తొలి వన్డే.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి | IND Vs AUS: Australia A Women Won By 7 Wickets | Sakshi
Sakshi News home page

తొలి వన్డే.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి

Published Wed, Aug 14 2024 12:23 PM | Last Updated on Wed, Aug 14 2024 12:27 PM

IND Vs AUS: Australia A Women Won By 7 Wickets

ఆస్ట్రేలియా-ఎ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల-ఎ జట్టు ఓటమితో ఆరంభిచింది. హర్రప్ పార్క్, మాకే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు.. 47 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. 

ఆసీస్‌ ఓపెనర్‌ క్యాటీ మాక్‌ అద్భుతసెంచరీతో చెలరేగింది. 126 బంతులు ఎదుర్కొన్న మాక్‌.. 11 ఫోర్లతో 129 పరుగులు చేసింది. ఆమెతో పాటు కెప్టెన్‌ మెక్‌గ్రాత్‌(56) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో మేఘన సింగ్‌, మణి మిన్ను తలా రెండు వికెట్లు సాధించారు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రాఘవి ఆనంద్‌ సింగ్‌(82) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఆసీస్‌ పేసర్‌ మాటిలన్‌ బ్రౌన్‌ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బతీసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 16న జరగనుంది. కాగా ఇప్పటికే భారత్‌తో టీ20 సిరీస్‌ను ఆసీస్‌-ఎ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement