Suzie Bates
-
SA vs NZ W T20: వరల్డ్‌కప్ విజేత న్యూజిలాండ్
మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో తొలిసారి న్యూజిలాండ్ మహిళల టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాపై 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. స్కోర్లు: న్యూజిలాండ్ 158/5, సౌతాఫ్రికాపై 126/9మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. దుబాయ్ వేదికగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్ బ్యాటర్లలో ఓపెనర్ సుజీ బేట్ 31 బంతుల్లో 32 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లిమెర్(9) మాత్రం నిరాశపరిచింది.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్‌డౌన్ బ్యాటర్ అమేలియా కెర్ 38 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 43 రన్స్ సాధించింది. ఆమెకు తోడుగా బ్రూక్ హాలీడే(28 బంతుల్లో 38) రాణించింది. వీరిద్దరి కారణంగా న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. మిగతా వాళ్లలో కెప్టెన్ సోఫీ డివైన్(6) విఫలం కాగా.. మ్యాడీ గ్రీన్ 12, వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు.సౌతాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖాకా, క్లోయీ ట్రియాన్, నాడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ తీయగా.. నోన్కులులేకో మ్లాబా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎవరు గెలిచినా చరిత్రే!కాగా 14 ఏళ్ల తర్వాత తొలిసారి న్యూజిలాండ్ మహిళా జట్టు వరల్డ్‌కప్ ఫైనల్ చేరగా.. సౌతాఫ్రికా వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదిస్తే తమ దేశం ఖాతాలో మొట్టమొదటి ఐసీసీ వరల్డ్‌కప్‌ను జమచేస్తుంది. లేదంటే.. న్యూజిలాండ్‌కు తొలి ప్రపంచకప్ దక్కుతుంది.మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికాతుదిజట్లున్యూజిలాండ్సుజీ బేట్స్, జార్జియా ప్లిమెర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గాజ్(వికెట్ కీపర్), రోజ్మేరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ (కెప్టెన్), టాజ్మిన్ బ్రిట్స్, అన్నేక్ బాష్, క్లోయి ట్రియాన్, మారిజానే కాప్, సునే లుస్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), నోన్కులులేకో మ్లాబా, అయబోంగా ఖాకా.చదవండి: IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే! -
సత్తా చాటిన హీథర్ నైట్.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 19) జరిగిన తొలి మ్యాచ్‌లో స్థానిక మహిళా టీమ్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సత్తా చాటిన హీథర్ నైట్.. హీథర్ నైట్ మెరుపు అర్దశతకంతో (39 బంతుల్లో 63; 8 ఫోర్లు,సిక్స్) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. నైట్‌కు జతగా మైయా బౌచియర్ (43 నాటౌట్), డంక్లీ (32) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్, ఫ్రాన్ జోనాస్, లియా తుహుహు తలో వికెట్ పడగొట్టారు. తడబడిన న్యూజిలాండ్.. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వేగంగా పరుగులు సాధించలేక లక్ష్యానికి 28 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుజీ బేట్స్ (65) అర్దశతకంతో రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన వారు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. బ్రూక్ హల్లీడే 27 నాటౌట్, జార్జియా ప్లిమ్మర్ 21 పరుగులు చేయగా.. మ్యాడీ గ్రీన్ 8, జెస్ కెర్ 8 నాటౌట్, ఇసబెల్లా గేజ్, మికేలా గ్రేగ్ డకౌట్లయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు పడగొట్టగా.. సారా గ్లెన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 మార్చి 22న జరుగనుంది. -
విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన కివీస్ క్రికెటర్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా..
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సుజీ బేట్స్ చరిత్ర సృష్టించింది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కివీస్ మహిళా జట్టు.. ప్రొటిస్ మహిళా జట్టుతో ఆదివారం ఐదో టీ20లో తలపడింది. ఇందులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ కేట్ ఆండర్సన్ 11 పరుగులకే పెవిలియన్ చేరినప్పటికీ మరో ఓపెనర్ సుజీ బేట్స్(45)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ అమీలియా కెర్(61) జోరును కొనసాగించింది. కానీ సుజీ అవుటైన తర్వాత అమీలియాకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ మొత్తం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో అమీలియా ఆఖరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసిన కివీస్ మహిళా జట్టు 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక వర్షం కారణంగా తొలి మూడు టీ20లలో ఫలితం తేలకపోవడంతో.. నాలుగు, ఐదు మ్యాచ్‌లలో గెలిచిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్‌ను 1-1తో పంచుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా సుజీ బేట్స్ అరుదైన ఘనత సాధించింది. 42 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 45 పరుగులు రాబట్టిన ఈ కుడిచేతి వాటం గల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ టీ20లలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు మొత్తంగా 149 టీ20లు ఆడిన సుజీ బేట్స్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా 4021 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో రన్‌మెషీన్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసింది. కాగా కోహ్లి 115 మ్యాచ్‌లలో 37 అర్ధ శతకాలు, ఒక సెంచరీ సాయంతో 4008 పరుగులు చేశాడు. తన ఖాతాలోనూ ఓ శతకంతో పాటు 26 హాఫ్ సెంచరీలు జమ చేసుకున్న సుజీ ఈ మేరకు కోహ్లి రికార్డును సవరించింది. ఈ సందర్భంగా కివీస్ మహిళా జట్టును సూచించే వైట్‌ఫెర్న్స్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసింది. ‘‘సరికొత్త చరిత్ర! బెనోనీలో జరిగిన మ్యాచ్‌లో సుజీ బేట్స్.. అంతర్జాతీయ టీ20 కెరీర్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఘనత సాధించింది. అంతేకాదు.. విరాట్ కోహ్లి(4008*)ని అధిగమించి ప్రస్తుతం ప్రపంచంలోనే టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది’’ అని సుజీకి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ 3405 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ 3154 రన్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? History made! Suzie Bates became the first woman to reach 4000 T20I career runs today in Benoni🏏 Suzie is now the leading T20I run scorer in the world, surpassing previous record holder Virat Kohli (4008*) 🌏 #SAvNZ #CricketNation pic.twitter.com/SjqcBNRQmS — WHITE FERNS (@WHITE_FERNS) October 15, 2023