
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. రెండో మ్యాచ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కిషన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన తొలి బంతికే కిషన్ ఔటయ్యాడు. ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతికి అభిషేక్ శర్మ ఔట్ కాగా.. రెండో బంతికి కిషన్ పెవిలియన్‌కు చేరాడు. ఆ ఓవర్‌లో శార్ధూల్ రెండో బంతిని కిషన్‌కు లెగ్ సైడ్ డెలివరీగా సంధించాడు.
ఆ బంతిని ఇషాన్ లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. దీంతో కిషన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్‌ను రూ.11 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్
చదవండి: IND vs ENG: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ సిరీస్‌కు దూరం!