personal reasons
-
యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరో ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూజా ఖేడ్కర్ వ్యవహారానికి, మనోజ్ సోనీ రాజీనామాకు సంబంధం లేదంటూ అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని తెలియజేశాయి. మనోజ్ సోనీ పదిహేను రోజుల క్రితమే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. అయితే శనివారం సాయంత్రం వరకు కూడా ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించలేదు. 2029 మే 15 వరకు మనోజ్ సోనీ పదవీకాలం ఉంది. ఆయన గతంలో బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం వీసీగా పనిచేశారు. గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు పర్యాయాలు వరుసగా వీసీగా సేవలందించారు. 2017 జూన్ 28న యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. గత ఏడాది మే 16న యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రహస్యం ఎందుకు?: ఖర్గే మనోజ్ సోనీ 15 రోజుల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పటిదాకా ఎందుకు రహస్యంగా ఉంచారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యూపీఎస్సీలో జరిగిన కుంభకోణాలకు, ఈ రాజీనామాకు మధ్య సంబంధం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి మనోజ్ సోనీని తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్‌గా నియమించారని చెప్పారు. ఈ మేరకు ఖర్గే శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన నియామకాల్లో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి?: జైరాం రమేష్ మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచి్చనట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మరి నీట్–యూజీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఛైర్మన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
వక్తిగత కారణాలతో యువకుడు.. రైలు కింద పడి..!
మిర్యాలగూడ అర్బన్: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్(30) అనే అనాథ యువకుడు మిర్యాలగూడ పట్టణంలోని లారీ అసోసియేషన్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం అతడు వ్యక్తిగత కారణాలతో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో జన్మభూమి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com దొంగతనం కేసులో జైలు శిక్ష రామగిరి(నల్లగొండ): ఆటో దొంగతనం కేసులో ఓ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కోర్టు జడ్జి కె. శ్రీవాణి సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. నల్లగొండ పట్టణానికి చెందిన మహ్మద్ రఫీక్ మొయినుద్దీన్ తన ఆటోను మీర్బాగ్కాలనీలో నివాసం ఉంటున్న ఎండీ. హజీకి కిరాయికి ఇచ్చాడు. హజీ 2023 జూన్ 22న రాత్రి తన ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం చూసే సరికి ఇంటి ముందు ఆటో కనబడలేదు. ఆటో యజమాని రఫీక్‌కు విషయం తెలియజేయడంతో నల్లగొండ టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన మహ్మద్ సలీం వద్ద ఆటో ఉన్నట్లు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సోమవారం పబ్లిక్ ప్రొసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన జడ్జి కె. శ్రీవాణి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
ఉన్నపళంగా స్వదేశానికి ఆసీస్ కెప్టెన్..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే వరుసగా రెండు టెస్టులు ఓడి షాక్‌లో ఉన్న ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ సోమవారం ఉన్నపళంగా స్వదేశానికి బయలుదేరాడు. ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కారణంగానే కమిన్స్ సిడ్నీకి బయలుదేరినట్లు తెలిసింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ఉదయం ట్విటర్లో పేర్కొంది. అయితే మూడో టెస్టు మొదలయ్యేలోగా కమిన్స్ తిరిగి వస్తాడని ఆసీస్ క్రికెట్ తెలిపింది. రెండో టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగియడంతో కమిన్స్ తన పర్సనల్ వ్యవహారమై స్వదేశానికి వెళ్లి రావాలని నిశ్చయించుకున్నాడు. ఒకవేళ రెండో టెస్టు ఐదు రోజులు జరిగినప్పటికి ఆ తర్వాత అయిన కమిన్స్ వెళ్లేవాడే. అయితే మూడో టెస్టుకు మాత్రం దూరమయ్యేవాడు. ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా పోయింది. ఒకవేళ కమిన్స్ రాలేని పరిస్థితి ఉంటే అప్పుడు జట్టును వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నడిపించే అవకాశం ఉంది. అయితే మూడో టెస్టు మార్చి 1నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. మ్యా్చ్కు దాదాపు పది రోజులు సమయం ఉండడంతో కమిన్స్ తిరిగివచ్చి జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఇక కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టుకు భారత గడ్డపై ఏదీ కలిసి రావడం లేదు. తొలి రెండు టెస్టుల్లో స్నిన్నర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా రెండున్నర రోజుల్లోనే తమ ఆటను ముగించింది. అంతేకాదు టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నట్లు కనిపించిన ఆస్ట్రేలియాకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ టీమిండియాతో సిరీస్‌లో ఆసీస్ గనుక క్లీన్‌స్వీప్ అయితే ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడకపోవచ్చు. ఆసీస్ స్థానంలో ఇంగ్లండ్, శ్రీలంక, సౌతాఫ్రికాలలో ఏదో ఒక జట్టుకు అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలనుకుంటే మాత్రం ఆసీస్ తన తర్వాతి రెండు టెస్టులను కనీసం డ్రా అయినా చేసుకోవాల్సిందే. చదవండి: పిచ్‌పై నీలాపనిందలు.. ఆడడం చేతగాకనే -
ఆస్ట్రేలియా కెప్టెన్ అనూహ్య నిర్ణయం.. గౌరవించిన సీఏ
ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోనుంది. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మెగ్ లానింగ్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపింది. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా తరపున బిజీ క్రికెట్ ఆడాను. కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు మానసికంగా అలసిపోయిన నాకు విశ్రాంతి కావాలనిపిస్తుంది. అందుకే ఈ లాంగ్ బ్రేక్. త్వరలో మళ్లీ జట్టులోకి వస్తా అంటూ 30 ఏళ్ల లానింగ్ పేర్కొంది. ''వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్న మెగ్ లానింగ్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం.. మా క్రికెట్లో బ్రేక్ అనే పదానికి మెగ్ లానింగ్ అర్హురాలు'' అంటూ ట్విటర్లో పేర్కొంటూ ఆమెకు మద్దతిచ్చింది. ఇటీవలే నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆసీస్ మహిళల జట్టు స్వర్ణం పతకం ఎగురేసుకుపోయిన సంగతి తెలిసింది. టీమిండియా మహిళలతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా వుమెన్స్ విజయం సాధించిన స్వర్ణం కొల్లగొట్టగా.. భారత్ రజతం కైసవం చేసుకుంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో మెగ్ లానింగ్ తనదైన ముద్ర వేసింది. లానింగ్ ఖాతాలో రెండు మహిళల వన్డే ప్రపంచకప్‌లతో పాటు.. నాలుగు టి20 ప్రపంచకప్‌లు ఉండడం విశేషం. ఇందులో మూడు టి20 ప్రపంచకప్‌లు(2014, 2018, 2020)లానింగ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా గెలవడం విశేషం. మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డులు.. ►వన్డేల్లో అత్యధిక సెంచరీలు మెగ్ లానింగ్ పేరిటే ఉన్నాయి. వన్డేల్లో లానింగ్ 15 సెంచరీలు సాధించింది. ►టి20ల్లో ఆస్ట్రేలియా మహిళల తరపున 2వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా రికార్డు. ►మిథాలీ రాజ్(భారత్), చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్) తర్వాత 150 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మూడో క్రీడాకారిణిగా రికార్డు ►ఓవరాల్‌గా మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా మహిళల జట్టు తరపున 6 టెస్టుల్లో 93 పరుగులు, 100 వన్డేల్లో 4463 పరుగులు, 115 టి20ల్లో 3007 పరుగులు సాధించింది. If anyone deserves a break, it's Meg Lanning. pic.twitter.com/BC8fKTwSDw — Cricket Australia (@CricketAus) August 10, 2022 చదవండి: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్.. మళ్లీ నెంబర్ 1 స్థానానికి! -
ఓ తండ్రి వ్యథ!
