లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఆసీస్ జట్టుకు నేరుగా గెలవడం చేతగాక ఇలా చీటింగ్ చేసి గెలవాలని చూసిందంటూ ఇంగ్లండ్ అభిమానులు ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. నిజానికి బెయిర్ స్టో ఔట్ సరైనదే. బంతి డెడ్ కాకముందే క్రీజులో నుంచి బయటికి వెళ్లి మాట్లాడడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ వికెట్ల వైపు బంతిని వేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు.
అయితే దీన్ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా పేర్కొంటూ ఆస్ట్రేలియా టీమ్‌పై విమర్శలు చేశారు ఇంగ్లీష్ అభిమానులు. ఐదో రోజు మొదటి సెషన్ ముగిసిన అనంతరం లార్డ్స్ లాంగ్ రూమ్‌లో ఉన్న కొందరు ఎంసీసీ సభ్యులు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లను బూతులు తిట్టారు. వీరితో ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ వాగ్వాదానికి దిగారు.
సాధారణంగా మిగిలిన క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెటర్లు, డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లే దారిలో వేరే వాళ్లు ఉండడానికి, కూర్చోవడానికి అవకాశం ఉండదు. అయిలే లార్డ్స్‌లో మాత్రం లాంగ్ రూమ్ పేరుతో ఎంసీసీ సభ్యుల కోసం ఓ లాంగ్ రూమ్ ఉంటుంది. ఇందులో మెర్లీబోన్ క్రికెట్ క్లబ్, మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. వీళ్లు వీవీఐపీల హోదాల లాంగ్ రూమ్‌లో కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు.
ఇక్కడ నుంచే ఇరుజట్ల క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కొంతమంది ప్రతినిధులు ఉస్మాన్ ఖవాజాతో గొడవపడ్డారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ ప్రతినిధులను వారించాల్సింది పోయి ఉస్మాన్ ఖవాజాను బలవంతంగా తోసేశారు. ఆ తర్వాత వార్నర్‌ను కూడా టార్గెట్ చేయడంతో తాను కూడా ఏం తగ్గలేదు. అయితే వివాదం మరింత ముదురుతుందేమోనని సెక్యూరిటీ వచ్చి వార్నర్‌ను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు.
దీనిపై ఉస్మాన్ ఖవాజా స్పందించాడు. ''ఇది నిజంగా చాలా నిరుత్సాహపరిచింది. వాళ్లు మమ్మల్ని బూతులు తిట్టారు. ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. అందుకే నేను వాళ్లను నిలదీశా.. వాళ్లలో కొందరు మాపై నిందలు వేశారు. ఇది మమ్మల్ని అవమానించడమే.. ఎంసీసీ మెంబర్స్ నుంచి ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు'' అంటూ కామెంట్ చేశాడు.
అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంసీసీ ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ కోరుతూ బహిరంగ లేఖను విడుదల చేసింది.''ఆస్ట్రేలియా క్రికెట్‌కు, ఉస్మాన్ ఖవాజా, వార్నర్‌లకు క్షమాపణలు. అమర్యాదగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దురుసుగా ప్రవర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.గ్రౌండ్‌లో జరిగిన విషయాన్ని నిలదీస్తే అధికారం బయటివాళ్లకు లేదు. అది వాళ్లకు సంబంధం లేని విషయం.'' అంటూ ప్రకటన విడుదల చేసింది.
Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳
— Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023
🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw
MCC Statement.#Ashes pic.twitter.com/fWYdzx1uhD
— Marylebone Cricket Club (@MCCOfficial) July 2, 2023
జరిగింది ఇదీ..
కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని వదిలేసిన జానీ బెయిర్‌స్టో, ఓవర్ అయిపోయిందని భావించి కీపర్ వైపు చూడకుండానే ముందుకు వచ్చేశాడు. జానీ బెయిర్‌స్టో క్రీజు దాటడాన్ని గమనించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, వికెట్లవైపు త్రో వేశాడు. అది తగలడంతో ఆస్ట్రేలియా వికెట్ కోసం అప్పీల్ చేసింది. రన్ తీయాలనే ఉద్దేశంతో జానీ బెయిర్‌స్టో క్రీజు దాటలేదు. ఓవర్ అయిపోయిందని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో మాట్లాడాలని ముందుకు నడుచుకుంటూ వచ్చేశాడు. వెనకాల ఏం జరిగిందో కూడా తెలియని జానీ బెయిర్‌స్టో, అవుట్ కోసం అప్పీల్ చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక తెల్లమొహం వేశాడు. థర్డ్ అంపైర్ ఔట్ అని ఇవ్వడంతో చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు.
చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు
'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment