New Zealand vs South Africa
-
ఒక్కొక్కరికి రూ. 1 కోటీ 30 లక్షలు!
ప్రపంచ క్రికెట్లో టాప్-3 అయిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పోలిస్తే న్యూజిలాండ్ క్రికెటర్లకు సాధారణంగా ఆట ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. ఎవరో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా ఇతర ఆదాయంపై ఆధారపడేవారే. ఇక ఒక్కసారి రిటైర్ అయితే నేరుగా ఏదైనా ఉద్యోగంలో చేరిపోతే తప్ప పని నడవదు. ఇక ఆ దేశపు మహిళా క్రికెటర్ల పరిస్థితి మరీ ఇబ్బందికరం.పురుష టీమ్ సభ్యులతో పోలిస్తే వీరికి దక్కేది చాలా తక్కువ మొత్తం. మహిళా క్రికెటర్లంతా ఆటపై ఇష్టం, ఆసక్తితో కొనసాగడమే. ఇలాంటి సమయంలో టీ20 వరల్డ్ కప్ విజయం ద్వారా వచ్చిన మొత్తం వారికి కాస్త ఊరటను అందించింది! విజేతగా నిలవడంతో కివీస్ మహిళల టీమ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో ఐసీసీ రూ. 23 లక్షల 40 వేల డాలర్లు అందించింది. ఈ మొత్తాన్ని జట్టులో 15 మందికి సమంగా పంచారు.ఫలితంగా ఒక్కొక్కరికి 2 లక్షల 56 వేల న్యూజిలాండ్ డాలర్లు (సుమారు రూ.1 కోటీ 30 లక్షలు) లభించాయి. వరల్డ్ కప్‌కు ముందు వరుసగా 10 టీ20లు ఓడి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు చివరకు చాంపియన్‌గా నిలిచింది. దాంతో ఆర్థికపరంగా కూడా జట్టులోని సభ్యులకు వెసులుబాటు దక్కడం ఈ టీమ్ గెలుపులో మరో సానుకూలాంశం! చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు.. తండ్రిలాంటి వాడినంటూ..’ -
SA vs NZ W T20: వరల్డ్‌కప్ విజేత న్యూజిలాండ్
మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో తొలిసారి న్యూజిలాండ్ మహిళల టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాపై 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. స్కోర్లు: న్యూజిలాండ్ 158/5, సౌతాఫ్రికాపై 126/9మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. దుబాయ్ వేదికగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్ బ్యాటర్లలో ఓపెనర్ సుజీ బేట్ 31 బంతుల్లో 32 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లిమెర్(9) మాత్రం నిరాశపరిచింది.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్‌డౌన్ బ్యాటర్ అమేలియా కెర్ 38 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 43 రన్స్ సాధించింది. ఆమెకు తోడుగా బ్రూక్ హాలీడే(28 బంతుల్లో 38) రాణించింది. వీరిద్దరి కారణంగా న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. మిగతా వాళ్లలో కెప్టెన్ సోఫీ డివైన్(6) విఫలం కాగా.. మ్యాడీ గ్రీన్ 12, వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు.సౌతాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖాకా, క్లోయీ ట్రియాన్, నాడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ తీయగా.. నోన్కులులేకో మ్లాబా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎవరు గెలిచినా చరిత్రే!కాగా 14 ఏళ్ల తర్వాత తొలిసారి న్యూజిలాండ్ మహిళా జట్టు వరల్డ్‌కప్ ఫైనల్ చేరగా.. సౌతాఫ్రికా వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదిస్తే తమ దేశం ఖాతాలో మొట్టమొదటి ఐసీసీ వరల్డ్‌కప్‌ను జమచేస్తుంది. లేదంటే.. న్యూజిలాండ్‌కు తొలి ప్రపంచకప్ దక్కుతుంది.మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికాతుదిజట్లున్యూజిలాండ్సుజీ బేట్స్, జార్జియా ప్లిమెర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గాజ్(వికెట్ కీపర్), రోజ్మేరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ (కెప్టెన్), టాజ్మిన్ బ్రిట్స్, అన్నేక్ బాష్, క్లోయి ట్రియాన్, మారిజానే కాప్, సునే లుస్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), నోన్కులులేకో మ్లాబా, అయబోంగా ఖాకా.చదవండి: IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే! -
సౌతాఫ్రికా క్రికెట్‌కు అవమానం.. 92 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
South Africa tour of New Zealand, 2024- హామిల్టన్: ఎట్టకేలకు టెస్టు ఫార్మాట్లో దక్షిణాఫ్రికా జట్టుపై న్యూజిలాండ్ జట్టు తొలిసారి సిరీస్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించి సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 1932 నుంచి రెండు జట్ల మధ్య 18 టెస్టు సిరీస్‌లు జరిగాయి. దక్షిణాఫ్రికా 13 సార్లు నెగ్గగా, నాలుగు సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 18వ ప్రయత్నంలో మొదటిసారి న్యూజిలాండ్‌కు సిరీస్ దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 40/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 94.