రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. కఠినమైన పిచ్‌పై పర్యాటక సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌కు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. మూడో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా.. డెవాన్ కాన్వే (17) ఔటయ్యాడు. కాన్వే ఔటయ్యాక అంపైర్లు మూడో రోజు ఆటను ముగించారు. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 227 పరుగులు చేయాలి. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో రేపు ఫలితం తేలడం ఖాయమని తెలుస్తుంది.
అంతకుముందు బెడింగ్హమ్ (110) కెరీర్‌లో తొలి శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసి ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బెడింగ్హమ్‌తో పాటు నీల్ బ్రాండ్ (34), కీగన్ పీటర్సన్ (43), హమ్జా (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విలియమ్ రూర్కీ ఐదు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు.
దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. 43 పరుగులు చేసిన విలియమ్సన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్ డి పైడ్ట్ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకు ఆలౌటైంది. రుయాన్ డి స్కార్డ్ట్ (64) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ పేసర్ విలియమ్ రూర్కీ నాలుగు వికెట్లతో రాణించాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. క్రికెట్ సౌతాఫ్రికా.. న్యూజిలాండ్ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment