Merylbon cricket club
-
'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి'
ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు పలు ఆసక్తికర ప్రతిపాదనలు చేసింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండో టెస్టుకు ముందు వరల్డ్ క్రికెట్ కమిటీ రెండు రోజులు సమావేశమైంది. ఈ సమావేశంలో టెస్టు క్రికెట్ సహా మహిళల క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడంపై చర్చించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వన్డే సిరీస్ మ్యాచ్‌లను గణనీయంగా తగ్గించాలంటూ ఐసీసీకి ప్రతిపాదన పంపింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ గాటింగ్ ఆధ్వర్యంలో లార్డ్స్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలోకమిటీ మెంబర్లు సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి, జస్టిన్ లాంగర్, ఇయాన్ మోర్గాన్, కుమార సంగక్కర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్(FTP)పై ఐసీసీకి పలు సిఫార్సులు చేసింది. 2027 తర్వాత పురుషుల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP)లో ఆతిథ్య, టూర్లకు వచ్చే పూర్తి సభ్య దేశాలన్నింటికీ మ్యాచ్‌ల సమాన షెడ్యూల్‌ని నిర్ధారించాలని ఐసీసీని కోరింది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ పూర్తయిన తర్వాత వన్డే మ్యాచ్‌లను గణనీయంగా తగ్గించాలని సూచించింది. ప్రతి ప్రపంచకప్‌కు ముందు ఒక సంవత్సరం వ్యవధి మినహా ద్వైపాక్షిక మ్యాచ్‌లను పరిమితం చేయడం ద్వారా వన్డే క్రికెట్ నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. "ఈ కారణంగా ప్రపంచ క్రికెట్ క్యాలెండర్లో మనకు కావాల్సిన స్పేస్ దొరుకుతుంది. " అని WCC తెలిపింది. ఇటీవలే ప్రపంచ క్రికెట్ పాలక మండలి(WCC) రాబోయే సంవత్సరాల్లో జరిగే అన్ని గ్లోబల్ ఈవెంట్ల కోసం వారి మీడియా హక్కులను రికార్డ్ స్థాయిలో విక్రయించింది. The MCC World Cricket committee has proposed strategic funds for Test cricket and the women’s game to drive transformative change for the global game. More information ⤵️#CricketTwitter — Marylebone Cricket Club (@MCCOfficial) July 11, 2023 చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్ Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఆసీస్ జట్టుకు నేరుగా గెలవడం చేతగాక ఇలా చీటింగ్ చేసి గెలవాలని చూసిందంటూ ఇంగ్లండ్ అభిమానులు ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. నిజానికి బెయిర్ స్టో ఔట్ సరైనదే. బంతి డెడ్ కాకముందే క్రీజులో నుంచి బయటికి వెళ్లి మాట్లాడడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ వికెట్ల వైపు బంతిని వేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అయితే దీన్ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా పేర్కొంటూ ఆస్ట్రేలియా టీమ్‌పై విమర్శలు చేశారు ఇంగ్లీష్ అభిమానులు. ఐదో రోజు మొదటి సెషన్ ముగిసిన అనంతరం లార్డ్స్ లాంగ్ రూమ్‌లో ఉన్న కొందరు ఎంసీసీ సభ్యులు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లను బూతులు తిట్టారు. వీరితో ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ వాగ్వాదానికి దిగారు. సాధారణంగా మిగిలిన క్రికెట్ గ్రౌండ్లో క్రికెటర్లు, డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లే దారిలో వేరే వాళ్లు ఉండడానికి, కూర్చోవడానికి అవకాశం ఉండదు. అయిలే లార్డ్స్‌లో మాత్రం లాంగ్ రూమ్ పేరుతో ఎంసీసీ సభ్యుల కోసం ఓ లాంగ్ రూమ్ ఉంటుంది. ఇందులో మెర్లీబోన్ క్రికెట్ క్లబ్, మిడిల్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. వీళ్లు వీవీఐపీల హోదాల లాంగ్ రూమ్‌లో కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచే ఇరుజట్ల క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కొంతమంది ప్రతినిధులు ఉస్మాన్ ఖవాజాతో గొడవపడ్డారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ ప్రతినిధులను వారించాల్సింది పోయి ఉస్మాన్ ఖవాజాను బలవంతంగా తోసేశారు. ఆ తర్వాత వార్నర్‌ను కూడా టార్గెట్ చేయడంతో తాను కూడా ఏం తగ్గలేదు. అయితే వివాదం మరింత ముదురుతుందేమోనని సెక్యూరిటీ వచ్చి వార్నర్‌ను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. దీనిపై ఉస్మాన్ ఖవాజా స్పందించాడు. ''ఇది నిజంగా చాలా నిరుత్సాహపరిచింది. వాళ్లు మమ్మల్ని బూతులు తిట్టారు. ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. అందుకే నేను వాళ్లను నిలదీశా.. వాళ్లలో కొందరు మాపై నిందలు వేశారు. ఇది మమ్మల్ని అవమానించడమే.. ఎంసీసీ మెంబర్స్ నుంచి ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు'' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంసీసీ ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ కోరుతూ బహిరంగ లేఖను విడుదల చేసింది.''ఆస్ట్రేలియా క్రికెట్‌కు, ఉస్మాన్ ఖవాజా, వార్నర్‌లకు క్షమాపణలు. అమర్యాదగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దురుసుగా ప్రవర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.గ్రౌండ్లో జరిగిన విషయాన్ని నిలదీస్తే అధికారం బయటివాళ్లకు లేదు. అది వాళ్లకు సంబంధం లేని విషయం.'' అంటూ ప్రకటన విడుదల చేసింది. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 MCC Statement.#Ashes pic.twitter.com/fWYdzx1uhD — Marylebone Cricket Club (@MCCOfficial) July 2, 2023 జరిగింది ఇదీ.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని వదిలేసిన జానీ బెయిర్‌స్టో, ఓవర్ అయిపోయిందని భావించి కీపర్ వైపు చూడకుండానే ముందుకు వచ్చేశాడు. జానీ బెయిర్‌స్టో క్రీజు దాటడాన్ని గమనించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, వికెట్లవైపు త్రో వేశాడు. అది తగలడంతో ఆస్ట్రేలియా వికెట్ కోసం అప్పీల్ చేసింది. రన్ తీయాలనే ఉద్దేశంతో జానీ బెయిర్‌స్టో క్రీజు దాటలేదు. ఓవర్ అయిపోయిందని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో మాట్లాడాలని ముందుకు నడుచుకుంటూ వచ్చేశాడు. వెనకాల ఏం జరిగిందో కూడా తెలియని జానీ బెయిర్‌స్టో, అవుట్ కోసం అప్పీల్ చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక తెల్లమొహం వేశాడు. థర్డ్ అంపైర్ ఔట్ అని ఇవ్వడంతో చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
ధోని, యువరాజ్లకు అరుదైన గౌరవం
భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలతో పాటు భారత మహిళా క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వీరికి లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇచ్చి సత్కరించింది. వీరితో పాటు మరో 14 మంది పురుష, మహిళా క్రికెట్ దిగ్గజాలకు కూడా ఎంసీసీ జీవితకాల సభ్యత్వాన్ని అందించి గౌరవించుకుంది. భారత క్రికెట్ దిగ్గజాలతో పాటు వెస్టిండీస్‌కు చెందిన మెరిస్సా అగ్యూలైరా, ఇంగ్లండ్‌కు చెందిన జెన్నీ గన్, లారా మార్ష్, ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, అన్యా శ్రుబ్సోల్, పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ హఫీజ్, ఆస్ట్రేలియాకు చెందిన రేచల్ హేన్స్, బంగ్లాదేశ్‌కు చెందిన ముష్రఫే