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి గెలిచింది. కేన్ విలియమ్సన్ (133 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. విల్ యంగ్ (60 నాటౌట్; 8 ఫోర్లు)తో కలిసి విలియమ్సన్ నాలుగో వికెట్‌కు 152 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యాన్ని జోడించాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో సీనియర్ ఆటగాళ్లంతా బిజీగా ఉండటంతో.. అనుభవలేమి, యువ ప్లేయర్లతో కూడిన జట్టును కివీస్ పర్యటనకు పంపింది ప్రొటిస్ బోర్డు. తొలి టెస్టు సందర్భంగా ఏకంగా ఐదుగురు సౌతాఫ్రికా క్రికెటర్లు అరంగేట్రం చేయడం విశేషం. ఫలితంగా.. న్యూజిలాండ్‌తో పోటీలో.. 92 ఏళ్ల చరిత్రలో తొలిసారి టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై.. భారీ మూల్యమే చెల్లించింది. న్యూజిలాండ్ చేతిలో క్లీన్‌స్వీప్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. Kane Williamson has reached his 32nd Test Century! With 172 innings, that is the fewest innings to reach 32 test 100's in test history, beating Steve Smith. 🔥🏏@BLACKCAPS v South Africa: 2nd Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/pSg5VFP2nS — TVNZ+ (@TVNZ) February 16, 2024 -
రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్-సౌతాఫ్రికా రెండో టెస్ట్
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. కఠినమైన పిచ్‌పై పర్యాటక సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌కు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. మూడో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా.. డెవాన్ కాన్వే (17) ఔటయ్యాడు. కాన్వే ఔటయ్యాక అంపైర్లు మూడో రోజు ఆటను ముగించారు. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 227 పరుగులు చేయాలి. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో రేపు ఫలితం తేలడం ఖాయమని తెలుస్తుంది. అంతకుముందు బెడింగ్హమ్ (110) కెరీర్లో తొలి శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసి ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బెడింగ్హమ్తో పాటు నీల్ బ్రాండ్ (34), కీగన్ పీటర్సన్ (43), హమ్జా (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విలియమ్ రూర్కీ ఐదు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. 43 పరుగులు చేసిన విలియమ్సన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్ డి పైడ్ట్ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకు ఆలౌటైంది. రుయాన్ డి స్కార్డ్ట్ (64) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ పేసర్ విలియమ్ రూర్కీ నాలుగు వికెట్లతో రాణించాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. క్రికెట్ సౌతాఫ్రికా.. న్యూజిలాండ్ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును పంపించింది. -
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా ‘అనుభలేమి జట్టు’!
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో అనూహ్యంగా సౌతాఫ్రికా పైచేయి సాధించింది. మంగళవారం నాటి ఆటను 220/6తో ముగించిన సౌతాఫ్రికా.. బుధవారం తమ స్కోరుకు మరో 22 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. 242 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. హామిల్టన్ టెస్టులో కివీస్ బౌలర్లలో విలియం రూర్కీ 4 వికెట్లు పడగొట్టగా.. రచిన్ రవీంద్ర 3 వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ టిమ్ సౌతీతో పాటు మ్యాట్ హెన్రీ, వాగ్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు సౌతాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 40 పరుగులు రాబట్టాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 43 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా వాళ్లలో విల్ యంగ్(36), నీల్ వాగ్నర్(33) మాత్రమే ముప్పై పరుగుల మార్కు అందుకున్నారు. ఫలితంగా.. బుధవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి 77.3 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా కంటే.. 31 పరుగులు వెనుకబడి ఉంది. ప్రొటిస్ స్పిన్నర్ డేన్ పీడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్ డేన్ పీటర్సన్ 3 వికెట్లు కూల్చాడు. మరో పేసర్ మొరేకికి ఒక వికెట్ దక్కింది. కాగా తొలి టెస్టులో ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర(240) వ్యక్తిగత స్కోరు కంటే కూడా ఈసారి కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు తక్కువ కావడం గమనార్హం. ఇక మొదటి టెస్టులో రచిన్ డబుల్ సెంచరీ, విలియమ్సన్ వరుస సెంచరీల కారణంగా 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది న్యూజిలాండ్. అనుభలేమి సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉన్న కారణంగా కీలకమైన కివీస్ పర్యటనకు అనుభవలేమి జట్టును పంపి విమర్శుల మూటగట్టుకుంది సౌతాఫ్రికా. న్యూజిలాండ్‌తో మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా ఏకంగా ఆరుగురు ప్రొటిస్ ఆటగాళ్లు అరంగేట్రం చేయడం విశేషం. చదవండి: అరంగేట్ర జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి! -
