AUstralia womens team
-
తొలి వన్డే.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ఆస్ట్రేలియా-ఎ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల-ఎ జట్టు ఓటమితో ఆరంభిచింది. హర్రప్ పార్క్, మాకే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు.. 47 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ ఓపెనర్ క్యాటీ మాక్ అద్భుతసెంచరీతో చెలరేగింది. 126 బంతులు ఎదుర్కొన్న మాక్.. 11 ఫోర్లతో 129 పరుగులు చేసింది. ఆమెతో పాటు కెప్టెన్ మెక్‌గ్రాత్(56) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో మేఘన సింగ్, మణి మిన్ను తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రాఘవి ఆనంద్ సింగ్(82) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆసీస్ పేసర్ మాటిలన్ బ్రౌన్ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బతీసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 16న జరగనుంది. కాగా ఇప్పటికే భారత్‌తో టీ20 సిరీస్‌ను ఆసీస్-ఎ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. -
ఆసీస్ క్రికెటర్ అద్భుత ప్రదర్శన.. బంతితో రాణించి, బ్యాట్‌తో డబుల్ సెంచరీ
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బంతితో రాణించిన (3/19) అన్నాబెల్.. ఆతర్వాత బ్యాట్‌తో విశ్వరూపం ప్రదర్శించింది. ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 248 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి ఔరా అనిపించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 256 బంతులు ఎదుర్కొన్న అన్నాబెల్ 210 పరుగులు చేసి ఔటైంది. ఆన్నాబెల్.. టెయిలెండర్లు ఆష్లే గార్డ్నర్ (65), కిమ్ గార్త్ (49 నాటౌట్), సోఫీ మోలినెక్స్ (33) సహకారంతో డబుల్ సెంచరీ పూర్తి చేసింది. అంతకుముందు కెప్టెన్ అలైసా హీలీ (99), బెత్ మూనీ (78) కూడా రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 575 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లాస్, టైరాన్ తలో 3 వికెట్లు, డి క్లెర్క్ 2, టక్కర్ ఓ వికెట్ పడగొట్టారు. దీనికి ముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే ఆలౌటైంది. డార్సీ బ్రౌన్ (5/25), అన్నాబెల్ (3/19), తహిళ మెక్‌గ్రాత్ (2/4) సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో సూన్ లస్ (26), పదో నంబర్ ప్లేయర్ క్లాస్ ఝ(10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇది రెండో రోజు మాత్రమే. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం ఆసీస్ 499 పరుగుల ఆధిక్యంలో ఉంది. సౌతాఫ్రికా మహిళా జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్. -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచారు. కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్‌లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్‌లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్‌లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్‌ప్రీత్ కూడా బ్యాటింగ్‌లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్‌తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్‌ఫీల్డ్, తాలియా మెక్‌గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సాధ్యమే. -
ఓడినా మనసులు గెలుచుకుంది.. హీలీ క్రీడా స్పూర్తి! వీడియో వైరల్
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టుపై భారత మహిళా జట్టుకు మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 406 చేసింది. దీంతో భారత్ 187 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. భారత్ ముందు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ మాత్రం తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకుంది. ఏమి జరిగిందంటే? ఈ చారిత్రత్మక విజయం అనంతరం ట్రోఫీని అందుకున్న భారత జట్టు ఛాంపియన్స్ హోర్డింగ్ వెనక ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో అలిస్సా హీలీ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తింది. భారత జట్టు విన్నింగ్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓడిపోయినప్పటికీ అలిస్సా హీలీ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అయిపోయారు. హీలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 World Cup 2024: ఇంగ్లండ్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కీరన్ పొలార్డ్.. Alyssa Healy 🫶 🎥: Jio Cinema@ahealy77 | @AusWomenCricket | #INDvAUS | #CricketTwitter pic.twitter.com/QVQpaagsGl — Women's CricInsight (@WCI_Official) December 24, 2023 -
ఆస్ట్రేలియా కెప్టెన్ అనూహ్య నిర్ణయం.. గౌరవించిన సీఏ
ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోనుంది. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మెగ్ లానింగ్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపింది. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా తరపున బిజీ క్రికెట్ ఆడాను. కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు మానసికంగా అలసిపోయిన నాకు విశ్రాంతి కావాలనిపిస్తుంది. అందుకే ఈ లాంగ్ బ్రేక్. త్వరలో మళ్లీ జట్టులోకి వస్తా అంటూ 30 ఏళ్ల లానింగ్ పేర్కొంది. ''వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్న మెగ్ లానింగ్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం.. మా క్రికెట్లో బ్రేక్ అనే పదానికి మెగ్ లానింగ్ అర్హురాలు'' అంటూ ట్విటర్లో పేర్కొంటూ ఆమెకు మద్దతిచ్చింది. ఇటీవలే నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆసీస్ మహిళల జట్టు స్వర్ణం పతకం ఎగురేసుకుపోయిన సంగతి తెలిసింది. టీమిండియా మహిళలతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా వుమెన్స్ విజయం సాధించిన స్వర్ణం కొల్లగొట్టగా.. భారత్ రజతం కైసవం చేసుకుంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో మెగ్ లానింగ్ తనదైన ముద్ర వేసింది. లానింగ్ ఖాతాలో రెండు మహిళల వన్డే ప్రపంచకప్‌లతో పాటు.. నాలుగు టి20 ప్రపంచకప్‌లు ఉండడం విశేషం. ఇందులో మూడు టి20 ప్రపంచకప్‌లు(2014, 2018, 2020)లానింగ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా గెలవడం విశేషం. మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డులు.. ►వన్డేల్లో అత్యధిక సెంచరీలు మెగ్ లానింగ్ పేరిటే ఉన్నాయి. వన్డేల్లో లానింగ్ 15 సెంచరీలు సాధించింది. ►టి20ల్లో ఆస్ట్రేలియా మహిళల తరపున 2వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా రికార్డు. ►మిథాలీ రాజ్(భారత్), చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్) తర్వాత 150 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మూడో క్రీడాకారిణిగా రికార్డు ►ఓవరాల్‌గా మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా మహిళల జట్టు తరపున 6 టెస్టుల్లో 93 పరుగులు, 100 వన్డేల్లో 4463 పరుగులు, 115 టి20ల్లో 3007 పరుగులు సాధించింది. If anyone deserves a break, it's Meg Lanning. pic.twitter.com/BC8fKTwSDw — Cricket Australia (@CricketAus) August 10, 2022 చదవండి: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్.. మళ్లీ నెంబర్ 1 స్థానానికి! -
తొలి వన్డేలో టీమిండియా చిత్తు.. ఆసీస్ రికార్డు విజయం
మెక్కే: 3 వన్డేల సిరీస్‌లో భాగంగా హారప్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేయగా.. ఆసీస్ మహిళా జట్టు మరో 9 ఓవర్లు మిగిలుండగా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఓపెనింగ్ బ్యాటర్ రేచల్ హేన్స్ 93 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చగా.. మరో ఓపెనర్ అలైసా హీలీ (77 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (69 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 107 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేయగా.. యస్తికా భాటియా (51 బంతుల్లో 35; 2 ఫోర్లు), వికెట్ కీపర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), గోస్వామి (24 బంతుల్లో 20; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్(4/33), మోలినెక్స్(2/ 39), డిర్లింగ్టన్(2/29) మిథాలీ సేనను దారుణంగా దెబ్బకొట్టారు. 4 వికెట్లతో చెలరేగిన డార్సీ బ్రౌన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 24న) జరుగనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు నమోదయ్యాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా వరుసగా 25వ విజయం సాధించి విజయాల పరంపరను కొనసాగించింది. మరోవైపు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్లో 20 వేల పరుగులు పూర్తిచేసుకుంది. ఈ మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన మిథాలీకి వన్డేల్లో ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు ఇన్నింగ్స్‌ల్లో ఆమె 75 నాటౌట్, 59, 72, 79 పరుగులు చేసింది. చదవండి: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు.. -
భారత మహిళల ‘ఎ’ జట్టుకు రెండో ఓటమి
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): భారత మహిళల ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టి20లో ఆ్రస్టేలియా 37 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. సారథి తహిలా మెక్‌గ్రాత్ (40 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్), బ్రిడ్జెట్ ప్యాటర్సన్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు) ఆకట్టుకోగా... చివర్లో స్యామి జో జాన్సన్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి (2/22) రాణించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి ఓడిపోయింది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ (1) విఫలమైంది. వేద కృష్ణమూర్తి (35 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. చివర్లో అరుంధతి రెడ్డి (14 బంతుల్లో 19; 1 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత్ స్కోరు 100 పరుగులు దాటగలిగింది. తొలి టి20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడగా... నామమాత్రపు మూడో టి20 ఈనెల 23వ తేది జరుగుతుంది. -
ముక్కోణపు టి20 టోర్నీ విజేత ఆస్ట్రేలియా
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు ముక్కోణపు టి20 టోర్నమెంట్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (45 బంతుల్లో 88 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్), విలానీ (51; 8 ఫోర్లు) చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. అనంతరం బరిలో దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది. స్కీవర్ (50; 5 ఫోర్లు) రాణించింది. ప్రత్యర్థి బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ షుట్ 3 వికెట్లు పడగొట్టింది. లానింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రోల్టన్
ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ సారథి కరెన్ రోల్టన్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టు సందర్భంగా ఆమెకు ఈ పురస్కారం అందజేశారు. తొలి రోజు ఆటలో డిన్నర్ బ్రేక్ సమయంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ ఆమెకు ప్రత్యేక క్యాప్‌ను అందజేశారు. ఐసీసీ విశిష్ట క్రికెటర్ల జాబితాలో ఓవరాల్‌గా ఆమె 81వ ప్లేయర్‌కాగా... ఆరో మహిళా క్రికెటర్. -
ఆసీస్ మహిళల గెలుపు
సిలెట్: మెగ్ లానింగ్ (65 బంతుల్లో 126; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) టి20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 78 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. లానింగ్ వీరవిహారం చేయడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 59 పరుగులతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. బేట్స్ (61 బంతుల్లో 94 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో కివీస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరుగులు చేయగా, పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 108 పరుగులే చేయగలిగింది.