మోర్తాజా, న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టేలర్, ఆమీ సాటరెత్‌వైట్, సౌతాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్‌లను ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇచ్చి గౌరవించింది. ఈ వివరాలను ఎంసీసీ సీఈఓ, సెక్రెటరీ గుయ్ లావెండర్ ఇవాళ (ఏప్రిల్ 5) అధికారికంగా ప్రకటించారు. కాగా, ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్షిప్ అందుకున్న ధోని, యువరాజ్, రైనా భారత్ 2011 వన్డే వరల్డ్‌కప్ సాధించిన జట్టులో సభ్యులు కాగా.. మిథాలీ రాజ్ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు (7805) సాధించిన బ్యాటర్‌గా, ఝులన్ గోస్వామి వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా బౌలర్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎంసీసీ చివరిసారిగా లైఫ్ టైమ్ మెంబర్‌షిప్‌లను 2021 అక్టోబర్‌లో ప్రకటించింది. నాడు ఇంగ్లండ్‌కు చెందిన అలిస్టర్ కుక్, సౌతాఫ్రికాకు చెందిన జాక్ కల్లిస్, భారత్‌కు చెందిన హర్భజన్ సింగ్‌లతో పాటు మరో 15 మందికి ఈ గౌరవం దక్కింది. -
'డొమెస్టిక్ లీగ్స్ వల్ల ప్రమాదంలో ఐసీసీ గ్లోబల్ క్రికెట్'
ప్రస్తుతం క్రికెట్లో అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే లీగ్‌ల పేరుతో ఆయా దేశాలు నిర్వహిస్తున్న టోర్నీ మ్యాచ్‌లు ఎక్కువైపోయాయి. విరివిగా పుట్టుకొస్తున్న డొమెస్టిక్ లీగ్‌ల వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రమాదం పొంచి ఉందని.. దానిని కాపాడుకోవాలని క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పేర్కొంది. ఇప్పటికే ఐపీఎల్, బీబీఎల్, పీఎస్ఎల్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ అంటూ చాలా డొమొస్టిక్స్ లీగ్ ఉండగా.. కొత్తగా సౌతాఫ్రికా టి20(SAT20), ఇంటర్నేషనల్ లీగ్ టి20(ILT20) పుట్టుకొచ్చాయని.. వీటివల్ల క్రికెట్లో సంప్రదాయ ఫార్మాట్ టెస్టు క్రికెట్ సహా అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రమాదం ఉందని వెల్లడించింది. అంతేకాదు ఈ లీగ్‌ల వల్ల ఐసీసీ నిర్వహిస్తున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. ఈ లీగ్‌ల్లో అగ్రభాగం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లకే చెందినవే ఉన్నాయని.. ఆయా దేశాల్లో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ డొమెస్టిక్ లీగ్స్ వల్ల ఐసీసీలో భాగమైన అసోసియేట్ దేశాలు సహా అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లు నష్టపోతున్నాయని తెలిపింది. దుబాయ్ వేదికగా వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)తో ఎంసీసీ శుక్రవారం భేటీ అయింది. చర్చలో భాగంగానే డొమెస్టిక్ లీగ్‌లను కట్టడి చేస్తే మంచిదని అభిప్రాయపడింది. 2023 నుంచి 2027 వరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ పేరుతో షెడ్యూల్‌ను రూపొందించింది. అంతర్జాతీయ క్రికెట్‌తోనే బిజీగా గడిపే క్రికెటర్లు.. ఆయా లీగ్స్ ఆడుతూ గాయాల పాలయ్యి కీలక సమయాల్లో జట్టుకు దూరమవుతున్నారని తెలిపింది. అందుకు ఉదాహరణ జస్ప్రీత్ బుమ్రా, షాహిన్ అఫ్రిది లాంటి క్రికెటర్లు. ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు, డొమెస్టిక్ లీగ్ క్రికెట్ మధ్య ఓవర్లాప్ ఏర్పడి సమస్య మొదలవుతుందని వివరించింది. ఈ ఏడాదిలో ఒక్క అక్టోబర్-నవంబర్ నెలలు మాత్రమే గ్యాప్ ఏర్పడిందని.. ఆ గ్యాప్‌కు కారణం కూడా ఐసీసీ వన్డే ప్రపంచకప్ నిర్వహించనుండడమే. ఈ సమయంలో అన్ని దేశాలు తమ అత్యున్నత జట్లతో బరిలోకి దిగుతాయి కాబట్టి ఎలాంటి డొమెస్టిక్ లీగ్స్‌కు ఆస్కారం ఉండదని తెలిపింది. పురుషుల క్రికెట్లో మాత్రమే ఇలా ఉందని.. మహిళల క్రికెట్లో ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్ సక్రమంగానే అమలవుతుందని ఎంసీసీ అభిప్రాయపడింది. 