టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో పాటు ఇటీవలే ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా అతడు జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియా మేజర్ టోర్నీల్లో ఘోర ఓటములను చవిచూసింది.
ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ (2022), డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడి సారధ్యంలోని భారత జట్టు దారుణ పరాజయాలు మూటుగట్టుకుంది. ఈ క్రమంలో అతడి వ్యక్తిగత ప్రదర్శనపైనే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా రోహిత్‌పై చాలా మంది మాజీ క్రికెటర్‌లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ మాత్రం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. రోహిత్‌పై బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా అతడు వరల్డ్ క్రికెట్ లో టైగర్ అని బ్రెట్‌లీ కొనియాడాడు.
"ప్రపంచ క్రికెట్‌లో రోహిత్ శర్మ టైగర్. షార్ట్ బాల్స్‌ను ఆడటంలో అతడిని మించినవారు లేరు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా బౌలర్లపై ఎటాక్ చేసే సత్తా ఉన్న ఏకైక క్రికెటర్ రోహిత్. ప్రపంచంలో పుల్ షాట్లు ఆడే అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. మైదానంలో గాని ఆఫ్‌ధి ఫీల్డ్‌లో గాని రోహిత్ ఒక జెంటిల్‌మేన్. అతడు చాలా కూల్‌గా ఉంటాడు అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు.
చదవండి: MS Dhoni: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే..
Comments
Please login to add a commentAdd a comment