ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల ‘ఎ’ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. టి20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లూ ఓడిన మన అమ్మాయిల జట్టు.. వన్డేల్లోనూ వరుసగా రెండో మ్యాచ్ ఓడి సిరీస్ కోల్పోయింది.
శుక్రవారం మెకాయ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల ‘ఎ’ జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రాఘవి ఆనంద్ సింగ్(70), తేజల్ హసబ్నిస్(63) టాప్ స్కోరర్లగా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా నిరాశపరిచారు.
ఆసీస్ బౌలర్లలో మాట్ బ్రౌన్, నికోలా హాన్కాక్, నాట్ తలా రెండు వికెట్లు సాధించగా.. తైలా, పర్సన్స్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 219 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 40.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. ఆసీస్ ఓపెనర్ డార్క్(105) ఆజేయ శతకంతో చెలరేగింది.
చదవండి: LPL 2024: శ్రీలంక స్టార్ క్రికెటర్‌పై వేటు..
Comments
Please login to add a commentAdd a comment