world cricket
-
ఇప్పుడు హసరంగా.. మొన్న హేల్స్! ప్రపంచ క్రికెట్లో అసలేం జరుగుతోంది?
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా ఇటీవల టెస్టుక్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. వైట్ బాల్ ఫార్మాట్లపై దృష్టి సారించేందుకు హసరంగా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అయితే హసరంగా నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తప్పుబట్టాడు. హసరంగాపై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టు క్రికెట్ ఆడడం తనకుకు ఇష్టం లేదని హసరంగా బహిరంగంగా చెప్పాడు. అతడికి కేవలం 26 ఏళ్ల మాత్రమే. ఈ వయస్సులో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమా? అలెక్స్ హేల్స్ ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అంతకుముందు ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఏం జరుగుతోంది? అంటూ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నించాడు. ఇక హసరంగా వైట్‌బాల్ కెరీర్ గురించి చోప్రా మాట్లాడుతూ.. అతడు టీ20 క్రికెట్లో అద్బుతమైన అనడంలో ఎటువంటి సందేహం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంకకు అతడు కీలకం. అయితే టెస్టు క్రికెట్లో ఆడకుండా వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టిపెడతనడం సరికాదని చెప్పుకొచ్చాడు. ఇక 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్లో కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు సాధించాడు. చదవండి: CPL 2023: విండీస్ బ్యాటర్ భారీ సిక్సర్.. దెబ్బకు పాక్ బౌలర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి'
ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు పలు ఆసక్తికర ప్రతిపాదనలు చేసింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండో టెస్టుకు ముందు వరల్డ్ క్రికెట్ కమిటీ రెండు రోజులు సమావేశమైంది. ఈ సమావేశంలో టెస్టు క్రికెట్ సహా మహిళల క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడంపై చర్చించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వన్డే సిరీస్ మ్యాచ్‌లను గణనీయంగా తగ్గించాలంటూ ఐసీసీకి ప్రతిపాదన పంపింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ గాటింగ్ ఆధ్వర్యంలో లార్డ్స్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలోకమిటీ మెంబర్లు సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి, జస్టిన్ లాంగర్, ఇయాన్ మోర్గాన్, కుమార సంగక్కర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్(FTP)పై ఐసీసీకి పలు సిఫార్సులు చేసింది. 2027 తర్వాత పురుషుల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP)లో ఆతిథ్య, టూర్లకు వచ్చే పూర్తి సభ్య దేశాలన్నింటికీ మ్యాచ్‌ల సమాన షెడ్యూల్‌ని నిర్ధారించాలని ఐసీసీని కోరింది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ పూర్తయిన తర్వాత వన్డే మ్యాచ్‌లను గణనీయంగా తగ్గించాలని సూచించింది. ప్రతి ప్రపంచకప్‌కు ముందు ఒక సంవత్సరం వ్యవధి మినహా ద్వైపాక్షిక మ్యాచ్‌లను పరిమితం చేయడం ద్వారా వన్డే క్రికెట్ నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. "ఈ కారణంగా ప్రపంచ క్రికెట్ క్యాలెండర్లో మనకు కావాల్సిన స్పేస్ దొరుకుతుంది. " అని WCC తెలిపింది. ఇటీవలే ప్రపంచ క్రికెట్ పాలక మండలి(WCC) రాబోయే సంవత్సరాల్లో జరిగే అన్ని గ్లోబల్ ఈవెంట్ల కోసం వారి మీడియా హక్కులను రికార్డ్ స్థాయిలో విక్రయించింది. The MCC World Cricket committee has proposed strategic funds for Test cricket and the women’s game to drive transformative change for the global game. More information ⤵️#CricketTwitter — Marylebone Cricket Club (@MCCOfficial) July 11, 2023 చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్ Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
వరల్డ్ క్రికెట్లో రోహిత్ టైగర్.. అతడిని మించినవారు లేరు: ఆసీస్ లెజెండ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో పాటు ఇటీవలే ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా అతడు జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియా మేజర్ టోర్నీల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ (2022), డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడి సారధ్యంలోని భారత జట్టు దారుణ పరాజయాలు మూటుగట్టుకుంది. ఈ క్రమంలో అతడి వ్యక్తిగత ప్రదర్శనపైనే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా రోహిత్‌పై చాలా మంది మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ మాత్రం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. రోహిత్‌పై బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా అతడు వరల్డ్ క్రికెట్ లో టైగర్ అని బ్రెట్‌లీ కొనియాడాడు. "ప్రపంచ క్రికెట్లో రోహిత్ శర్మ టైగర్. షార్ట్ బాల్స్‌ను ఆడటంలో అతడిని మించినవారు లేరు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా బౌలర్లపై ఎటాక్ చేసే సత్తా ఉన్న ఏకైక క్రికెటర్ రోహిత్. ప్రపంచంలో పుల్ షాట్లు ఆడే అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. మైదానంలో గాని ఆఫ్‌ధి ఫీల్డ్‌లో గాని రోహిత్ ఒక జెంటిల్‌మేన్. అతడు చాలా కూల్‌గా ఉంటాడు అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. చదవండి: MS Dhoni: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. -
'డొమెస్టిక్ లీగ్స్ వల్ల ప్రమాదంలో ఐసీసీ గ్లోబల్ క్రికెట్'