ఈసారి బంతితో మ్యాజిక్ చేసిన రచిన్ రవీంద్ర
న్యూజిలాండ్ యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఫార్మాట్లకతీతంగా ఇరగదీస్తున్నాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో సంచలన ప్రదర్శనలు చేసి వెలుగులోకి వచ్చిన రచిన్.. తాజాగా టెస్ట్ ఫార్మాట్లోనూ సత్తా చాటుతున్నాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో బ్యాట్‌తో (డబుల్ సెంచరీ) చెలరేగిన రచిన్.. ఇవాళ (ఫిబ్రవరి 13) మొదలైన రెండో టెస్ట్‌లో బంతితో మ్యాజిక్ చేశాడు. రచిన్ 3 వికెట్లతో రాణించడంతో పర్యాటక సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రచిన్‌తో పాటు మ్యాట్ హెన్రీ (1/48), విలియమ్ రూర్కీ (1/47), నీల్ వాగ్నర్ (1/28) వికెట్లు తీశారు. 150 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికాను రుయాన్ డి స్వార్డ్ట్ (55), షాన్ వాన్ బెర్గ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజ్‌లోనే ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో నీల్ బ్రాండ్ 25, క్లైడ్ ఫోర్టిన్ 0, రేనార్డ్ వార్ టోండర్ 32, జుబేర్ హంజా 20, డేవిడ్ బెడింగ్హమ్ 39, కీగన్ పీటర్సన్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఈ సిరీస్‌లోని జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్ 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో విరుచుకుపడగా.. కేన్ విలియమ్సన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి టెస్ట్‌లో రచిన్ బంతితోనూ (2 వికెట్లు) పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టును పంపించి చేతులుకాల్చుకుంది. -
‘అరంగేట్ర’ జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి!
New Zealand vs South Africa, 1st Test : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అనుభలేమి ప్రొటిస్ జట్టును 281 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా సౌతాఫ్రికాపై రెండో అతి పెద్ద విజయం అందుకుంది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024తో బిజీ కావడంతో నీల్ బ్రాండ్ సారథ్యంలో.. పెద్దగా అనుభవంలేని ప్రొటిస్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఐదుగురు మినహా కెప్టెన్ బ్రాండ్ సహా అంతా అరంగేట్ర ప్లేయర్లే కావడం విశేషం. రచిన్ డబుల్ సెంచరీ ఈ క్రమంలో మౌంట్ మౌంగనుయ్ వేదికగా కివీస్‌తో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన.. సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ విలియమ్సన్(118) సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీ(240)తో చెలరేగాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోరు చేసి.. ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 162 పరుగులకే కుప్పకూలింది. ప్రొటిస్ బ్యాటర్లలో కీగన్ పీటర్సన్(45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ (3/31), సాంట్నర్ (3/34), జేమీసన్ (2/35), రచిన్ రవీంద్ర (2/16) రాణించారు. విలియమ్సన్ వరుస శతకాలతో ఈ నేపథ్యంలో 349 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్ జట్టు.. 179-4 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109; 12 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఐదో న్యూజిలాండ్ క్రికెటర్‌గా విలియమ్సన్ గుర్తింపు పొందాడు. సౌతాఫ్రికా చిత్తు ఈ మేరకు బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 528 పరుగుల ఆధిక్యం సాధించి.. సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో గురువారం నాటి ఆటలో 247 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా టార్గెట్ పూర్తి చేయలేక భారీ ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో కైలీ జెమీషన్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. ఇక సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 13 నుంచి రెండో మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ప్రొటిస్ ఆటగాళ్లు: 1.ఎడ్వర్డ్ మూరే(ఓపెనర్) 2.నీల్ బ్రాండ్(ఓపెనర్, కెప్టెన్) 3.వాన్ టాండర్(వన్‌డౌన్ బ్యాటర్) 4.రువాన్ డి స్వార్డ్(బౌలింగ్ ఆల్‌రౌండర్) 5.క్లైడ్ ఫార్చూన్(వికెట్ కీపర్ బ్యాటర్) 6. షోపో మొరేకి(పేస్ బౌలర్). చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్