2025 వరకు ఐసీసీ ఇప్పటికే వుమెన్స్‌కు సంబంధించిన ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. అయితే ఇప్పుడిప్పుడే మహిళల క్రికెట్లో విరివిగా డొమెస్టిక్ లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా డొమెస్టిక్ లీగ్‌లతో ఐసీసీ గ్లోబల్ క్రికెట్‌కు ముప్పు వాటిల్లకుండా బ్యాలెన్సింగ్ చేసుకోవాలని ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)ని అభ్యర్జించింది. ఎంసీసీ వ్యాఖ్యలపై వరల్డ్ క్రికెట్ కమిటీ సానుకూలంగా స్పందించింది. డబ్ల్యూసీసీ సభ్యుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ''ఐసీసీ గ్లోబల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్ల మధ్య బ్యాలెన్సింగ్ అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికి టెస్టు క్రికెట్ అనేది బిగ్గెస్ట్ ఫ్లాట్‌ఫామ్‌గా ఉంది. ఆ ఫార్మాట్లోనే మనకు ఆణిముత్యాలాంటి క్రికెటర్లు దొరుకుతుంటారు. ఎన్నో గొప్ప మ్యాచ్‌లు చూస్తుంటాం. అందుకే దానిని టెస్టు క్రికెట్ అంటారు. ఎంసీసీ చేసిన వ్యాఖ్యలను అంగీకరిస్తున్నా. డొమెస్టిక్ లీగ్ నిర్వహిస్తున్న ఆయా దేశాలు అటు ఐసీసీ గ్లోబల్ క్రికెట్‌కు, ఇటు డొమొస్టిక్ లీగ్‌లకు సమాన ప్రాధాన్యత ఇస్తాయని అనుకుంటున్నా.'' అని తెలిపాడు. మరో సభ్యుడు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''డొమెస్టిక్ క్రికెట్‌కు, ఐసీసీ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది. ఐసీసీలో దేశం తరపున ఆడితే.. డొమెస్టిక్‌లో వివిధ దేశాల ఆటగాళ్లు ఒకే పంచన ఉంటారు. అయితే నా పరిదిలో అంతర్జాతీయ క్రికెట్లోనే ఒక ఆటగాడు ఎక్కువగా రాణించడం చూస్తాం. ఉదాహరణకు క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలు ఘనత.. మురళీధరన్ 800 టెస్టు వికెట్ల ఘనతలను అంతర్జాతీయ క్రికెట్లోనే చూశాం. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. సమన్వయంతో కూడిన క్రికెట్‌ను ఆడడం మంచింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. The MCC World Cricket committee unanimously concluded that the game has reached an important crossroads. They recommended urgent intervention from the game’s leaders to ensure international and franchise cricket can thrive together harmoniously. #CricketTwitter — Marylebone Cricket Club (@MCCOfficial) March 9, 2023 చదవండి: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం BGT: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్.. సిగ్గుపడాలి! అయినా ప్రతిదానికీ.. -
అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా
క్రికెట్లో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో ఈ రూల్స్ తొలిసారి అమలు కానున్నాయి. క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) గత మార్చిలోనే మన్కడింగ్ సహా పలు అంశాలపై నూతన చట్ట సవరణలు తీసుకొచ్చింది. వీటికి ఐసీసీ కూడా గతంలోనే ఆమోద ముద్ర వేసింది. అయితే అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తామని ఐసీసీ పేర్కొంది. కాగా మన్కడింగ్ అనే పదం ఇక క్రికెట్లో చట్టబద్ధం అని ఎంసీసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. బౌలింగ్ వేసే సమయంలో బంతి బౌలర్ చేతి నుంచి విడుదల కాకముందే నాన్‌స్ట్రయిక్ బ్యాటర్ పరుగు పెడితే బౌలర్ వికెట్లను గిరాటేయడమే మన్కడింగ్. ఐపీఎల్లో బట్లర్‌ను అశ్విన్ ఇలా అవుట్ చేస్తే పాశ్చత్య క్రికెటర్లు అతనిపై ధ్వజమెత్తారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని నానాయాగీ చేశారు. క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కాదని పేర్కొంది. అక్టోబర్ ఒకటి నుంచి అమలు కానున్న రూల్స్ ఇవే.. ఉమ్మిపై నిషేధం ►బంతిని మెరిసేలా చేసేందుకు బౌలర్లు ఉమ్మి రాయడం తెలిసిందే. అయితే ఇటీవల కోవిడ్ వల్ల బంతికి ఉమ్మిరాయ రాదు అని ఓ నిషేధాన్ని విధించారు. తాత్కాలికంగా రెండేళ్ల పాటు ఆ నిషేధం కొనసాగింది. అయితే ఇప్పుడు ఆ నిషేధాన్ని పర్మినెంట్ చేసేశారు. ఉమ్మి బదులుగా ఇటీవల ప్లేయర్లు.. చెమటతో బంతిని మెరిసేలా చేస్తున్నారు. ఆ ఫార్ములా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ►క్యాచ్ అవుట్ అయిన బ్యాటర్ సగం పిచ్ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్ చేయాలి. ఓవర్ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్ దాటిన నెపంతో నాన్ స్ట్రయికర్ బ్యాటింగ్ చేయడానికి వీలులేదు. ►ఫీల్డింగ్ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్ భారీషాట్ ఆడినపుడు బ్యాటింగ్ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. A host of important changes to the Playing Conditions that come into effect at the start of next month 👀https://t.co/4KPW2mQE2U — ICC (@ICC) September 20, 2022 చదవండి: T20 World Cup 2022: టి20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన కివీస్ అర్ష్‌దీప్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! -
మన్కడింగ్‌పై నిషేదం.. విండీస్ దిగ్గజ బ్యాటర్ సంచలన వ్యాఖ్యలు
మన్కడింగ్‌ను నిషేధించడంతో పాటు క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్‌కు రావడం, బంతికి లాలాజలాన్ని పూయడం వంటి పలు క్రికెట్ చట్టాలను మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇటీవలే సవరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టాలపై దిగ్గజ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఎంసీసీ నిబంధనలను స్వాగతించగా, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రం ఎంసీసీ కొత్త నిబంధనలపై విమర్శలు గుప్పించాడు. మన్కడింగ్‌ను నిషేదించడంపై లారా స్పందిస్తూ.. బౌలర్ బంతి విసిరే క్రమంలో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ పరుగు కోసం క్రీజ్‌ను వదలడం సహజమేనని, అలాంటి తరుణంలో బౌలర్ బెయిల్స్‌ను పడగొట్టి ఔట్‌కు అప్పీల్ చేయడం (ఈ తరహా రనౌట్ అప్పీల్‌ను మన్కడింగ్ అంటారు) క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఎంసీసీ తాజాగా ఇలాంటి అప్పీల్స్‌కు చట్టబద్దత కల్పిస్తూ రనౌట్‌గా పరిగణించడం ఎంత మాత్రం సబబు కాదని మండిపడ్డాడు. లారాకు ముందు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా ఎంసీసీ నూతన నిబంధనలపై ధ్వజమెత్తాడు. క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్‌కు రావడం అనే రూల్‌పై నీషమ్ స్పందిస్తూ.. ఎంసీసీ ఈ అనవసర నిబంధన ఎందుకు అమల్లోకి తేవాలనుకుంటుందో అర్థం కావడం లేదని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే, మన్కడింగ్‌ను నిషేదిస్తూ ఎంసీసీ తీసుకున్న నిర్ణయంపై భారత క్రికెటర్లు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ పేరుతో ఈ తరహా రనౌట్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంసీసీ మన్కడ్ పేరుతో చలామణి అవుతున్న మన్కడింగ్ పదాన్ని నిషేధించి, ఆ తరహా ఔట్‌ను సాధారణ రనౌట్‌గా పరిగణించాలని నిర్ణయించింది. చదవండి: కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ స్పిన్ మాంత్రికుడికి కడసారి వీడ్కోలు -