ప్రస్తుతం క్రికెట్లో అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే లీగ్‌ల పేరుతో ఆయా దేశాలు నిర్వహిస్తున్న టోర్నీ మ్యాచ్‌లు ఎక్కువైపోయాయి. విరివిగా పుట్టుకొస్తున్న డొమెస్టిక్ లీగ్‌ల వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రమాదం పొంచి ఉందని.. దానిని కాపాడుకోవాలని క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పేర్కొంది. ఇప్పటికే ఐపీఎల్, బీబీఎల్, పీఎస్ఎల్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ అంటూ చాలా డొమొస్టిక్స్ లీగ్ ఉండగా.. కొత్తగా సౌతాఫ్రికా టి20(SAT20), ఇంటర్నేషనల్ లీగ్ టి20(ILT20) పుట్టుకొచ్చాయని.. వీటివల్ల క్రికెట్లో సంప్రదాయ ఫార్మాట్ టెస్టు క్రికెట్ సహా అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రమాదం ఉందని వెల్లడించింది. అంతేకాదు ఈ లీగ్‌ల వల్ల ఐసీసీ నిర్వహిస్తున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. ఈ లీగ్‌ల్లో అగ్రభాగం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లకే చెందినవే ఉన్నాయని.. ఆయా దేశాల్లో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ డొమెస్టిక్ లీగ్స్ వల్ల ఐసీసీలో భాగమైన అసోసియేట్ దేశాలు సహా అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లు నష్టపోతున్నాయని తెలిపింది. దుబాయ్ వేదికగా వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)తో ఎంసీసీ శుక్రవారం భేటీ అయింది. చర్చలో భాగంగానే డొమెస్టిక్ లీగ్‌లను కట్టడి చేస్తే మంచిదని అభిప్రాయపడింది. 2023 నుంచి 2027 వరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ పేరుతో షెడ్యూల్‌ను రూపొందించింది. అంతర్జాతీయ క్రికెట్‌తోనే బిజీగా గడిపే క్రికెటర్లు.. ఆయా లీగ్స్ ఆడుతూ గాయాల పాలయ్యి కీలక సమయాల్లో జట్టుకు దూరమవుతున్నారని తెలిపింది. అందుకు ఉదాహరణ జస్ప్రీత్ బుమ్రా, షాహిన్ అఫ్రిది లాంటి క్రికెటర్లు. ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు, డొమెస్టిక్ లీగ్ క్రికెట్ మధ్య ఓవర్లాప్ ఏర్పడి సమస్య మొదలవుతుందని వివరించింది. ఈ ఏడాదిలో ఒక్క అక్టోబర్-నవంబర్ నెలలు మాత్రమే గ్యాప్ ఏర్పడిందని.. ఆ గ్యాప్‌కు కారణం కూడా ఐసీసీ వన్డే ప్రపంచకప్ నిర్వహించనుండడమే. ఈ సమయంలో అన్ని దేశాలు తమ అత్యున్నత జట్లతో బరిలోకి దిగుతాయి కాబట్టి ఎలాంటి డొమెస్టిక్ లీగ్స్‌కు ఆస్కారం ఉండదని తెలిపింది. పురుషుల క్రికెట్లో మాత్రమే ఇలా ఉందని.. మహిళల క్రికెట్లో ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్ సక్రమంగానే అమలవుతుందని ఎంసీసీ అభిప్రాయపడింది. 2025 వరకు ఐసీసీ ఇప్పటికే వుమెన్స్‌కు సంబంధించిన ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. అయితే ఇప్పుడిప్పుడే మహిళల క్రికెట్లో విరివిగా డొమెస్టిక్ లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా డొమెస్టిక్ లీగ్‌లతో ఐసీసీ గ్లోబల్ క్రికెట్‌కు ముప్పు వాటిల్లకుండా బ్యాలెన్సింగ్ చేసుకోవాలని ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)ని అభ్యర్జించింది. ఎంసీసీ వ్యాఖ్యలపై వరల్డ్ క్రికెట్ కమిటీ సానుకూలంగా స్పందించింది. డబ్ల్యూసీసీ సభ్యుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ''ఐసీసీ గ్లోబల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్ల మధ్య బ్యాలెన్సింగ్ అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికి టెస్టు క్రికెట్ అనేది బిగ్గెస్ట్ ఫ్లాట్‌ఫామ్‌గా ఉంది. ఆ ఫార్మాట్లోనే మనకు ఆణిముత్యాలాంటి క్రికెటర్లు దొరుకుతుంటారు. ఎన్నో గొప్ప మ్యాచ్‌లు చూస్తుంటాం. అందుకే దానిని టెస్టు క్రికెట్ అంటారు. ఎంసీసీ చేసిన వ్యాఖ్యలను అంగీకరిస్తున్నా. డొమెస్టిక్ లీగ్ నిర్వహిస్తున్న ఆయా దేశాలు అటు ఐసీసీ గ్లోబల్ క్రికెట్‌కు, ఇటు డొమొస్టిక్ లీగ్‌లకు సమాన ప్రాధాన్యత ఇస్తాయని అనుకుంటున్నా.'' అని తెలిపాడు. మరో సభ్యుడు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''డొమెస్టిక్ క్రికెట్‌కు, ఐసీసీ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది. ఐసీసీలో దేశం తరపున ఆడితే.. డొమెస్టిక్‌లో వివిధ దేశాల ఆటగాళ్లు ఒకే పంచన ఉంటారు. అయితే నా పరిదిలో అంతర్జాతీయ క్రికెట్లోనే ఒక ఆటగాడు ఎక్కువగా రాణించడం చూస్తాం. ఉదాహరణకు క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలు ఘనత.. మురళీధరన్ 800 టెస్టు వికెట్ల ఘనతలను అంతర్జాతీయ క్రికెట్లోనే చూశాం. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. సమన్వయంతో కూడిన క్రికెట్‌ను ఆడడం మంచింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. The MCC World Cricket committee unanimously concluded that the game has reached an important crossroads. They recommended urgent intervention from the game’s leaders to ensure international and franchise cricket can thrive together harmoniously. #CricketTwitter — Marylebone Cricket Club (@MCCOfficial) March 9, 2023 చదవండి: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం BGT: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్.. సిగ్గుపడాలి! అయినా ప్రతిదానికీ.. -
బీసీసీఐపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
Pakistan Prime Minister Imran Khan Sensational Comments On BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై పాకిస్థాన్ ప్రధాని, ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన అక్కసును వెల్లగక్కాడు. ప్రస్తుతం క్రికెట్‌ను డబ్బే శాసిస్తోందని, ఆటగాళ్లనే కాకుండా క్రికెట్ బోర్డులను సైతం డబ్బే నడిపిస్తుందని అన్నారు. ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు బీసీసీఐయేనని, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి 90 శాతం నిధులు భారత దేశమే సమకూరుస్తుందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ బోర్డు అంత ధనికమైంది కాబట్టే.. ప్రపంచంలోని క్రికెట్ ఆడే దేశాలన్నిటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చేస్తుందని తెలిపాడు. క్రికెట్లో డబ్బంతా భారత్‌లోనే ఉందని, అందుకే క్రికెటర్లయినా, క్రికెట్ బోర్డులైనా బీసీసీఐకి దాసోహమంటారని ఐపీఎల్‌ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. పాక్ పర్యటన నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు అర్ధంతరంగా తప్పుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. పాక్ లాంటి చిన్న దేశాలతో ఆడుతూ.. ప్రపంచ క్రికెట్‌ను ఏదో ఉద్దరిస్తున్నామని కివీస్, ఇంగ్లండ్ జట్లు భావిస్తున్నాయని, పాక్ విషయంలో వ్యవహరించినట్లు భారత్‌తో చేసేందుకు ఏ దేశాలు సాహసం చేయలేయని అన్నారు. మొత్తంగా ప్రపంచ క్రికెట్ సభ్య దేశాలన్ని భారత్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకు డబ్బే కారణమని భారత్ పట్ల అతనికున్న వ్యతిరేక భావన్ని మరోసారి వ్యక్తపరిచాడు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బీసీసీఐ నికర విలువ రూ.14,489 కోట్లుగా ఉందని, ఇంత డబ్బున్న క్రికెట్ బోర్డును ఏ దేశమైన వ్యతిరేకించేందుకు సాహసించదని పేర్కొన్నాడు. చదవండి: Daniel Christian: ఆర్సీబీని ముంచేశారు కదరా; ప్లీజ్.. నా భార్యను వదిలేయండి! -
బంతిని ఎదుర్కోబోయి బ్యాట్‌ను విసిరేసాడు...!
-
జింబాబ్వే అద్భుతం
గాలే: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం అత్యంత బలహీన జట్టుగా చెప్పుకునే జింబాబ్వే... శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమే చేసింది. లంక విసిరిన 317 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎవరూ ఊహించని విధంగా 47.4 ఓవర్లలోనే ఛేదించి ఔరా అనిపించింది. తద్వారా శ్రీలంక గడ్డపై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డులకెక్కింది. సాలొమన్ మిరే (96 బంతుల్లో 112;14 ఫోర్లు) అపూర్వ శతకంతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దాంతో జింబాబ్వే 47.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 322 పరుగులు చేసి నెగ్గింది. అంతకుముందు శ్రీలంక 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 316 పరుగులు సాధించింది. కుశాల్ మెండిస్ (86; 8 ఫోర్లు, 1 సిక్స్), ఉపుల్ తరంగ (79 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. -
ఒలింపిక్స్‌లో టి20 క్రికెట్‌ను చేర్చాలి
సచిన్, వార్న్ అభిప్రాయం లండన్: ప్రపంచ క్రికెట్లో అత్యంత ఆదరణ పొందిన టి20 ఫార్మాట్‌ను ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ప్రవేశపెడితే బాగుంటుందని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బౌలింగ్ గ్రేట్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. 1900 గేమ్స్‌లో చివరిసారిగా క్రికెట్ ఆడారు. అయితే మరోసారి ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను ఆడించడంపై వచ్చే నెలలో ఐసీసీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మధ్య చర్చలు జరుగనున్నాయి. ‘నిజంగా ఇది గొప్ప ఆలోచన. ఇందులో టి20 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుంది. క్రికెట్ గురించి ఏమాత్రం తెలి యని వారికైనా లేక ఈ ఆట గురించి పరిచయం చేయాలనుకున్నా ఈ ఫార్మాట్ ఉత్తమం. ముఖ్యంగా మూడు గంటల్లో మ్యాచ్ అయిపోతుంది’ అని 42 ఏళ్ల సచిన్ అభిప్రాయపడ్డారు. క్రికెట్‌ను ఒలింపిక్ గేమ్‌గా చూడడం తనకు చాలా ఇష్టమని వార్న్ అన్నారు. టి20 మ్యాచ్‌ను నిర్వహించడం తేలిక అని, తక్కువ సమయంలోనే అయిపోవడంతో రోజుకు రెండు, మూడు మ్యాచ్‌లను జరపొచ్చని వార్న్ తెలిపారు. మళ్లీ బ్యాట్ పట్టిన మాస్టర్: ఆల్ స్టార్స్ టి20 సిరీస్ కోసం సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ముంబైలో మంగళవారం నెట్ ప్రాక్టీస్‌లో మాస్టర్ -
బంగ్లా ఇన్.. విండీస్ ఔట్
దుబాయ్: వెస్టిండీస్ క్రికెట్‌కు షాక్. మినీ ప్రపంచ కప్‌గా భావించే 2017 చాంపియన్స్ ట్రోఫీకి విండీస్ అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు భారత ఉపఖండం జట్టు బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. టోర్నీ చరిత్రలో కరీబియన్లు తొలిసారి దూరమయ్యారు. 2015 సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్-8 జట్లు ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. తాజా ర్యాంకింగ్స్ జాబితాలో బంగ్లాదేశ్ ఏడో స్థానంలో నిలవగా, విండీస్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్ 1. ఆస్ట్రేలియా 2 భారత్ 3 దక్షిణాఫ్రికా 4 న్యూజిలాండ్ 5 శ్రీలంక 6 ఇంగ్లండ్ 7 బంగ్లాదేశ్ 8 పాకిస్థాన్ 9 వెస్టిండీస్ 10 ఐర్లాండ్ 11 జింబాబ్వే 12 ఆఫ్ఘనిస్థాన్ -
ఐదేళ్లు మా ఆధిపత్యమే ఉండాలి
టెస్టు కెప్టెన్ కోహ్లి వ్యాఖ్య న్యూఢిల్లీ : ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యం కనీసం ఐదేళ్ల పాటైనా కొనసాగాలని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కోరుకుంటున్నాడు. అలాగే జట్టు ఆటగాళ్లతో ధృడమైన స్నేహబంధాన్ని ఏర్పరుచుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ‘భారత ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదవలేదు. మాకు నంబర్‌వన్‌గా నిలిచే సామర్థ్యం కూడా ఉంది. అందుకే కనీసం ఐదారేళ్లపాటైనా ప్రపంచ క్రికెట్‌పై భారత జట్టు ఆధిపత్యం కొనసాగాలని అనుకుంటున్నాను. అయితే ఆ స్థాయికి చేరాలంటే మన ప్రయత్నాలు కూడా సరైన రీతిలోనే ఉండాలి. అలాగే తోటి ఆటగాళ్లతో నా స్నేహం పటిష్టంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏడాదిలో దాదాపు 290 రోజులైనా కలిసే ఉంటాం. అలాంటప్పుడు అందరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటేనే బాగుంటుంది. బయటి నుంచి చూసే వారు ఇది సమష్టి యూనిట్‌గా చెప్పుకోవాలి. వ్యక్తిగతంగా కాకుండా ఒకరి కోసం మరొకరు ఆడేలా ఉండాలి’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు బెదిరిపోకుండా ఓపిగ్గా ఎదురుచూడాల్సిందేనని సూచించాడు. ప్రపంచకప్ సెమీస్‌లో విఫలమైనందుకు అభిమానులు తన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారని, అయితే అలాంటి సమయంలో తమ కుటుంబాల మనోభావాలను కూడా అర్థం చేసుకోవాలని కోరాడు. -
విజయం..పరాభవం..వివాదం
2014లో భారత క్రికెట్ ప్రస్థానం టెస్టు సిరీస్ గెలుచుకోని సంవత్సరం నాలుగు వన్డే సిరీస్‌లు సొంతం రోహిత్ శర్మ చిరస్మరణీయ రికార్డు గత కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్‌ను శాసించిన భారత క్రికెట్ జట్టుకు 2014 మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. విజయాలతో పోలిస్తే వివాదాలు కూడా వెంట రావడంతో జట్టు ప్రభ కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. లార్డ్స్ టెస్టు విజయం మినహా జట్టు పరంగా గుర్తుంచుకోదగ్గ ప్రదర్శన ఏదీ నమోదు కాలేదు. వన్డేల్లో వ్యక్తిగతంగా రోహిత్ శర్మ రికార్డు ఊరటనిచ్చింది. టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ప్రదర్శన భారత అభిమానులు మరచిపోలేని చేదు జ్ఞాపకంగా మారింది. ఆటకు సంబంధం లేని అంశాల్లో నాటింగ్‌హామ్‌లో జడేజా, అండర్సన్ గొడవ, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ ఈ సారి మన క్రికెట్ జట్టును వార్తల్లో నిలిపాయి. ఏడాది చివర్లో డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లి, ధావన్ అంశం కూడా సంచలనం రేపింది. వీటన్నింటికి తోడు పాతికేళ్ల తర్వాత తొలిసారి సచిన్ టెండూల్కర్ పేరు లేకుండా భారత క్రికెట్ స్కోరు కార్డు కనిపించింది. (సాక్షి క్రీడా విభాగం) 2014లో భారత్ మూడు టెస్టు సిరీస్‌లలోనే పాల్గొంది. న్యూజిలాండ్‌లో జరిగిన 2 టెస్టుల సిరీస్‌లో 0-1తో ఓడింది. తొలి టెస్టులో పోరాడి విజయానికి చేరువగా వచ్చినా ఫలితం దక్కకపోగా...రెండో టెస్టులో మంచి అవకాశం ఉన్నా ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చి ‘డ్రా’తో సరిపెట్టింది. ఆ తర్వాత ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. తొలి టెస్టు డ్రాగా ముగిసినా చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో 28 ఏళ్ల తర్వాత టెస్టు నెగ్గి సంచలనం సృష్టించింది. ఇషాంత్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను 95 పరుగులతో చిత్తు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక వరుసగా మూడు టెస్టుల్లో పరాజయంపాలైంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి రెండు టెస్టులూ ఇప్పటికే ఓడింది. ఈ ఏడాది మెల్బోర్న్లో మరో టెస్టు మిగిలి ఉంది. ఆ మ్యాచ్ ఫలితం ఎలా ఉండనుందో చూడాలి. మరో వైపు చాలా ఏళ్ల తర్వాత భారత్ ఈ సారి సొంతగడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. విండీస్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఇక్కడ జరగాల్సిన సిరీస్ రద్దయింది. సొంతగడ్డపై సూపర్ ఈ ఏడాది భారత్ ఐదు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లతో పాటు ఆసియా కప్‌లో పాల్గొంది. సొంతగడ్డపై 5-0తో శ్రీలంకను, 2-1తో వెస్టిండీస్‌ను ఓడించింది. బంగ్లాదేశ్ వెళ్లి 2-0తో విజయం సాధించింది. వీటితో పాటు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత వన్డేల్లో 3-1తో అద్భుత విజయం సాధించి దీటైన బదులిచ్చింది. అయితే న్యూజిలాండ్‌లో మాత్రం ఐదు వన్డేల సిరీస్‌ను 0-4తో చిత్తుగా ఓడింది. ఆసియా కప్‌లో కూడా ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. వీడని నీడ స్పాట్ ఫిక్సింగ్ 2013లో వెలుగులోకి వచ్చినా సుప్రీంకోర్టులో తాజాగా సాగుతున్న విచారణ బీసీసీఐలో ప్రకంపనలు పుట్టించింది. ముఖ్యంగా బోర్డు అధికారుల తీరును పదే పదే కోర్టు తప్పుబట్టడం ఇబ్బందిగా మారింది. అరణ్య రోదన నాటింగ్‌హామ్ టెస్టులో జడేజాను దూషించాడంటూ భారత మేనేజ్మెంట్ అండర్సన్‌పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. తగిన సాక్ష్యాలు లేకపోవడంతో పాటు విచారణాధికారులు కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఫలితం జట్టుకు ప్రతికూలంగానే వచ్చింది. అండర్సన్‌కు ఎలాంటి శిక్ష పడకపోగా, భారత్ ఏకాగ్రత చెదిరి అది సిరీస్‌పై ప్రభావం చూపించింది. వ్యక్తిగతంగా... టెస్టుల్లో భారత్ తరఫున మురళీ విజయ్ 18 ఇన్నింగ్స్‌లలో 42.94 సగటుతో 773 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. వన్డేల్లోనైతే 20 ఇన్నింగ్స్‌లలో 58.55 సగటుతో విరాట్ కోహ్లి 1054 పరుగులు సాధించి తన నిలకడ ప్రదర్శించాడు. టెస్టు బౌలింగ్‌లో భారత్ తరఫున 12 మ్యాచ్‌లలో 36 వికెట్లతో ఇషాంత్ శర్మ అగ్రస్థానంలో నిలిస్తే, వన్డేల్లో మొహమ్మద్ షమీ 16 మ్యాచుల్లో 38 వికెట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో స్టువర్ట్ బిన్నీ 4 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి భారత తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. యువీపై ఆగ్రహం బంగ్లాదేశ్‌లో జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి విజేతగా నిలిచింది. పరాజయంకంటే స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రదర్శన సగటు అభిమానిని బాధపెట్టింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను 21 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయడాన్ని ఎవరూ మరచిపోలేరు. చిరస్మరణీయం అన్నింటికి మించి వన్డేల్లో రోహిత్ శర్మ 264 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పడం ఈ ఏడాది హైలైట్‌గా చెప్పవచ్చు. కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ అనితర సాధ్యమైన రీతిలో 173 బంతుల్లోనే 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. భవిష్యత్తులో వన్డేల్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుగా ఇది చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. మాటలకందని విషాదం ప్రపంచ క్రికెట్లో మాటలకందని విషాద సంఘటనకు 2014 సాక్షిగా నిలిచింది. సిడ్నీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బౌన్సర్ తగిలి గాయపడిన 25 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి చెందడం క్రీడాభిమానులను కలచివేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు, అభిమానులు హ్యూస్కు నివాళులు అర్పించారు. అండర్సన్ దూకుడు... న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కోరీ అండర్సన్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. క్వీన్స్‌టౌన్‌లో జనవరి 1న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ 36 బంతుల్లోనే 4 ఫోర్లు, 12 సిక్సర్లతో శతకం బాది షాహిద్ అఫ్రిది పేరిట 17 ఏళ్లుగా ఉన్న రికార్డును (37 బంతులు; 1996లో శ్రీలంకపై) బద్దలు కొట్టాడు. 2014 రికార్డులు (ఇప్పటివరకు) టెస్టుల్లో అత్యధిక పరుగులు : కుమార సంగక్కర (11 టెస్టుల్లో 1486) వికెట్లు : రంగన హెరాత్ (10 టెస్టుల్లో 60) అత్యధిక వ్యక్తిగత స్కోరు : కుమార సంగక్కర (319) అత్యుత్తమ బౌలింగ్ : రంగన హెరాత్ (9/127) వన్డేల్లో అత్యధిక పరుగులు : కుమార సంగక్కర (28 వన్డేల్లో 1256) వికెట్లు : అజంతా మెండిస్ (17 వన్డేల్లో 38) అత్యధిక వ్యక్తిగత స్కోరు : రోహిత్ శర్మ (264) అత్యుత్తమ బౌలింగ్ : స్టువర్ట్ బిన్నీ (6/4) -
బోథమ్‌పై బీసీసీఐ ఆగ్రహం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్‌ను నాశనం చేస్తోందన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ వ్యాఖ్యలపై బీసీసీఐ మండిపడింది. ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితబోధ చేసింది. అన్ని జట్ల క్రికెటర్లు ఐపీఎల్‌కు బానిసలవుతున్నారని, ఆయా క్రికెట్ బోర్డులు కూడా లీగ్‌కు మద్దతు పలుకుతున్నాయని బోథమ్ ఆరోపించారు. ‘ఐపీఎల్లో ఆడేందుకు ఇతర బోర్డులు ఎందుకు అంగీకరించాయని ఆయన అడిగారు. ముందు బోథమ్ నిజాలు తెలుసుకోవాలి. విదేశీ ఆటగాళ్లను లీగ్‌లో ఆడేందుకు అనుమతించినందుకు మేం ఆయా బోర్డులకు పది వేల యూఎస్ డాలర్ల చొప్పున నష్టపరిహారం కింద చెల్లించాం. మాకు సూచనలు ఇచ్చేందుకు దిగ్గజ ఆటగాళ్లున్నారు. బోథమ్లాంటి వ్యక్తుల సలహాలు మాకు అక్కరలేదు’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ స్పష్టం చేశారు. -
ఆసీస్‌కు అందేనా..?
