
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెకెండ్ సెమీఫైనల్లో బుధవారం దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లహోర్ వేదికగా జరగనున్న ఈ కీలక పోరులో గెలిచి ఫైనల్ దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సౌతాఫ్రికా తమ గ్రూపు స్టేజిని ఆజేయంగా ముగించగా.. కివీస్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైంది.
కాగా సెమీస్ పోరుకు ముందు సౌతాఫ్రికాను ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్య వెంటాడుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమైన ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా, స్టార్ ఓపెనర్ టోనీ డి జోర్జి ఇంకా పూర్తిగా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఐడైన్ మార్‌క్రమ్ సైతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మార్‌క్రమ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫీల్డింగ్ మధ్యలోనే ఐడైన్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో హెన్రిచ్ క్లాసెన్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. అయితే మార్‌క్రమ్‌కు మార్చి 4న ప్రోటీస్ వైద్య బృందం ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనుంది.
ఒకవేళ ఈ ఫిట్‌నెస్ పరీక్షలో మార్‌క్రమ్ ఫెయిల్ అయితే కివీస్‌తో సెమీస్‌కు దూరమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ జార్జ్ లిండేను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు రిజర్వ్ జాబితాలో చేర్చినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అతడు ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్నట్లు సమాచారం. కాగా లిండేకు అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20లో కూడా అతడు అదరగొట్టాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపారు.
చదవండి: అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్‌కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment