జింబాబ్వే అద్భుతం
గాలే: ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత బలహీన జట్టుగా చెప్పుకునే జింబాబ్వే... శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమే చేసింది. లంక విసిరిన 317 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎవరూ ఊహించని విధంగా 47.4 ఓవర్లలోనే ఛేదించి ఔరా అనిపించింది. తద్వారా శ్రీలంక గడ్డపై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డులకెక్కింది.
సాలొమన్ మిరే (96 బంతుల్లో 112;14 ఫోర్లు) అపూర్వ శతకంతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దాంతో జింబాబ్వే 47.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 322 పరుగులు చేసి నెగ్గింది. అంతకుముందు శ్రీలంక 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 316 పరుగులు సాధించింది. కుశాల్ మెండిస్ (86; 8 ఫోర్లు, 1 సిక్స్), ఉపుల్ తరంగ (79 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు.