ప్రస్తుతం క్రికెట్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే లీగ్‌ల పేరుతో ఆయా దేశాలు నిర్వహిస్తున్న టోర్నీ మ్యాచ్‌లు ఎక్కువైపోయాయి. విరివిగా పుట్టుకొస్తున్న డొమెస్టిక్ లీగ్‌ల వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రమాదం పొంచి ఉందని.. దానిని కాపాడుకోవాలని క్రికెట్‌లో చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పేర్కొంది.
ఇప్పటికే ఐపీఎల్, బీబీఎల్, పీఎస్‌ఎల్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ అంటూ చాలా డొమొస్టిక్స్ లీగ్ ఉండగా.. కొత్తగా సౌతాఫ్రికా టి20(SAT20), ఇంటర్నేషనల్ లీగ్ టి20(ILT20) పుట్టుకొచ్చాయని.. వీటివల్ల క్రికెట్‌లో సంప్రదాయ ఫార్మాట్ టెస్టు క్రికెట్ సహా అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రమాదం ఉందని వెల్లడించింది.
అంతేకాదు ఈ లీగ్‌ల వల్ల ఐసీసీ నిర్వహిస్తున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. ఈ లీగ్‌ల్లో అగ్రభాగం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లకే చెందినవే ఉన్నాయని.. ఆయా దేశాల్లో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ డొమెస్టిక్ లీగ్స్ వల్ల ఐసీసీలో భాగమైన అసోసియేట్ దేశాలు సహా అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లు నష్టపోతున్నాయని తెలిపింది.
దుబాయ్ వేదికగా వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)తో ఎంసీసీ శుక్రవారం భేటీ అయింది. చర్చలో భాగంగానే డొమెస్టిక్ లీగ్‌లను కట్టడి చేస్తే మంచిదని అభిప్రాయపడింది. 2023 నుంచి 2027 వరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ పేరుతో షెడ్యూల్‌ను రూపొందించింది. అంతర్జాతీయ క్రికెట్‌తోనే బిజీగా గడిపే క్రికెటర్లు.. ఆయా లీగ్స్ ఆడుతూ గాయాల పాలయ్యి కీలక సమయాల్లో జట్టుకు దూరమవుతున్నారని తెలిపింది. అందుకు ఉదాహరణ జస్‌ప్రీత్ బుమ్రా, షాహిన్ అఫ్రిది లాంటి క్రికెటర్లు.
ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు, డొమెస్టిక్ లీగ్ క్రికెట్ మధ్య ఓవర్‌లాప్ ఏర్పడి సమస్య మొదలవుతుందని వివరించింది. ఈ ఏడాదిలో ఒక్క అక్టోబర్-నవంబర్ నెలలు మాత్రమే గ్యాప్ ఏర్పడిందని.. ఆ గ్యాప్‌కు కారణం కూడా ఐసీసీ వన్డే ప్రపంచకప్ నిర్వహించనుండడమే. ఈ సమయంలో అన్ని దేశాలు తమ అత్యున్నత జట్లతో బరిలోకి దిగుతాయి కాబట్టి ఎలాంటి డొమెస్టిక్ లీగ్స్‌కు ఆస్కారం ఉండదని తెలిపింది.
పురుషుల క్రికెట్‌లో మాత్రమే ఇలా ఉందని.. మహిళల క్రికెట్‌లో ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్ సక్రమంగానే అమలవుతుందని ఎంసీసీ అభిప్రాయపడింది. 2025 వరకు ఐసీసీ ఇప్పటికే వుమెన్స్‌కు సంబంధించిన ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. అయితే ఇప్పుడిప్పుడే మహిళల క్రికెట్‌లో విరివిగా డొమెస్టిక్ లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా డొమెస్టిక్ లీగ్‌లతో ఐసీసీ గ్లోబల్ క్రికెట్‌కు ముప్పు వాటిల్లకుండా బ్యాలెన్సింగ్ చేసుకోవాలని ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)ని అభ్యర్జించింది.
ఎంసీసీ వ్యాఖ్యలపై వరల్డ్ క్రికెట్ కమిటీ సానుకూలంగా స్పందించింది. డబ్ల్యూసీసీ సభ్యుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ''ఐసీసీ గ్లోబల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్‌ల మధ్య బ్యాలెన్సింగ్ అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికి టెస్టు క్రికెట్ అనేది బిగ్గెస్ట్ ఫ్లాట్‌ఫామ్‌గా ఉంది. ఆ ఫార్మాట్‌లోనే మనకు ఆణిముత్యాలాంటి క్రికెటర్లు దొరుకుతుంటారు. ఎన్నో గొప్ప మ్యాచ్‌లు చూస్తుంటాం. అందుకే దానిని టెస్టు క్రికెట్ అంటారు. ఎంసీసీ చేసిన వ్యాఖ్యలను అంగీకరిస్తున్నా. డొమెస్టిక్ లీగ్ నిర్వహిస్తున్న ఆయా దేశాలు అటు ఐసీసీ గ్లోబల్ క్రికెట్‌కు, ఇటు డొమొస్టిక్ లీగ్‌లకు సమాన ప్రాధాన్యత ఇస్తాయని అనుకుంటున్నా.'' అని తెలిపాడు.
మరో సభ్యుడు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''డొమెస్టిక్ క్రికెట్‌కు, ఐసీసీ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది. ఐసీసీలో దేశం తరపున ఆడితే.. డొమెస్టిక్‌లో వివిధ దేశాల ఆటగాళ్లు ఒకే పంచన ఉంటారు. అయితే నా పరిదిలో అంతర్జాతీయ క్రికెట్‌లోనే ఒక ఆటగాడు ఎక్కువగా రాణించడం చూస్తాం. ఉదాహరణకు క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలు ఘనత.. మురళీధరన్ 800 టెస్టు వికెట్ల ఘనతలను అంతర్జాతీయ క్రికెట్‌లోనే చూశాం. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. సమన్వయంతో కూడిన క్రికెట్‌ను ఆడడం మంచింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
The MCC World Cricket committee unanimously concluded that the game has reached an important crossroads.
— Marylebone Cricket Club (@MCCOfficial) March 9, 2023
They recommended urgent intervention from the game’s leaders to ensure international and franchise cricket can thrive together harmoniously. #CricketTwitter
చదవండి: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం
BGT: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్.. సిగ్గుపడాలి! అయినా ప్రతిదానికీ..
Comments
Please login to add a commentAdd a comment