ఆస్ట్రేలియా... ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టు... దశాబ్దాలుగా క్రికెట్‌ను శాసించిన, శాసిస్తున్న కంగారులు టెస్టులతోపాటు వన్డేల్లోనూ తమదైన ముద్ర వేశారు. సంప్రదాయ టెస్టుల్లో అనధికారిక చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు వన్డే ప్రపంచకప్‌లో నాలుగుసార్లు (1987, 1999, 2003, 2007) చాంపియన్‌గా నిలిచింది. ఇంతవరకు బాగానే ఉన్నా కంగారూలు మాత్రం టి20 ప్రపంచకప్‌కు వచ్చే సరికి మాత్రం చేతులెత్తేస్తున్నారు. ఇప్పటిదాకా ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ ఫార్మాట్లో ఏకంగా నాలుగు ప్రపంచకప్‌లు ముగిశాయి. కానీ ఆస్ట్రేలియాకు మాత్రం పొట్టికప్ అందని ద్రాక్షే అవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా గత ప్రదర్శన.. ఈ సారి ఆ జట్టు అవకాశాలపై ఓ లుక్కేద్దాం. 2007: సెమీస్‌తో సరి దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన 2007 తొలి టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. అప్పటికే వన్డే ప్రపంచకప్ (2007)ను కైవసం చేసుకోవడంతో కంగారూలే ట్రోఫీ ఎగరేసుకుపోతారని అంతా భావించారు. అలా టోర్నీలో కాలర్ ఎగరేసుకుంటూ బరిలోకి దిగిన ఆసీస్‌కు తొలి మ్యాచ్‌లోనే జింబాబ్వే ఝలక్ ఇచ్చింది. ఈ షాక్ నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా చావోరేవో తేల్చే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించింది. ఇక ప్రధాన రౌండ్లో పాక్ చేతిలో ఓడినా.. బంగ్లాదేశ్, శ్రీలంకపై నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే సెమీస్‌లో ఆస్ట్రేలియాకు ధోనిసేన షాకిచ్చింది. భారీ లక్ష్యాన్ని చేధించలేక కొద్ది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో కంగారూలు ఫైనల్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. 2009: తొలి రౌండ్లోనే... ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన రెండో టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పరిస్థితి మరీ దారుణం. తొలి రౌండ్లోనే ఆస్ట్రేలియా అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. గ్రూప్ ‘సి’లో వెస్టిండీస్, శ్రీలంక చేతిలో కంగారూలు చిత్తుగా ఓడిపోయారు. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వైఫల్యానికి ప్రధాన కారణం బౌలర్లే. బ్రెట్‌లీ, మిచెల్ జాన్సన్, షేన్ వాట్సన్ లాంటి బౌలర్లే ఆసీస్‌ను నిండా ముంచారు. ఆస్ట్రేలియా ప్రధాన టోర్నీల్లో ఇంత చెత్తగా ఆడటం ఇదే మొదటిసారి. 2010: చివర్లో బోల్తా 2009 టి20 ప్రపంచకప్ పీడకల నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా ఆ తర్వాతి ఏడాదే జరిగిన టి20 ప్రపంచకప్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తొలి రౌండ్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై... ప్రధాన రౌండ్లో భారత్, శ్రీలంక, వెస్టిండీస్‌లపై నెగ్గింది. ఆ తర్వాత సెమీస్‌లో పాకిస్థాన్‌పై దూకుడును ప్రదర్శించి టైటిల్ రేసులో నిలిచింది. ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియాను అదృష్టం వరించలేకపోయింది. ఫైనల్లో వైఫల్యంతో రన్నరప్‌తోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. 2012: రెండోసారి సెమీస్‌లో అవుట్ గత ప్రపంచకప్‌లో కొద్దిలో టైటిల్ చేజారడంతో ఈసారి ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలన్న పట్టుదలతో టోర్నీలో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే కంగారూలు ప్రత్యర్థులను మట్టికరిపించారు. తొలి రౌండ్లో పసికూన ఐర్లాండ్, వెస్టిండీస్‌లపై విజయం సాధించింది. ప్రధాన రౌండ్లో భారత్, దక్షిణాఫ్రికాలపై నెగ్గింది. ఈ గ్రూప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో మాత్రం ఆసీస్ చతికిలపడింది. లక్ష్యఛేదనలో చేతులెత్తేసింది. అయినా రెండు విజయాలతో సెమీస్‌కు చేరుకోగలిగింది. అయితే సెమీస్‌లో ఆసీస్ ఆటతీరు ఏమాత్రం మారలేదు. వెస్టిండీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని చేధించలేక ఓటమిని అంగీకరించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ జార్జ్ బెయిలీ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా మిగిలిన వారి నుంచి కనీస సహకారం కూడా లేకపోయింది. దీంతో సెమీస్‌లోనే కంగారూల కథ ముగిసినట్లయింది. 2014 ??? టి20ల్లో ఫేవరెట్ అనే పదానికి చోటు లేకపోయినా... బలాబలాలను బట్టి చూస్తే ఆస్ట్రేలియాకు చాంపియన్‌గా నిలిచే అర్హత ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టు అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. స్టార్ బ్యాట్స్‌మెన్ బెయిలీ (కెప్టెన్), వార్నర్, ఫించ్, హాడ్జ్, వైట్.... ఆల్‌రౌండర్లు వాట్సన్, క్రిస్టియాన్, ఫాల్క్‌నర్, హాగ్... బౌలర్లు జాన్సన్, స్టార్క్, కౌల్టర్. ఇలా జట్టులో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదువ లేదు. బంగ్లాదేశ్ వాతావరణ పరిస్థితులు, అక్కడి పిచ్‌లకు అలవాటు పడి సత్తా చాటితే ఆసీస్‌కు తిరుగుండదు. అలాగే ఈసారి అదృష్టం కూడా తోడైతే కంగారూలు తొలిసారిగా చాంపియన్‌గా నిలవడం పెద్ద కష్టమేమీ కాదు. -
బీసీసీఐ ఇక సూపర్ పవర్
బీసీసీఐని అన్నింటా ముందుండి నడిపిస్తున్న అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఇక మరో కీలక బాధ్యతను నిర్వర్తించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఐసీసీ బోర్డు తొలి చైర్మన్‌గా శ్రీని ఎంపికయ్యారు. వచ్చే జూలై నుంచి ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. సింగపూర్: ఎలాంటి సంచలనాలు లేవు. అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డుగా పేరు తెచ్చుకున్న బీసీసీఐ ఇక ఐసీసీలోనూ శక్తివంతం కానుంది. తాజా పునర్ నిర్మాణ ప్రతిపాదనలకు శనివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో ఐసీసీ నుంచి అధిక ఆదాయ వాటాతో పాటు పరిపాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం బోర్డుకు లభించినట్టయ్యింది. ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లకు కూడా సముచిత ప్రాధాన్యం లభించనుంది. ఈ వివాదాస్పద ప్రతిపాదనలను ప్రారంభం నుంచి దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయితే శనివారం సమావేశంలో అనూహ్యంగా దక్షిణాఫ్రికా కూడా మద్దతు ఇచ్చింది. దీంతో శ్రీలంక, పాక్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో ఎనిమిది శాశ్వత సభ్య దేశాలు ఐసీసీ పునర్ నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లయింది. వీటితో అన్ని దేశాలకు ఆర్థికపరంగా ప్రయోజనాలు కలుగుతాయని ఐసీసీ తెలిపింది. జూన్‌లో జరిగే తమ కౌన్సిల్ భేటీలో వీటికి మరోమారు లాంఛనంగా ఆమోదం తెలుపనున్నారు. దక్షిణాఫ్రికా అంగీకారం కీలకమైన ఓటింగ్‌కు ముందు హైడ్రామా నడిచింది. ఐసీసీలో బీసీసీఐ, సీఏ, ఈసీబీ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ)కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అయితే తాజా సవరణలు ఈ మూడింటికి అనుకూలంగా ఉన్నాయని, ఇవి అమల్లోకి వస్తే ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న తమకు తీరని నష్టమని సీఎస్ఏ వాదించిన విషయం తెలిసిందే. అటు శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు కూడా సీఎస్ఏకు వంత పాడాయి. అయితే బీసీసీఐ తాము అనుకున్నది సాధించాలంటే కనీసం ఎనిమిది సభ్య దేశాల మద్దతు అవసరం. దీంతో ఈ మూడింటిలో ఒకరిని బుజ్జగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ రంగంలోకి దిగారు. సీఎస్ఏ అధ్యక్షుడు క్రిస్ నెన్జానితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2015-23 మధ్య ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగేందుకు హామీ లభించింది. భారత్‌తో సిరీస్ అంటే కాసుల పంటే కాబట్టి సీఎస్ఏ మెత్తబడింది. అలాగే ఐసీసీతో తమకున్న అనుబంధం దృష్ట్యా ఇదే కాలంలో తమ దేశంలో ఓ మేజర్ ఈవెంట్ జరిగేలా చూడాలని నెన్‌జాని ఐసీసీని కోరారు. ఇవీ ఆమోదం పొందిన ప్రతిపాదనలు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఉండదు. దీని స్థానంలోనే ఇప్పటికే రద్దు చేద్దామనుకున్న చాంపియన్స్ ట్రోఫీని 2017, 2021లో నిర్వహిస్తారు. సంప్రదాయక టెస్టు ఫార్మాట్‌ను సంరక్షించుకునేందుకు టెస్టు క్రికెట్ నిధి ఏర్పాటు. బీసీసీఐ, సీఏ, ఈసీబీలకు మినహాయించి ఈ నిధిని టెస్టు ఆడే అన్ని దేశాలకు పంపిణీ చేస్తారు. అసోసియేట్ దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్న వాటికి టెస్టు హోదా దక్కే అవకాశాన్ని కూడా ఐసీసీ ఇవ్వనుంది. వచ్చే ఐసీసీ ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేత.. టెస్టు ర్యాంకుల్లో అట్టడుగున్న ఉన్న జట్టుతో ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంట్లో నెగ్గితే అసోసియేట్ జట్టుకు టెస్టు హోదా దక్కుతుంది. కొత్తగా ఐసీసీ చైర్మన్ పదవితో పాటు బోర్డుకు కీలక విషయాలపై నివేదిక ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కానుంది. సీఏ చైర్మన్ వాలీ ఎడ్వర్డ్స్ దీనికి నేతృత్వం వహించనున్నారు. ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీకి ఈసీబీ అధ్యక్షుడు గైల్స్ క్లార్క్ నేతృత్వం వహిస్తారు. ఈ రెండు కమిటీల్లో మూడు అగ్రబోర్డులతో పాటు రెండు ఇతర సభ్యదేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఇప్పటిదాకా కొనసాగిన భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ) స్థానంలో పరస్పర అంగీకార ద్వైపాక్షిక సిరీస్‌లు ఉంటాయి. ఆకర్షణీయ కొత్త హక్కుల ఒప్పందంలో అన్ని దేశాలకు అధిక ఆదాయం రానుంది. -
భారత్ బలంగా ఉంటే క్రికెట్‌కు మంచిది
కొత్త నిబంధనలను సమర్థించుకున్న శ్రీనివాసన్ న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో చేయబోయే కొత్త మార్పులు క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తాయని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ అన్నారు. కొన్ని సభ్య దేశాలనుంచి విమర్శలు వస్తున్నా తాజా ప్రతిపాదనలను ఆయన సమర్ధించుకున్నారు. భారత క్రికెట్ ఎంత బలంగా ఉంటే ప్రపంచ క్రికెట్‌కు అంత మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్రపంచ క్రికెట్‌కు నాయకత్వం వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ఐసీసీ కొత్త పద్ధతిని మేం సమర్థవంతంగా అమలు చేస్తాం. ఇది ప్రపంచ క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఆర్ధికపరంగా భారత్ బలంగా ఉండటం అందరికీ అవసరం’ అని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 8న సింగపూర్‌లో ఐసీసీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. కొత్త ప్రతిపాదనలు అనూహ్యమేమీ కాదని, చాలా ముందే అన్ని దేశాలకు తాను వివరించానని శ్రీనివాసన్ చెప్పారు. ‘మా ప్రతిపాదనల గురించి చెప్పి సలహాలు, సూచనలు స్వేచ్ఛగా చెప్పాలని కోరాం. అయితే ఎవరో ఒకరు ముందుగా డ్రాఫ్ట్ సిద్ధం చేయాలి కాబట్టి ఆ బాధ్యత మేం తీసుకున్నాం. అనేక సవరణల తర్వాతే ప్రస్తుత ప్రతిపాదనలను తయారుచేశాం’ అని శ్రీనివాసన్ వివరించారు. మూడు దేశాలతో ఏర్పాటు చేస్తున్న కమిటీ, ఐసీసీలో ఉన్న ఇతర కమిటీల్లాంటిదేనని...ఐసీసీ బోర్డుకే అన్ని నిర్ణయాధికారాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. కొత్త ప్రతిపాదనలతో ఎఫ్టీపీ రద్దవుతుందని, పెద్ద జట్ల దయపై ఇతర టీమ్‌లు ఆధార పడి ఉండాల్సి వస్తుందన్న వాదనను ఆయన కొట్టి పారేశారు. ‘ ప్రస్తుత ఎఫ్టీపీ ఎలాంటి గ్యారంటీ లేకుండానే సాగుతోంది. అదేమీ న్యాయపత్రం కాదు. దానికీ ఎవరూ కట్టుబడటం లేదు. అయితే ఇకపై ద్వైపాక్షిక ఒప్పందాలు అంతకంటే బలంగా ఉంటాయి. ఎఫ్టీపీ మరింత సమర్ధంగా పని చేస్తుంది. అసోసియేట్ దేశాలు కూడా సత్తా ఉంటే పెద్ద జట్లతో ఆడే అవకాశం మేం కల్పిస్తాం. అయితే ఇదేమీ ఒక్క సారిగా జరగదు. ఇది 10-20 ఏళ్ల ప్రక్రియ’ అని శ్రీనివాసన్ వివరణ ఇచ్చారు. -
శ్రీనివాసన్ పుణ్యమే
సాక్షి, హైదరాబాద్: ఐసీసీలో మార్పుల గురించి ప్రపంచ క్రికెట్లో పెద్ద దుమారమే రేగుతోంది. మాజీ క్రికెటర్లంతా కొత్త ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి శ్రీనివాసన్... భారత్ వైఖరి గురించి, ఐసీసీలో మార్పుల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ మార్పుల ఆలోచన శ్రీనివాసన్‌దేనని, దీనివల్ల భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్లో కూడా ఆదాయం పెరుగుతుందని ఆయన చెప్పారు. పటేల్ చెప్పిన వివరాలు ఆయన ఆటల్లోనే.. అది మన హక్కు: ఆట విషయంలో గానీ, ఆర్థి కాంశాల విషయంలో గానీ ఎన్నో ఏళ్లుగా భారత్‌దే పెద్ద పాత్ర. కాబట్టి వాటిలో వాటా కోరడం మన హక్కు. దురదృష్టవశాత్తూ గత బీసీసీఐ నాయకత్వంలో దీనిపై ఎవరూ దృష్టి పెట్టలేదు. శ్రీనివాసన్ ఆలోచన: ప్రస్తుత అధ్యక్షులు శ్రీనివాసన్ పూర్తిగా అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రతిపాదనలు తెచ్చారు. వీటిని రూపొందించేందుకు ఆయన నేతృత్వంలోని బృందం తీవ్రంగా శ్రమించింది. అధికారం కోసం కాదు: కొత్త ప్రతిపాదనల గురించి అనవసరపు అపోహలు ఉన్నాయి. మేం వాస్తవిక దృష్టిలో దీనిని రూపొందించాం. పవర్ గేమ్ ఆడుతున్నామని మా గురించి చెబుతున్నారు. అయితే ఇది అధికారానికి సంబంధించిన విషయం కాదు. మా మూడు పెద్ద దేశాలనుంచి ఎవరో ఒకరు ఐసీసీని నడిపించాల్సిన అవసరం ఉంది. ఆటలో, ఆదాయంలో భారత్ పాత్ర ఏమిటనేది అందరికీ తెలుసు. ఆర్థికంగా కూడా మాకు ఏది దక్కాలో అదే కోరుతున్నాం. అంతా అనుకున్నట్లే జరుగుతుందని మేం నమ్ముతున్నాం. అది నిరసన కాదు: కొత్త ప్రతిపాదనలపై స్వేచ్ఛగా చర్చించేందుకు అందరికీ అవకాశం ఇచ్చాం. ఒక్క పాకిస్థాన్ మినహా అందరూ దీనిని ఒప్పుకుంటారు. ఒక్కరి కోసం మేం ఆపాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లూ ఐసీసీ నుంచి అన్ని దేశాలకు ఏం లభిస్తుందో, ఇకపై కూడా అదే లభిస్తుంది. ఐసీసీలో బీసీసీఐ ఆధిపత్యం: అలాంటిదేమీ లేదు. మేం ఐసీసీ ఆదాయంలో అడుగుతున్న వాటా న్యాయమైనదే. భారత్ నుంచి 60 నుంచి 70 శాతం ఆదాయం వస్తోంది. కానీ ఐసీసీ నుంచి మనకు తిరిగి 4 శాతం మాత్రమే వచ్చేది. ఇది న్యాయం కాదు. ఆదాయాన్ని ఇస్తున్న దేశానికి ఎక్కువ వాటా రావాలి. ఇకపై అలా జరుగుతుంది. అలాగే ఐసీసీ ఆదాయం కూడా కొత్త ప్రతిపాదనల వల్ల కచ్చితంగా పెరుగుతుంది. టెస్టుల కోసం నిధి: టెస్టు క్రికెట్ ఆదాయ వనరు కాదు. కానీ అది ఆటలో భాగం. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను మినహాయించి మిగిలిన దేశాలు టెస్టులు ఆడినా నష్టపోకుండా ఉండేలా ప్రత్యేక నిధిని కేటాయిస్తాం. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో విజేతగా నిలిచిన జట్టుకు టాప్-10 దేశాలతో ఆడే అవకాశం దక్కుతుంది. -
ఇక ముగ్గురిదే పెత్తనం!
ఐసీసీలో భారీ మార్పులు దుబాయ్: ప్రపంచ క్రికెట్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఉన్న ఆధిపత్యం ఇక నామమాత్రమే కానుందా? ఈ అధికారం ఇక భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లకే చెందనుందా? తాజా పరిస్థితులను గమనిస్తే అవుననే సమాధానం వస్తుంది. ఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే రెవిన్యూ పరంగా అధిక ఆదాయాన్నిస్తున్న బీసీసీఐ, సీఏ, ఈసీబీలకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కట్టబెట్టనున్నారు. ఈమేరకు ఈనెల 28, 29న దుబాయ్‌లో జరిగే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఓ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నారు. ఈ మూడు బోర్డులు ముఖ్య సభ్యులుగా ఉన్న ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ ఎఫైర్స్ కమిటీ కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి వస్తే క్రికెట్‌పై గుత్తాధిపత్యం ఈ మూడు క్రికెట్ బోర్డుల చేతికే వస్తుంది. అలాగే ఐసీసీ ఆదాయంలో కూడా వీటికి భారీ వాటానే దక్కనుంది. అయితే ఈ ప్రతిపాదనలపై ఇతర సభ్య దేశాల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. ప్రతిపాదిత సవరణలు ఐసీసీకి వచ్చిన ఆదాయాన్ని క్రికెట్ బోర్డులకు పంచే విధానంలో మార్పు పరిపాలన నిర్మాణం, భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ) టెస్టు ర్యాంకింగ్స్ ఇచ్చే పద్దతి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ స్థానంలో చాంపియన్స్ ట్రోఫీ పునరుద్ధరణ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకంలో బీసీసీఐ, ఈసీబీ, సీఏలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం, ఇతర అన్ని కమిటీలపై అధికారాన్ని కల్పించడం ఐసీసీలో కీలక పదవులైన చైర్మన్, ఫైనాన్స్ అండ్ కమర్షియల్ ఎఫైర్స్ కమిటీ పదవులకు మూడు క్రికెట్ బోర్డుల నుంచే నామినేషన్లు వేయడం -
కోల్‌కతా మొత్తం మాస్టర్‌మయం
వన్డే సిరీస్‌లో భారత్ విజయం తర్వాత ఇప్పుడు పరుగుల వేదిక టెస్టులకు మారింది. సొంత గడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్ అంటే క్రికెట్ వీరాభిమాని కూడా దానిని పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో. అయితే ఇప్పుడు జరగబోయేది అలాంటిలాంటి సిరీస్ కాదు! ప్రపంచ క్రికెట్లో పాతికేళ్ల పాటు తనదైన ముద్ర వేసిన ఒక దిగ్గజ క్రికెటర్ రంగం నుంచి తప్పుకుంటున్న సందర్భమిది. కాబట్టి రెండు టెస్టుల్లో అతని ప్రతి కదలిక, ప్రతి పరుగుపై చర్చ సహజం... అందరికీ ఆసక్తికరం. ఈ నేపథ్యంలో 199వ టెస్టు వేదిక అయిన కోల్‌కతా ఇప్పుడు మాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నామమే జపిస్తోంది. -
అవినీతి నిరోధక కోడ్‌కు మార్పులు
లండన్: ప్రపంచ క్రికెట్లో రోజురోజుకూ వేళ్లూనుకుంటున్న ఫిక్సింగ్ జాడ్యానికి అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా తమ అవినీతి నిరోధక కోడ్‌ను సవరించి మరింత పకడ్బందీగా రూపొందించారు. కోడ్‌ను ఆమోదం కోసం వచ్చే జనవరిలో జరిగే సమావేశం ముందు ఉంచనున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు చెందిన తొమ్మిది మంది ఆటగాళ్ల ఫిక్సింగ్ వ్యవహారంపై వివరాలను సమీక్షించారు. అలాగే పాక్ యువ పేసర్ మహ్మద్ ఆమిర్‌పై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ఎత్తివేసే అంశం కూడా చర్చకు వచ్చినప్పటికీ సవరించిన కోడ్ అమల్లోకి వచ్చాక పరిశీలించేందుకు నిర్ణయించారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే టి20 ప్రపంచకప్ కోసం స్టేడియాల నిర్మాణానికి తుది గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. ఈనెల 27న ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఢాకాలో ప్రకటించనున్నారు. తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న అఫ్ఘానిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ (ఐడీఐ) బోర్డు 1.1మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు అనుమతించింది. -
మొహాలీలోనూ మెరిసేనా!
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం మొహాలీ: రెండో వన్డేలో దుస్సాధ్యమైన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (శనివారం) పంజాబ్ క్రికెట్ స్టేడియం (పీసీఏ)లో ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరుగుతుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యుత్తమ ఛేజింగ్‌తో రికార్డుకెక్కిన భారత ఆటగాళ్ల నుంచి నేటి వన్డేలోనూ అలాంటి ప్రదర్శనే కనబరచాలని అభిమానులు ఆశిస్తున్నారు. జైపూర్ వన్డేలో 360 పరుగులను శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసి కేవలం 44 ఓవర్లలోనే ఛేదించడంతో ఆస్ట్రేలియా జట్టుకు దిమ్మ తిరిగింది. ఓ రకంగా తమ ముందు ఎంత లక్ష్యముంచినా ప్రత్యర్థి ప్రశాంతంగా ఉండలేడని ఈ త్రయం నిరూపించింది. తొలి మ్యాచ్‌లో 300కు పైగా టార్గెట్‌ను అందుకోలేకపోయిన భారత జట్టు రెండో వన్డేలో మాత్రం తమ చాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి అతి భారీ స్కోరును అందుకున్న తీరు అమోఘం. అటు ఆసీస్ పటిష్ట భారత్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు రచిస్తోంది. కచ్చితంగా ఈ వన్డేలో నెగ్గి ఆధిపత్యం సాధించాలని చూస్తోంది. మరోవైపు పీసీఏ పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో మరోసారి అభిమానులకు పరుగుల విందు ఖాయం కానుంది. బ్యాటింగే బలం దుర్భేద్యమైన బ్యాటింగ్ ఆర్డర్ భారత జట్టుకు పెట్టని కోటలా ఉంది. ఓపెనర్లు ధావన్, రోహిత్ చెలరేగి శుభారంభాన్ని అందిస్తుండగా వన్‌డౌన్‌లో కోహ్లి సంచలన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆ తర్వాత రైనా, ఫామ్‌లో ఉన్న యువరాజ్, కెప్టెన్ ధోని, జడేజా తమ బ్యాట్లకు పని చెబితే ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగి పోవాల్సిందే. ఈ విషయం ఆసీస్ కెప్టెన్ బెయిలీకి కూడా బాగానే తెలుసు. అందుకే వన్డే ఫార్మాట్లో భారత్ టాప్-7 ఆటగాళ్లు అత్యద్భుతమని కితాబిచ్చాడు. ధావన్ తన తొలి టెస్టులోనే సెంచరీతో అదరగొట్టింది ఈ స్టేడియంలోనే కావడం అతడికి కలిసొచ్చే అంశం. యువరాజ్‌కు ఓరకంగా ఇది సొంత మైదానమే. రైనా, జడేజాలకు రెండో వన్డేలో అవకాశం రాకపోయినప్పటికీ భారీ స్కోర్లు సాధించాల్సి ఉంది. ప్రస్తుతం జట్టును ఆందోళన పరిచే విషయం ఒక్క బౌలింగ్ విభాగంలోనే. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేలు, ఓ టి20 కలుపుకుంటే మొత్తం 864 పరుగులను సమర్పించుకున్నారు. ఓవర్‌కు 7.20 చొప్పున పరుగులు ఇవ్వడం ఆందోళనపరిచే అంశం. ఒక్క భువనేశ్వర్ మినహా ఒక్కరు కూడా ఆసీస్‌ను ఇబ్బంది పెట్టడం లేదు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రెండు వన్డేల్లో ఓవర్‌కు ఎనిమిది పరుగుల దాకా ఇచ్చాడు. స్పిన్నర్ అశ్విన్ పూర్తిగా విఫలమవుతున్నాడు. దీంతో వినయ్, ఇషాంత్‌లలో ఒకరికి ఉద్వాసన తప్పకపోవచ్చు. ఒత్తిడిలో ఆసీస్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఊపులో రెండో వన్డే ఆడిన ఆసీస్‌కు భారత జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో ఆతిథ్య జట్టును ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితిలో పడింది. అయితే వీరి బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం అనుకూలాంశం. ఓపెనర్లు ఫించ్, హ్యూస్ జట్టుకు శుభారంభాన్నిస్తున్నారు. బెయిలీ ఈ సిరీస్‌లో బాగా ఆడుతున్నాడు. అటు వాట్సన్ కూడా ఫామ్‌లోకొచ్చాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్ రెచ్చిపోతున్నాడు. అటు బౌలింగ్ పరంగానూ భారత్‌తో పోలిస్తే మెరుగనే చెప్పుకోవచ్చు. జాన్సన్, ఫాల్క్‌నర్, మెక్కే రూపంలో మంచి పేసర్లున్నారు. సమష్టిగా రాణించి ఈ వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. జట్లు: (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, వినయ్, ఇషాంత్/ఉనాద్కట్. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, హ్యూస్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, హాడిన్, జాన్సన్, మెక్కే, వోజెస్, డోహర్తి, ఫాల్క్‌నర్. వాతావరణం మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేదు. పూర్తిగా ఎండ కాయనుంది. పిచ్ జైపూర్ పిచ్ తరహాలోనే ఇక్కడ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. మంచు కీలకం... ‘మొహాలీతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఇక్కడే తొలి టెస్టు సెంచరీ సాధించాను. ఇక్కడ పేసర్లకు, బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచు కూడా కీలకం కానుంది’ - శిఖర్ ధావన్ (భారత్ ఓపెనర్) ‘మా బౌలర్లపై నమ్మకముంది’ ‘రెండో వన్డేలో 360 పరుగుల లక్ష్యాన్ని భారత్ సులువుగా ఛేదించడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అయితే మా బౌలర్లను తప్పుపట్టాల్సిన పనిలేదు. వారిపై నాకు నమ్మకం ఉంది. మూడో వన్డేలోనూ షేన్ వాట్సన్‌ను వన్‌డౌన్‌లోనే బరిలోకి దించుతాం.’ - జార్జి బెయిలీ (ఆసీస్ కెప్టెన్) 0 మొహాలీలో ఇప్పటిదాకా ఒక్క భారత బ్యాట్స్‌మన్ కూడా సెంచరీ చేయలేదు 99 ఈ వేదికపై 2007లో సచిన్ చేసిన 99 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు 2 భారత్‌తో ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లో ఆసీస్ రెండు నెగ్గింది 5 ఈ మైదానంలో ఐదు సార్లు 300కు పైగా పరుగులు వచ్చాయి -
భారత కుర్రాళ్లకు టైటిల్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: సీనియర్ స్థాయిలోనే కాదు... జూనియర్ స్థాయిలోనూ ప్రపంచ క్రికెట్లో భారత్ తిరుగులేని శక్తిగా మారుతోంది. అండర్-19 నాలుగు దేశాల వన్డే టోర్నీలో భారత కుర్రాళ్లు ఇదే నిరూపించారు. టోర్నీ అంతటా నిలకడగా రాణించడంతో పాటు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నారు. వైఎస్ఆర్ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన తుది పోరులో భారత్ అండర్-19 జట్టు ఏకంగా 201 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టును చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 267 పరుగులు చేసింది. మూడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయినా కెప్టెన్ విజయ్ జోల్ (90 బంతుల్లో 71; 6 ఫోర్లు; 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. రికీ భుయ్ (53 బంతుల్లో 46; 3 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగులు జత చేశాడు. ఆ తర్వాత ముంబై చిచ్చర పిడుగు, 15 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ (58 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు) వేగంగా ఆడి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. జస్టిన్ డిల్కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు భారత స్పిన్ ధాటికి చేతులెత్తేసింది. 28.1 ఓవర్లలో కేవలం 66 పరుగులకే ఆలౌటయింది. 13 పరుగుల స్కోరు వద్ద మూడు వికెట్లు పడినప్పటి నుంచి ఆ జట్టు కోలుకోలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. జేసన్ స్మిత్ (41 బంతుల్లో 23; 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆమిర్ గనికి మూడు, కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌లో చెలరేగిన సర్ఫరాజ్ తన స్పిన్ బౌలింగ్‌తోనూ రెండు వికెట్లతో సత్తా చాటుకున్నాడు. మూడో స్థానానికి జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో జింబాబ్వేపై ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ 41.3 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయి 229 పరుగులు చేసి గెలిచింది.