మహిళల ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంక వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది.
లంక బ్యాటర్లలో రణసింగే(23), ఆతపత్తు(21) పరుగులతో రాణించారు. మలేషియా బౌలర్లలో ఆజ్మీ, హమీజ్ హాసం రెండు వికెట్లు సాధించారు. ఇక 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక స్పిన్నర్లు చెలరేగడంతో మలేషియా కేవలం 33 పరుగులకే కుప్పకూలింది.
శ్రీలంక బౌలర్లలో మల్షా షెహానీ నాలుగు వికెట్లతో మలేషియాను దెబ్బతీయగా.. కుమారి, రణవీరా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక మలేషియా బ్యాటర్లలో హంటర్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
చదవండి: John Campbell: వెస్టిండీస్ క్రికెటర్‌పై నాలుగేళ్ల నిషేధం..
Comments
Please login to add a commentAdd a comment