
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు పాకిస్తాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా సోమవారం రెండో మ్యాచ్‌లో లహోర్ వేదికగా న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్ టీ20 తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కేన్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో కేవలం 72 బంతుల్లోనే తన 14వ వన్డే సెంచరీని కేన్ మామ అందుకున్నాడు.
అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 11 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాకుండా 305 పరుగుల లక్ష్య చేధనలో డెవాన్ కాన్వేతో కలిసి 187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని విలియమ్సన్ నెలకొల్పాడు. ప్రస్తుతం కేన్ 103 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. బ్లాక్ క్యాప్స్ విజయానికి 85 బంతుల్లో 68 పరుగులు కావాలి.
విలియమ్సన్ అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన విలియమ్సన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. ఏబీడీ తన కెరీర్‌లో 420 మ్యాచ్‌లు ఆడి 47 సెంచరీలు నమోదు చేయగా.. విలియమ్సన్ కూడా ఇప్పటివరకు 47 శతకాలు నమోదు చేశాడు.
కేన్ మరో సెంచరీ సాధిస్తే డివిలియర్స్‌ను అధిగమిస్తాడు. అదే విధంగా విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో న్యూజిలాండ్ ప్లేయర్‌గా కేన్ నిలిచాడు. విలియమ్సన్ ఇప్పటివరకు విదేశాల్లో 6 వన్డే సెంచరీలు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ గప్టిల్(7) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా కివీస్ తరపున అత్యధిక వన్డే సెంచరీలు జాబితాలో విలియమ్సన్ నాలుగో స్ధానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో కివీ దిగ్గజం రాస్ టేలర్(21) ఉన్నాడు.
మాథ్యూ బ్రీట్జ్‌కే విధ్వంసం..
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్‌కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. తద్వారా అరంగేట్రంలో 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు.
Kane Williamson gets to his 14th ODI century off 72 balls! 💯#3Nations1Trophy | #NZvSA pic.twitter.com/e90S4QNieI
— Pakistan Cricket (@TheRealPCB) February 10, 2025