ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోనుంది. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మెగ్ లానింగ్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపింది. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా తరపున బిజీ క్రికెట్ ఆడాను. కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు మానసికంగా అలసిపోయిన నాకు విశ్రాంతి కావాలనిపిస్తుంది. అందుకే ఈ లాంగ్ బ్రేక్. త్వరలో మళ్లీ జట్టులోకి వస్తా అంటూ 30 ఏళ్ల లానింగ్ పేర్కొంది. ''వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్న మెగ్ లానింగ్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం.. మా క్రికెట్‌లో బ్రేక్ అనే పదానికి మెగ్ లానింగ్ అర్హురాలు'' అంటూ ట్విటర్‌లో పేర్కొంటూ ఆమెకు మద్దతిచ్చింది.
ఇటీవలే నిర్వహించిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆసీస్ మహిళల జట్టు స్వర్ణం పతకం ఎగురేసుకుపోయిన సంగతి తెలిసింది. టీమిండియా మహిళలతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా వుమెన్స్ విజయం సాధించిన స్వర్ణం కొల్లగొట్టగా.. భారత్ రజతం కైసవం చేసుకుంది.
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో మెగ్ లానింగ్ తనదైన ముద్ర వేసింది. లానింగ్ ఖాతాలో రెండు మహిళల వన్డే ప్రపంచకప్‌లతో పాటు.. నాలుగు టి20 ప్రపంచకప్‌లు ఉండడం విశేషం. ఇందులో మూడు టి20 ప్రపంచకప్‌లు(2014, 2018, 2020)లానింగ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా గెలవడం విశేషం.
మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డులు..
►వన్డేల్లో అత్యధిక సెంచరీలు మెగ్ లానింగ్ పేరిటే ఉన్నాయి. వన్డేల్లో లానింగ్ 15 సెంచరీలు సాధించింది.
►టి20ల్లో ఆస్ట్రేలియా మహిళల తరపున 2వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా రికార్డు.
►మిథాలీ రాజ్(భారత్), చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్) తర్వాత 150 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మూడో క్రీడాకారిణిగా రికార్డు
►ఓవరాల్‌గా మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా మహిళల జట్టు తరపున 6 టెస్టుల్లో 93 పరుగులు, 100 వన్డేల్లో 4463 పరుగులు, 115 టి20ల్లో 3007 పరుగులు సాధించింది.
If anyone deserves a break, it's Meg Lanning. pic.twitter.com/BC8fKTwSDw
— Cricket Australia (@CricketAus) August 10, 2022
చదవండి: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్.. మళ్లీ నెంబర్ 1 స్థానానికి!
Comments
Please login to add a commentAdd a comment