పిల్లల్ని చూసుకునే అదృష్టమూ లేదా? విడాకులు తీసుకున్నంత మాత్రాన బిడ్డల్నీ వదులుకోవాల్సిందేనా? చిన్నారుల దరి చేరేందుకు క్రిస్ప్ పోరాటం సాక్షి, సిటీబ్యూరో: ‘తండ్రులు మూర్ఖులు కాదు.. క్రూరులు అంతకన్నా కాదు. మాకు పిల్లలంటే ప్రాణం. వారిని రోజూ చూడాలని, ఆడించాలని, చదువు చెప్పించాలని, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మాకూ ఉంటుంది’ అంటున్నారు బాధిత భర్తలు. ‘భార్యాభర్తల మధ్య చోటుచేసుకునే చిన్నచిన్న సమస్యలకు సైతం కోర్టులకెక్కి విడాకులు తీసుకోవడం... వారి వెంట పిల్లలను తీసుకెళ్లడంతో మేం పిల్లల పెంపకానికి దూరంగా ఉండాల్సి వస్తోంది’ అని ఆందోళన చెందుతున్నారు బాధిత తండ్రులు. పిల్లలు పుట్టకముందే ఎన్నో ఆశలు పెట్టుకుంటామని అలాంటిది పుట్టిన పిల్లలకు దూరంగా ఎలా ఉండగలమని కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి వారంతా చిల్డ్రన్స్ రైట్స్ ఇనిషియేటివ్ ఫర్ షేర్డ్ పేరెంట్స్ (క్రిస్ప్) సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రతినిధులు శనివారం నగరంలోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో తాము అనుభవిస్తున్న బాధను సమాజం ముందుకు పెట్టే ప్రయత్నం చేశారు. ‘భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే పిల్లల సంరక్షణ, బాధ్యత తల్లే తీసుకోవాలని భారతీయ చట్టం చెబుతోంది. కానీ, ఇది అన్యాయం’ అంటోంది చిల్డ్రన్స్ రైట్స్ ఇనిషియేటివ్ ఫర్ షేర్డ్ పేరెంట్స్ (క్రిస్ప్). పిల్లలకు తండ్రి పెంపకం అవసరమని సమాజానికి చాటిచెప్పడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని వారంటున్నారు. వ్యక్తిగత కారణాలు, కుటుంబ తగాదాలతో విడిపోయినంత మాత్రాన పిల్లలపై తండ్రికి హక్కులేదనటం సరికాదని వారు పేర్కొంటున్నారు. క్రిస్ప్లో 5 వేల మంది సభ్యులు.. సీఆర్ఐఎస్పీలో ప్రస్తుతం ఐదు వేల మంది సభ్యులున్నారు. బెంగళూరు, నాగ్‌పూర్, పుణె, చెన్నై, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ముంబై రాష్ట్రాల్లో సీఆర్ఐఎస్పీ(క్రిస్ప్) తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అత్యధికంగా బెంగళూరులో 1,700 మంది సభ్యులుండగా ఢిల్లీలో 1,200, ముంబైలో 600, నాగ్‌పూర్‌లో 300, త్రివేండ్రం, పుణెలో 200, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో 800 మంది సభ్యులున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచే వంద మంది సభ్యులున్నారు. పిల్లల కోసమే ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. సీఆర్ఐఎస్పీ కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మందితో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్లు ఆ సంస్థ సభ్యులు చెబుతున్నారు. ఇవి తప్పనిసరి అంటున్న క్రిస్ప్ ప్రతినిధులు మహిళా, శిశు సంక్షేమ శాఖతో పిల్లలు తల్లికే పరిమితమనే తప్పుడు భావన సమాజంలోకి పోతోంది. అందుకే పిల్లల కోసమే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. కోర్టుకు వచ్చే విడాకుల కేసులను ఏళ్ల తరబడి సాగదీయొద్దు. జాప్యం జరిగితే పిల్లలు, తల్లిదండ్రులు అందరూ మానసిక క్షోభకు గురవుతారు. తండ్రి అంటే క్రూరులు, మూర్కులనే అభిప్రాయాన్ని పిల్లల్లో కలిగించే వారిని కఠినంగా శిక్షించాలి. భార్యాభర్తల మధ్య ఏర్పడే తగాదాలను సాధ్యమైనంత వరకు వ్యక్తిగతంగా సరిదిద్దుకోవాలి. లేదా ఫ్యామిలీ కౌన్సెలర్‌తో చర్చించి పరిష్కరించుకోవాలి. విడాకుల తీసుకున్న భార్యాభర్తలు తమ పిల్లల సంరక్షణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు తల్లి ఆధ్వర్యంలో, శని, ఆదివారాలు తండ్రి సంరక్షణలో ఉండాలని నిర్ణయించాలి. కూతురిని చూసి నాలుగేళ్లవుతోంది.. నేను వృత్తి రీత్యా వ్యాపారిని. నాకు 2005లో వివాహం జరిగింది. నా భార్య లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో అక్కడే స్థిరపడ్డాం. వివాహమైన మూడేళ్లకు కూతురు (నిషా) పుట్టింది. కారణాలు ఏవైనా మేం విడిపోయాం. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యసనాలు, చెడు ఆలోచనలు, అలవాట్లు లేని నాకు మానసిక లోపం ఉందటూ, అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నానంటూ నా భార్య కోర్టులో కేసు వేసింది. దీంతో 2010లో విడాకులు మంజూరయ్యాయి. నా బాధంతా నా భార్య కోసం కాదు. నా కూతురు కోసం. నిషాను చూసి నాలుగేళ్లవుతోంది. కనీసం కోర్టుకు వచ్చిన సమయంలోనైనా కూతురిని చూసుకునే భాగ్యం కూడా కలగడం లేదు. - రవి, ఒంగోలు బాధితుల పక్షాన పోరాడేందుకే.. నేను బెంగళూరులో స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యాపారిని. 1986లో వివాహం జరిగింది. (ఈయన భార్య ప్రస్తుతం ప్రముఖ భారతీయ క్రికెటర్ భార్య). 13 ఏళ్ల తర్వాత వరకట్నం కోసం వేధిస్తున్నానని, కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడం లేదంటూ విడాకుల కోసం నా సతీమణి బెంగళూరు కోర్టులో కేసు వేసింది. మాకు అప్పటికే ఓ కూతురు ఉంది. 1999లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. కూతురంటే నాకు ప్రాణం. భార్య విడాకులు తీసుకోవడంతో కూతురు కూడా దూరమైంది. పిల్లలు దూరమైతే తండ్రులు పడే బాధను మాటల్లో చెప్పలేం. ఇలాంటి సమస్య మరొకరికి రావద్దనే భావిస్తున్నా. ఇలాంటి బాధితుల తరఫున పోరాడేందుకు 2008లో చిల్డ్రన్స్ రైట్స్ ఇనిషియేట్ ఫర్ షేర్డ్ పేరెంట్స్ (క్రిస్ప్) అనే సంస్థను స్థాపించాను. విడాకులు తీసుకున్న కుటుంబాలు వారి పిల్లలకు తండ్రి పెంపకమూ అవసరం అనే విషయాన్ని సమాజానికి చాటి చెప్పడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. - కుమార్ వీ జాగిర్దార్, క్రిస్ప్ సంస్థ వ్యవస్థాపకులు నేడు తండ్రుల దినోత్సవం నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని జవహర్ బాలభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఆర్ఐఎస్పీ ఆధ్వర్యంలో జాతీయ తండ్రుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు జడ్జీలు జస్టిస్ రామలింగేశ్వర్రావు, జస్టిస్ డి.శేషాద్రి నాయుడులు ముఖ్యఅతిథులుగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.