ప్రపంచ క్రికెట్‌లో టాప్-3 అయిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పోలిస్తే న్యూజిలాండ్ క్రికెటర్లకు సాధారణంగా ఆట ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. ఎవరో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా ఇతర ఆదాయంపై ఆధారపడేవారే. ఇక ఒక్కసారి రిటైర్ అయితే నేరుగా ఏదైనా ఉద్యోగంలో చేరిపోతే తప్ప పని నడవదు. ఇక ఆ దేశపు మహిళా క్రికెటర్ల పరిస్థితి మరీ ఇబ్బందికరం.
పురుష టీమ్ సభ్యులతో పోలిస్తే వీరికి దక్కేది చాలా తక్కువ మొత్తం. మహిళా క్రికెటర్లంతా ఆటపై ఇష్టం, ఆసక్తితో కొనసాగడమే. ఇలాంటి సమయంలో టీ20 వరల్డ్ కప్ విజయం ద్వారా వచ్చిన మొత్తం వారికి కాస్త ఊరటను అందించింది! విజేతగా నిలవడంతో కివీస్ మహిళల టీమ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో ఐసీసీ రూ. 23 లక్షల 40 వేల డాలర్లు అందించింది. ఈ మొత్తాన్ని జట్టులో 15 మందికి సమంగా పంచారు.
ఫలితంగా ఒక్కొక్కరికి 2 లక్షల 56 వేల న్యూజిలాండ్ డాలర్లు (సుమారు రూ.1 కోటీ 30 లక్షలు) లభించాయి. వరల్డ్ కప్‌కు ముందు వరుసగా 10 టీ20లు ఓడి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు చివరకు చాంపియన్‌గా నిలిచింది. దాంతో ఆర్థికపరంగా కూడా జట్టులోని సభ్యులకు వెసులుబాటు దక్కడం ఈ టీమ్ గెలుపులో మరో సానుకూలాంశం!
చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు.. తండ్రిలాంటి వాడినంటూ..’
Comments
Please login to add a commentAdd a comment