బంగ్లా ఇన్.. విండీస్ ఔట్ | West Indies fail to qualify for Champions Trophy, Bangladesh make cut | Sakshi
Sakshi News home page

బంగ్లా ఇన్.. విండీస్ ఔట్

Published Wed, Sep 30 2015 3:40 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

బంగ్లా ఇన్.. విండీస్ ఔట్

బంగ్లా ఇన్.. విండీస్ ఔట్

దుబాయ్: వెస్టిండీస్ క్రికెట్కు షాక్. మినీ ప్రపంచ కప్గా భావించే 2017 చాంపియన్స్ ట్రోఫీకి విండీస్ అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్లో జరిగే ఈ మెగా ఈవెంట్కు భారత ఉపఖండం జట్టు బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. టోర్నీ చరిత్రలో కరీబియన్లు తొలిసారి దూరమయ్యారు. 2015 సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్-8 జట్లు ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. తాజా  ర్యాంకింగ్స్ జాబితాలో బంగ్లాదేశ్ ఏడో స్థానంలో నిలవగా, విండీస్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్

1. ఆస్ట్రేలియా 2 భారత్ 3 దక్షిణాఫ్రికా 4 న్యూజిలాండ్ 5 శ్రీలంక 6 ఇంగ్లండ్ 7 బంగ్లాదేశ్ 8 పాకిస్థాన్ 9 వెస్టిండీస్ 10 ఐర్లాండ్ 11 జింబాబ్వే 12 ఆఫ్ఘనిస్థాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement