ఆసీస్ మహిళల గెలుపు | womens T20 : Australia beat ireland by 78 runs | Sakshi
Sakshi News home page

ఆసీస్ మహిళల గెలుపు

Published Fri, Mar 28 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

womens T20 : Australia beat ireland by 78 runs

సిలెట్: మెగ్ లానింగ్ (65 బంతుల్లో 126; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) టి20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత  స్కోరు నమోదు చేయడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 78 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. లానింగ్ వీరవిహారం చేయడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది.
 
 అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 59 పరుగులతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. బేట్స్ (61 బంతుల్లో 94 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో కివీస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరుగులు చేయగా, పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 108 పరుగులే చేయగలిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement