మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో తొలిసారి న్యూజిలాండ్ మహిళల టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాపై 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.
స్కోర్లు: న్యూజిలాండ్ 158/5, సౌతాఫ్రికాపై 126/9
మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. దుబాయ్ వేదికగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్ బ్యాటర్లలో ఓపెనర్ సుజీ బేట్ 31 బంతుల్లో 32 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లిమెర్(9) మాత్రం నిరాశపరిచింది.
ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్‌డౌన్ బ్యాటర్ అమేలియా కెర్ 38 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 43 రన్స్ సాధించింది. ఆమెకు తోడుగా బ్రూక్ హాలీడే(28 బంతుల్లో 38) రాణించింది. వీరిద్దరి కారణంగా న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. మిగతా వాళ్లలో కెప్టెన్ సోఫీ డివైన్(6) విఫలం కాగా.. మ్యాడీ గ్రీన్ 12, వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు.
సౌతాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖాకా, క్లోయీ ట్రియాన్, నాడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ తీయగా.. నోన్కులులేకో మ్లాబా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది.
ఎవరు గెలిచినా చరిత్రే!
కాగా 14 ఏళ్ల తర్వాత తొలిసారి న్యూజిలాండ్ మహిళా జట్టు వరల్డ్‌కప్ ఫైనల్ చేరగా.. సౌతాఫ్రికా వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదిస్తే తమ దేశం ఖాతాలో మొట్టమొదటి ఐసీసీ వరల్డ్‌కప్‌ను జమచేస్తుంది. లేదంటే.. న్యూజిలాండ్‌కు తొలి ప్రపంచకప్ దక్కుతుంది.
మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా
తుదిజట్లు
న్యూజిలాండ్
సుజీ బేట్స్, జార్జియా ప్లిమెర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గాజ్(వికెట్ కీపర్), రోజ్మేరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్
సౌతాఫ్రికా
లారా వోల్వార్డ్ (కెప్టెన్), టాజ్మిన్ బ్రిట్స్, అన్నేక్ బాష్, క్లోయి ట్రియాన్, మారిజానే కాప్, సునే లుస్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), నోన్కులులేకో మ్లాబా, అయబోంగా ఖాకా.
చదవండి: IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే!
Comments
Please login to add a commentAdd a comment