ఆసియాకప్-2022ను పాకిస్తాన్ మహిళల జట్టు విజయంతో ప్రారంభించింది. షెల్లాట్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మలేషియా.. పాకిస్తాన్ స్పిన్నర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 57 పరుగులకే పరిమితమైంది.
పాక్ బౌలర్లలో ఒమైమా సోహైల్ మూడు వికెట్లు పడగొట్టగా.. టుబా హసన్ రెండు, ఇక్భాల్ తలా వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంటర్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 9 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేధించింది.
పాక్ బ్యాటర్లలో ఓపెనర్లు (సదీరా అమీన్ 31), మునీబా అలీ(21) పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 3న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
చదవండి: Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి! వీరికి వెనుక ఉన్నది ఎవరంటే!
Comments
Please login to add a commentAdd a comment