మహిళల ఆసియాకప్-2022లో దాయాదుల పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. షెల్లాట్ వేదికగా శుక్రవారం పాక్-భారత్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ మధ్యహ్నాం 1:00 గంటకు ప్రారంభం కానుంది. కాగా ఈ మెగా టోర్నీలో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడ మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా హర్మాన్ సేన పటిష్టంగా ఉంది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్ భీకర ఫామ్‌లో ఉంది. అదే విధంగా స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడాతమ స్థాయికి తగ్గట్టు రాణిస్తున్నారు.
ఇక బౌలింగ్‌లో దీప్తి శర్మ, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్ అద్భుతమైన బౌలింగ్‌తో పత్యర్ధి బ్యాటర్లకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్ పరంగా భారత్‌ను పాక్ ఎంత వరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి.
ప్రత్యర్ధి జట్టు విషయంకు వస్తే.. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో పసికూన థాయ్‌లాండ్ చేతిలో ఓటమిని చవిచూసింది. భారత్ విజయాల జోరుతో బరిలోకి దిగుతుండగా.. పాక్ మాత్రం ఓటమి బాధతో బరిలోకి దిగనుంది. ఇక బౌలింగ్ పరంగా పాకిస్తాన్ పర్వాలేదనిపిస్తున్నప్పటికి.. బ్యాటింగ్‌లో మాత్రం ఓపెనర్ సిద్రా అమీన్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించడం లేదు.
తుది జట్లు(అంచనా)
భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దయాళన్ హేమలత, దీప్తి శర్మ, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్/, రేణుకా సింగ్
పాకిస్తాన్: మునీబా అలీ (వికెట్ కీపర్), సిద్రా అమీన్, బిస్మాహ్ మరూఫ్ (కెప్టెన్), ఒమైమా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, అయేషా నసీమ్, కైనత్ ఇంతియాజ్, డయానా బేగ్, తుబా హసన్, నష్రా సంధు
Comments
Please login to add a commentAdd a comment