
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదైంది. 2025 ఎడిషన్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఇదే ఎడిషన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 356 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్దేశించిన 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆసీస్ ఈ రికార్డు స్కోర్ సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టాప్-5 అత్యధిక స్కోర్లు
362 - న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా, 2025
356 - ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్, 2025
351 - ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా, 2025
347 - న్యూజిలాండ్ vs USA, 2004
338 - పాకిస్తాన్ vs ఇండియా, 2017
331 - ఇండియా vs సౌత్ ఆఫ్రికా, 2013
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేసిన స్కోర్ ఐసీసీ వన్డే టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్‌ల్లో మూడో అత్యధిక స్కోర్‌గా (362) రికార్డైంది. ఐసీసీ వన్డే టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్ రికార్డు టీమిండియా పేరిట ఉంది. 2023 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 397 పరుగులు చేసింది.
ఐసీసీ వన్డే టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్‌ల్లో టాప్-5 అత్యధిక స్కోర్లు
397/4 - IND vs NZ, ముంబై , CWC 2023 SF
393/6 - NZ vs WI, వెల్లింగ్టన్, CWC 2015 QF
362/6 - NZ vs SA, లాహోర్, CT 2025 SF
359/2 - AUS vs IND, జోహన్నెస్‌బర్గ్, CWC 2003 ఫైనల్
338/4 - PAK vs IND, ది ఓవల్, CT 2017 ఫైనల్
రచిన్, విలియమ్సన్ శతకాలు
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 21, డారిల్ మిచెల్ 49, టామ్ లాథమ్ 4, బ్రేస్‌వెల్ 16 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ తీశారు.
ఛేదిస్తే చరిత్రే
వన్డే క్రికెట్‌లో కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే నేడు కివీస్ నిర్దేశించిన టార్గెట్ (363) కంటే ఎక్కువ లక్ష్యాలు ఛేదించబడ్డాయి. ఈ రెండు సార్లు భారీ లక్ష్యాలను సౌతాఫ్రికానే ఛేదించింది. రెండు సందర్భాల్లో సౌతాఫ్రికా ప్రత్యర్థి ఆస్ట్రేలియానే కావడం విశేషం. 2006లో సౌతాఫ్రికా 435 పరుగుల లక్ష్యాన్ని విజయవంతగా ఛేదించింది. ఆతర్వాత 2016లో 372 లక్ష్యాన్ని ఊదేసింది.
Comments
Please login to add a commentAdd a comment