మన్కడింగ్ తప్పుకాదు: ఐసీసీ
లండన్: మన్కడింగ్ గుర్తుందిగా..! బౌలింగ్ వేసే సమయంలో బంతి బౌలర్ చేతి నుంచి విడుదల కాకముందే నాన్‌స్ట్రయిక్ బ్యాటర్ పరుగు పెడితే బౌలర్ వికెట్లను గిరాటే వేయడమే మన్కడింగ్. ఐపీఎల్లో బట్లర్‌ను అశ్విన్ ఇలా అవుట్ చేస్తే పాశ్చత్య క్రికెటర్లు అతనిపై ధ్వజమెత్తారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని నానాయాగీ చేశారు. ఇప్పుడు క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కానే కాదిపుడు. ఎంసీసీ చేసిన పలు సవరణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమలవుతాయి. ఎంసీసీ సవరణలివి... ►సలైవా (ఉమ్ము), చెమటతో బంతిని రుద్దడం పూర్తిగా నిషిద్ధం. కరోనా వల్ల ఇప్పుడైతే చెమట, ఉమ్ముతో బంతిని షైన్ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇకపైనా కుదరదు. ►క్యాచ్ అవుట్ అయిన బ్యాటర్ సగం పిచ్ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్ చేయాలి. ఓవర్ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్ దాటిన నెపంతో నాన్ స్ట్రయికర్ బ్యాటింగ్ చేయడానికి వీలులేదు. ►ఫీల్డింగ్ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్ భారీషాట్ ఆడినపుడు బ్యాటింగ్ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. చదవండి: IPL 2022: అఫ్గన్ ఆటగాడికి బంపరాఫర్.. ఇక సాహాకు కష్టమే Aus Vs Pak: టెస్టుల్లో చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా! -
క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పు.. ఇకపై వారిని అలా పిలువరాదు
లండన్: క్రికెట్లో లింగభేదానికి తావు లేకుండా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పురుష క్రికెటర్లను మాత్రమే సంబోధించే బ్యాట్స్‌మన్ అన్న పదాన్ని తొలగించి మహిళలు, పురుషులకు కామన్‌గా వర్తించేలా బ్యాటర్ అన్న పదాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బుధవారం ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ ప్రతిపాదన ఎంసీసీ పరిశీలనలో ఉండగా.. తాజాగా ఆమోదించబడింది. లింగభేదం లేని పదాన్ని ఉపయోగించడం వల్ల క్రికెట్ అందరి క్రీడ అని మరోసారి నిరూపించబడుతుందని ఎంసీసీ విశ్వసిస్తోంది. లింగభేదం లేని పదాలు వాడటం వల్ల మరింత మంది మహిళలు క్రికెట్ పట్ల ఆకర్షితులవుతారని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, క్రికెట్‌కు సంబంధించి లింగభేదానికి ఆస్కారముండే థర్డ్ మ్యాన్, నైట్ వాచ్‌మన్, జెంటిల్మెన్ వంటి పదాలపై ఎంసీసీ ఎలాంటి కామెంట్లు చేయకపోవడం విశేషం. చదవండి: కెప్టెన్సీ విషయంలో వారిద్దరికీ పట్టిన గతే కోహ్లికి కూడా పట్టవచ్చు..! -
లక్ష్మణ్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం
హైదరాబాద్: భారత సొగసరి మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వీవీఎస్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని అందజేసింది. ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్ లక్ష్మణ్ కాగా ఇంతకుముందే సచిన్, ద్రవిడ్, గంగూలీ, జహీర్ ఖాన్లు ఎంసీసీలో సభ్యులుగా ఉన్నారు. ‘ప్రఖ్యాతిగాంచిన క్రికెట్ క్లబ్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం’ అని వీవీఎస్ ఆనందం వ్యక్తం చేశారు. 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన లక్ష్మణ్ 134 టెస్టులు, 86 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 45.97 సగటుతో 8,781 పరుగులు... వన్డేల్లో 30.76 సగటుతో 2,338 పరుగులు సాధించాడు.