
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు ముక్కోణపు టి20 టోర్నమెంట్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (45 బంతుల్లో 88 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్), విలానీ (51; 8 ఫోర్లు) చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు.
అనంతరం బరిలో దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది. స్కీవర్ (50; 5 ఫోర్లు) రాణించింది. ప్రత్యర్థి బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ షుట్ 3 వికెట్లు పడగొట్టింది. లానింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment