.. మా నాన్నలానే నన్ను ప్రోత్సహించే భర్త.. వీళ్లందరూ నా జీవితంలో ఉండటం.. నా అదృష్టం’’ అంటూ కైనత్ ఉద్వేగానికి లోనైంది. ఆమె పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. సలీమా, కైనత్‌లకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అదే విధంగా పాకిస్తాన్ వంటి దేశంలో కట్టుబాట్లను దాటుకుని వారు ఎదిగేలా ప్రోత్సహించిన కైనత్ తండ్రిని ప్రశంసిస్తున్నారు. కాగా కైనత్ తండ్రి ఖవాజా స్పో టీచర్‌గా పనిచేశాడు. ఇక పాక్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన కైనత్.. భారత మహిళా పేసర్ ఝులన్ గోస్వామి తనకు స్ఫూర్తి అంటూ 2017 వరల్డ్‌కప్ సందర్భంగా తన మనసులోని మాట వెల్లడించింది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆడిన పాకిస్తాన్ జట్టులో చోటుదక్కించుకున్న కైనత్.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీకి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించుకుంది. చదవండి: RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్.. వరుసగా రెండోసారి National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. View this post on Instagram A post shared by Kainat Waqar (@kainatimtiaz23)